Jabardasth Show : జబర్దస్త్@500… ఇండియన్ బుల్లి తెరపై ఒక సంచలనం..!!
Jabardasth Show : తెలుగు బుల్లి తెర చరిత్రలోనే కాకుండా ఇండియన్ బుల్లి తెర చరిత్రలో నిలిచి పోయే షో జబర్దస్త్. 10 సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ జబర్దస్త్ కార్యక్రమం మొదట కేవలం 13 ఎపిసోడ్స్ గా మాత్రమే నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. అందుకు తగ్గట్లుగానే కమెడియన్స్ కి మరియు జడ్జ్ లకి యాంకర్ కి ఒప్పందం ఇచ్చారు. కానీ కార్యక్రమం రెండు మూడు ఎపిసోడ్స్ పూర్తి అవ్వగానే సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇలాంటి కామెడీ షో ఇప్పటి వరకు రాలేదు ఇక ముందు రాదు అన్న స్థాయిలో జబర్దస్త్ సూపర్ హిట్ అయింది.
దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏకంగా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 10 సంవత్సరాల పూర్తి చేసుకోబోతున్న జబర్దస్త్ కార్యక్రమం 500 ఎపిసోడ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో మాజీ జడ్జ్ రోజా ప్రత్యేక ఎపిసోడ్ కి హాజరైంది. వచ్చే వారం టెలికాస్ట్ కాబోతున్న ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. జబర్దస్త్ లో వారి వారి జర్నీ గురించి కమెడియన్స్ చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తినడానికి తిండి లేని వారు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారంటే అదే జబర్దస్త్ కారణం
jabardasth show completed 500 episodes get rare record
అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన జీవితాలను అనామకులకు అందించిన జబర్దస్త్ కార్యక్రమం ఇప్పటికీ ఎప్పటికీ నెంబర్ వన్ షో అంటూ ఈటీవీ వారు బల్ల గుద్ది మరి చెప్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ బుల్లి తెర చరిత్రలో నెంబర్ వన్ రేటింగ్ దక్కించుకుంది. ఇప్పుడు రేటింగ్ కాస్త తగ్గినా కానీ అద్భుతమైన రెస్పాన్స్ మాత్రం వస్తుంది. జబర్దస్త్ అనేది ఒక బ్రాండ్ గా ముద్రించబడింది. ఈ బ్రాండ్ మరో 10 సంవత్సరాల పాటు కొనసాగుతూ.. 1000 ఎపిసోడ్లు కూడా పూర్తి చేసుకోవాలని మనమంతా కూడా మనస్పూర్తిగా కోరుకుందాం.
