Jabardasth Pavithra purchase new car
Jabardasth Pavithra : పవిత్ర అంటే పెద్దగా తెలియకపోవచ్చు కాని జబర్ధస్త్ పవిత్ర అంటే అందరు ఠక్కున గుర్తు పడతారు. జబర్దస్త్ లో ఫేమస్ అయ్యిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారు. యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ వల్లనే అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ షోలో మొదట్లో మహిళలు స్కిట్స్ చేసేవాళ్ళు లేదంటే ట్రాన్స్ జెండర్ లను లేదా మగవాళ్ళకి ఆడవాళ్ళ వేషాలు వేసేవారు.కాని తర్వాత తర్వత ఆడవాళ్లు కూడా ఈ షోలో సందడి చేశారు. అలా జబర్ధస్త్ లోకి వచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది పవిత్ర. చూడ్డానికి హైట్ తక్కువగా ఉండే పవిత్ర అదిరిపోయే పంచ్ లతో నవ్విస్తూ ఉంటుంది.
బుల్లెట్ భాస్కర్, వెంకీ పవిత్ర హైట్ పైనే పంచ్ లు వేస్తూ కామెడీ పండిస్తున్నారు నిజానికి పవిత్ర మొదట్లో సీరియల్స్ లో కూడా నటించింది. కానీ సీరియల్స్ లో అంతగా పాపులారిటీ రాలేదు. కానీ జబర్దస్త్ ద్వారా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది. ఈ అమ్మడు ప్రస్తుతం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ లతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫెస్టివల్ స్పెషల్ ఈవెంట్స్ లాంటి ప్రోగ్రామ్స్ లో పవిత్ర రెగ్యులర్ గా కనిపిస్తుంది. అలాగే యూట్యూబ్ లో కూడా పాగల్ పవిత్ర అనే పేరుతో సొంతంగా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలోను పవిత్ర ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Jabardasth Pavithra purchase new car
తాజాగా పవిత్ర అందరికి సర్‌ప్రైజ్ న్యూస్ అందించింది. ఏకంగా కొత్త కారు కొన్న వార్తను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. అలాగే యూట్యూబ్ తాను కారు కొన్న వీడియోను వ్లాగ్ రూపంలో రిలీజ్ చేసింది. అయితే.. తనతో ఎప్పుడు తోడుగా కనిపించే జబర్దస్త్ రోహిణిని తోడుగా తీసుకెళ్లి పవిత్ర కారు కొనుక్కుంది. హ్యుందాయ్ ఐ20 మోడల్ కారును కొన్న పవిత్ర.. తన తల్లికి వీడియో కాల్ ద్వారా విషయాన్నీ చెప్పేసింది. ప్రస్తుతం పాగల్ పవిత్ర కొత్త కారు కొనుగోలు చేసిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఈ వీడియోకి చాలా మంది కామెంట్స్ కురిపిస్తున్నారు.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.