Home » Entertainment » Jabardasth Nookaraju And Asia Marriage News
Entertainment

Jabardasth Nookaraju : ఎంగేజ్‌మెంట్‌ కు రెడీ అయిన జబర్దస్త్‌ జోడీ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 23, 2022, 8:00 pm
Advertisement

Jabardasth Nookaraju : జబర్దస్త్‌ ఆరంభంలో యాంకర్‌ రష్మీ మరియు సుధీర్ ల ప్రేమ విషయాన్ని ఎంతగా పాపులర్ చేశారో అందరికి తెల్సిందే. నిజంగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారా.. ఒకటి రెండు నెలల్లో లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూసిన రోజులు ఎన్నో. అలాంటి యాంకర్‌ రష్మి మరియు సుధీర్ ల ప్రేమ వ్యవహారం కేవలం టీఆర్పీ రేటింగ్ స్టంట్ అంటూ తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా ప్రేమ కథలు తెర ముందుకు వచ్చాయి. కాని ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేక పోయింది. అయితే కొన్ని రియల్‌ ప్రేమ వ్యవహరాలు కూడా ఉన్నాయి. అందులో రాకేష్‌ మరియు సుజాతల ప్రేమ జోడీ ఒకటి కాగా నూకరాజు ఇంకా ఆసియాల జోడీ.

Advertisement

ఇప్పటికే రాకేష్‌ మరియు సుజాతల ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. ఇద్దరి పెళ్లి విషయంలో చర్చలు జరిగాయి. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు నూకరాజు మరియు ఆసియాల ప్రేమ విషయం గురించి చర్చ జరుగుతోంది. వీరిద్దరిది మతాంతర వివాహం అవ్వడం వల్ల కాస్త హాట్ టాపిక్ గా ఉంది. మొన్నటి వరకు కుటుంబ సభ్యులు అడ్డుకోవడం వల్ల ప్రేమ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసించలేదు. కాని తాజాగా ఇద్దరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించారు. మద్యలో బ్రేక్ అయినందుకు నూకరాజు ఏకంగా ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనతో ఇద్దరు మళ్లీ కలిసి పోయారు.. నిజంగా ప్రేమలో ఉన్నారు అంటూ క్లారిటీ వచ్చింది.

Jabardasth Nookaraju and asia marriage news

Advertisement

తాజాగా ఒక జబర్దస్త్‌ కమెడియన్‌ తన యూట్యూబ్‌ ఛానల్ లో నూకరాజు మరియు ఆసియా ల ప్రేమ గురించి… వారు ఇద్దరు ఎంగేజ్మెంట్‌ చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఆ కమెడియన్ అధికారికంగా ప్రకటించడం వల్ల ఇది ఖచ్చితంగా నిజం అయ్యి ఉంటుంది అనేది చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మతాంతర వివాహం కు కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా ఓకే చెప్పారు అంటూ ఆ వీడియో లో సదరు కమెడియన్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది లోనే పెళ్లి కూడా ఉంటుందని నూకరాజు సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తానికి జబర్దస్త్‌ మొదటి జోడీ పెళ్లికి సిద్దం అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ నూకరాజు మరియు ఆసియా కు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి