Home » Entertainment » Jabardasth Geetu Royal Comments
Entertainment

Jabardasth Geetu Royal : మేనేజ‌ర్‌తో ప‌డుకుంటే ఆఫ‌ర్ అన్నారు.. గ‌లాటా గీతూ షాకింగ్ కామెంట్స్

Authored By
Sam C
The Telugu News | Published on: June 3, 2022, 8:30 pm
Advertisement

Jabardasth Geetu Royal : ఇటీవ‌ల కొంద‌రు న‌టీమ‌ణులు త‌మ జీవితంలో ప‌డిన ఇబ్బందులు గురించి తెలియ‌జేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కుతున్నారు. తాజాగా గ‌లాటా గీతూ ఆసక్తిక‌ర కామెంట్స్ చేసింది.గీతూ రాయల్ ఈ మధ్య బుల్లితెరపై తెగ సందడి చేస్తుంది. చిత్తూరు యాసలో బెరుకు లేకుండా మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది. కానీ ఆమె గతంలో తన బిగ్ బాస్ రివ్యూస్ తో బాగా పాపులర్ అయ్యింది. గలాటా గీతూ పేరుతో ఆమె రివ్యూస్ చెప్పేది.ఇప్పుడు కూడా గలాటా గీతూ రాయల్ పేరుతో తెగ సంద‌డి చేస్తుంది. ఈ అమ్మ‌డికి చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చినప్పటికి నటన పరంగా నేను అప్పటికి సిద్ధంగా లేను. దీనితో ఆ చిత్రాలని నో చెప్పానని గీతూ అన్నారు.

Advertisement

అయితే కొన్ని చిన్న సినిమాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం గీతూ జబర్దస్త్ లో లేడి కమెడియన్ గా నవ్వులు పూయిస్తోంది. ఆ మ‌ధ్య పుష్ప స్పూఫ్ చేసి సంద‌డి చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి గీతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నానని గీతూ పేర్కొంది. ఆస్ట్రేలియాలో ఓ ఈవెంట్ ని హోస్ట్ చేసే అవకాశం వచ్చింది. నాకు హోస్టింగ్ అంటే ఇష్టం. మంచి రెమ్యూనరేషన్ కూడా ఇస్తామని చెప్పారు. దీనితో ఓకే అని చెప్పాను. ఆ ఈవెంట్ మూడు రోజుల పాటు జరుగుతుంది. తీరా టికెట్స్ బుక్ చేసే సమయానికి వాళ్ళ వ్యక్తి ఒకరు ఫోన్ చేశారు. మేడం మీకు పర్సనల్ గా ఓకే కదా అని అడిగారు.

Jabardasth Geetu Royal comments

Advertisement

Jabardasth Geetu Royal : గీతూ స్ట‌న్నింగ్ కామెంట్స్..

నేను తప్పుగా అర్థం చేసుకోకుండా.. నాకు హెల్ప్ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్ ని పెడతారేమో అనుకుని ఓకె అన్నాను. అతడు మరోసారి క్లారిటీ ఇస్తూ.. మేనేజర్ తో మీకు పర్సనల్ ఓకే అయితే రెమ్యునరేషన్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు. అతడి మాటలకు నా మైండ్ దొబ్బింది. దీనితో వెంటనే కుదరదు అని ఫోన్ పెట్టేశాను. కానీ పర్సనల్ గా ఇష్టం లేకుంటే సరే.. కనీసం హోస్టింగ్ అయినా చేయండి అంటూ వరుసగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ నాకు చాలా భయం వేసింది. రిస్క్ ఎందుకని ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకున్నాను అని గీతూ పేర్కొంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి