Home » Entertainment » Jabardasth Patas Nukaraju And Asia Love Story And Breakup Issue
Entertainment

Jabardasth : జబర్దస్త్‌ లో ఆ ప్రేమ జంట కనిపించడం లేదేం.. ఆ రియల్‌ కపుల్‌ బ్రేకప్ అయ్యారా?

Authored By
aruna
The Telugu News | Published on: April 7, 2022, 8:00 pm
Advertisement

ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమం తో కమెడియన్ గా నూక రాజు మంచి పేరును దక్కించుకున్నాడు. నటుడిగా ప్రస్తుతం నూకరాజు ఏ స్థాయిలో దూసుకెళ్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జాతి రత్నాలు షో ల్లో కూడా నూకరాజు కనిపిస్తు సందడి చేస్తున్నాడు. నూకరాజు పటాస్ లో ఉన్న సమయంలోనే ఆసియా అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరు కూడా ప్రేమ లో ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఇద్దరు కలిసి స్కిట్ లు చేయడం ఆ స్కిట్ లో రొమాన్స్ మరియు లవ్ చూపించడం చేసేవారు. ఇద్దరు కూడా మంచి సక్సెస్ అయ్యాయి. ఇద్దరి యొక్క వ్యవహారం జోరు మీద ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అంటూ ప్రచారం మొదలైంది.

Advertisement

నూకరాజు మరియు ఆసియా జోడిని జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజీల పై చూడడం ద్వారా ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇమాన్యూల్‌ మరియు వర్ష జోడి కచ్చితంగా టీఆర్‌పీ కోసం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆసియా మరియు నూకరాజుల ప్రేమ మాత్రం నిజమైన ప్రేమ.. జోడి అంటారు. వీళ్లని టిఆర్పి రేటింగ్ కోసం వాడుకోలేదు. వాళ్లు కూడా తమ ప్రేమ ముచ్చట్లు కొంత వరకు పరిమితం చేసి చూపించే వారు. ఒక కార్యక్రమంలో నూకరాజు తనతో మాట్లాడటం లేదని ఆసియా కన్నీళ్లు పెట్టుకోవడంతో వారిద్దరి మద్య ఉన్న బాండింగ్ ఏంటో తేలిపోయింది. దాంతో ఇద్దరిపై జనాల్లో మరింతగా అభిమానం పెరిగింది.

Jabardasth Patas nukaraju and asia love story and breakup issue

Advertisement

కానీ ఈ మధ్య ఆసియా మరియు నూకరాజు కామెడీ రావడం లేదు. నూకరాజు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. ఆసియా కూడా పలు కార్యక్రమాల్లో ఉంటుంది. కానీ ఎక్కువ యాక్టివ్ గా ఆమెను చూపించే ప్రయత్నం చేయడం లేదు. నూకరాజు కావాలనుకుంటే ఆమెను స్టేజ్ ఎక్కించి సందడి చేయగలడు. కానీ ఆమెను కాస్త దూరంగానే ఉంచుతున్నాడు. దాంతో అసలేమైంది అనేది చర్చ జరుగుతోంది. వీరిద్దరు కూడా కలిసే ఉన్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నూకరాజు మరియు ఆసియా మధ్య వ్యవహారం బెడిసికొట్టిందా లేదంటే కావాలని దూరం గా ఉంటున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారానికి కుటుంబ పెద్దలు ఓకే చెప్పక పోవడం వల్ల దూరం దూరంగా ఉంటున్నారు అనేది జబర్దస్త్ వర్గాల్లో పుకార్లు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లు నిజం కావద్దని మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి