jabardasth lady engaged with munna
Jabardasth : ఒకప్పుడు జబర్ధస్త్ షో ఎంతో వినోదం పంచుతూ సక్సెస్ ఫుల్‌గా సాగుతూ ఉండేది . కాని ఇప్పుడు మాత్రం కాంట్రవర్సీస్‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. అప్పట్లో అమ్మాయి పాత్రల కోసం మగవాళ్లే లేడి గెటప్స్ వేసే వాళ్లు. కాని ఆ తర్వాత అమ్మాయిల జబర్ధస్త్ షోలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. వారిలో ఫైమా, రోహిణి, గతంలో సత్య ఇలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అప్పుడప్పుడు జబర్దస్త్‌లో మరో అందమైన యువతి కూడా కనిపిస్తుంటుంది. ఆమె షబీనా. సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న షబీనా.. అడపాదడపా జబర్దస్త్‌లో మెరేసిది.
కెవ్వు కార్తీక్ టీంలో మెరిసే షబీనాకి నరేష్‌కి ఏదో లింక్ ఉందంటూ అప్పట్లో తెగ వార్తలు హల్‌చల్ చేశాయి. కాని వాటన్నింటికి చెక్ పెడుతూ తాను పెళ్లి చేసుకోబోతన్నట్లు ప్రకటించింది. అంతేకాక నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేసి అందరికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం షబీనా ఎంగేజ్‌మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మున్నా అనే వ్యక్తిని షబీనా వివాహం చేసుకోబోతుంది. సరిగా నెల రోజుల క్రితం అంటే జూలై 17న వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఆగస్టు 17 అనగా బుధవారం తన ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేసింది.
jabardasth lady engaged with munna
వీటితో పాటు తనకు కాబోయే భర్తను కూడా ట్యాగ్ చేసింది. అంతేకాక.. జూలై 17ని ఎన్నటికి మర్చిపోలేనని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. షబీనా సీరియల్స్‌లో కూడా మంచి పాత్రలు పోషించింది. కస్తూరీ సీరియల్‌లో గ్లామర్ పాత్రలో కనిపించడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత గృహలక్ష్మీ సీరియల్‌లోనూ కొన్ని రోజులు స్పెషల్ కారెక్టర్ వేసింది. ఇక అలా బుల్లితెరపై షబీనాకు మంచి ఇమేజ్ వచ్చింది.సోషల్ మీడియాలో కూడా ఈ అమ్మడు చాలా యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్స్ కి మంచి వినోదం పంచుతూ ఉంటుంది.
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.