Home » Entertainment » Jabardasth Emmanuel Commenst On Varsha
Entertainment

వర్ష గురించి అడిగిన నెటిజన్‌.. చెప్పను బ్రదర్ అంటూ ఇమాన్యుయల్ కౌంటర్

Authored By
Admin
The Telugu News | Published on: December 23, 2020, 5:42 pm
Advertisement

జబర్దస్త్ షోలో ఈ మధ్య ఓ కొత్త జంట పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయేల్, వర్షల కాంబోపై సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తెలిసి.. జబర్దస్త్ టీం కూడా ఆ జంటను బాగానే వాడుకుంటున్నారు. ప్రోమోల్లో ఆ ఇద్దరికీ బాగానే స్పేస్ ఇస్తున్నారు. పైగా వర్ష, ఇమాన్యుయేల్ కథ కూడా హద్దులు దాటుతున్నట్టు కనిపిస్తోంది. వావ్ షోలో ఈ ఇద్దరూ పాల్గొని అక్కడా రచ్చరచ్చ చేశారు.

Advertisement

Jabardasth Emmanuel Commenst On Varsha

ఏకంగా ప్రపోజ్ చేస్తున్నాడంటూ ఇమ్మాన్యుయల్ గుట్టు రట్టు చేసేసింది. ఆ మధ్య రోజా కూడా అందరి ముందే అడిగేసింది. నల్లగా ఉంటే ఏంటి అందం ముఖ్యం కాదు.. ఇమాన్యుయల్ చాలా మంచి వాడు. నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఏకంగా చేతిని పట్టుకుని వదల్లేదు. మొత్తానికి వర్ష ఇమాన్యుయేల్ జంటకు మాత్రం సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. తాజాగా ఆ ఫాలోయింగ్‌ను దృష్టిలో పెట్టుకునే ఓ నెటిజన్ చిలిపి ప్రశ్న అడిగాడు.

Advertisement

ఇమాన్యుయల్ కాసేపటి క్రితం నెటిజన్లతో చిట్ చాట్ చేశాడు. అందులో వర్ష గురించి అతన్ని అడిగారు. దానికి సమాధనంగా వర్ష గుణగణాలను వివరించాడు. బ్యూటీ విత్ బ్రెయిన్.. చాలా మంచి అమ్మాయి.. హార్డ్ వర్క్ చేసే అమ్మాయి.. ఇంకా చాలా వున్నాయ్ కానీ చెప్పను బ్రదర్ అంటూ అసలు విషయం దాచి పెట్టేశాడు. మొత్తానికీ ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

Admin

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి