Home » Entertainment » Jabardasth Faima Slapped Bullet Bhasker
Entertainment

Jabardasth Faima : లాగి పెట్టి కొట్టిన ఫైమా.. షాక్ అయిన బుల్లెట్ భాస్కర్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 26, 2021 9:42 am
Advertisement

Jabardasth Faima జబర్దస్త్ షోలో ఎప్పుడు ఎవరు ఎలా హైలెట్ అవుతారు? ఎందుకు ఫేమస్ అవుతుంటారో చెప్పలేం. అలా ఇప్పుడు ఫైమా ఫుల్ ఫాంలో ఉంది. పటాస్ షో నుంచి కష్టపడుతూ వచ్చిన ఫైమాకు ఇప్పుడు తగిన గుర్తింపు వచ్చింది. జబర్దస్త్ షోలో అందరినీ ఓ ఆట ఆడిస్తోంది. బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తోన్న ఫైమా.. అందరినీ ఇమిటేట్ చేసి దుమ్ములేపేస్తోంది. ఇక బుల్లెట్ భాస్కర్‌ను అయితే దారుణంగా ఆడేసుకుంటుంది. బుల్లెట్ భాస్కర్, ఇమాన్యుయేల్, వర్ష, ఫైమా కలిసి చేస్తోన్న స్కిట్లు బాగానే పేలుతున్నాయి.

Advertisement

Jabardasth Faima Slapped Bullet Bhasker

చెంప చెల్లుమనిపించిన ఫైమా Jabardasth Faima

అయితే తాజాగా బుల్లెట్ భాస్కర్, ఫైమా ఓ స్కిట్ వేశారు. అందులో ఇమాన్యుయేల్ కూడా ఉన్నాడు. వచ్చే వారం రాబోతోన్న ఈ ఎపిసోడ్, ఈ స్కిట్‌కు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వచ్చింది. అందులో బుల్లెట్ భాస్కర్‌ను ఫైమా లాగి పెట్టి కొట్టేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ దెబ్బకు.. బుల్లెట్ భాస్కర్ పక్కకు తప్పుకున్నాడు. మొత్తానికి అసలు కథ తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కానీ ప్రోమోలో కాసింత హింట్ ఇచ్చేశారు.

Advertisement

Jabardasth Faima Slapped Bullet Bhasker

పెళ్లి, ప్రేమ అంటూ ఓ స్కిట్ వేశాడు. కన్యాదానం సినిమా టైపులో స్కిట్ ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇమాన్యుయేల్, ఫైమా ప్రేమించుకుంటే.. పెళ్లి మాత్రం భాస్కర్ చేసుకున్నట్టున్నాడు. ఇక పెళ్లి కంటే ప్రేమ గొప్పది అంటూ.. ఫైమాను ఇమాన్యుయేల్ వద్దకు తోసేశాడు. ప్రేమ కంటే పెళ్లే గొప్పది అని ఫైమానా భాస్కర్ వద్దకు తోసేశాడు ఇమాన్యుయేల్. అలా అటు ఇటూ తోయడంతో.. చిర్రెత్తుకొచ్చిన ఫైమా.. బుల్లెట్ భాస్కర్ చెంప పగలగొట్టింది. దీంతో అందరూ అవాక్కయ్యారు.

Advertisement

Jabardasth Faima Slapped Bullet Bhasker

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి