Home » Entertainment » Jabardasth Varsha Emotional After Watching This Scene
Entertainment

Jabardasth Varsha : ఆ సీన్‌ చూసి ఎమోషనల్.. వెక్కి వెక్కి ఏడ్చేసిన వర్ష

Authored By
Sam C
The Telugu News | Updated on: February 28, 2022 7:52 pm
Advertisement

Jabardasth Varsha : ప్ర‌స్తుతం బుల్లితెర‌పై స‌క్సెస్ ఫుల్‌గా సాగుతున్న పాపుల‌ర్ షోల‌లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక‌టి. ఈ వేదిక‌పై చేసే సంద‌డి మాములుగా ఉండదు. కామెడీ, ఎమోష‌న‌ల్, డ్యాన్స్ ప‌ర్‌ఫార్మెన్స్, సింగింగ్ ఇలా ప్ర‌తి ఒక్క అంశంతో తెగ‌సంద‌డి చేస్తుంటారు. అయితే వ‌చ్చే ఆదివారంకి సంబంధించి ప్రోమో విడుద‌ల కాగా, ఇందులో సుజాత ప‌ర్‌ఫార్మెన్స్ కి వ‌ర్ష క‌న్నీరు పెట్టుకుంటుంది. సుజాత తాను క‌డుపుతో ఉన్నాన‌ని భ‌ర్తతో చెప్ప‌గా, అందుకు ఆమె భ‌ర్త పాత్ర పోషిస్తున్న వ్యక్తి అబ్బాయి పుట్ట‌క‌పోతే మాములుగా ఉండ‌దు అని నెట్టిప‌డేస్తాడు. ఆ స‌మ‌యంలో సుడిగాలి సుధీర్, రాకింగ్ రాకేష్‌తో పాటు వ‌ర్ష క‌న్నీరు పెట్టుకుంటారు. ఇలానే బ‌యట చాలా జ‌రుగుతున్నాయంటూ వ‌ర్ష చాలా ఎమోష‌న‌ల్ అయింది.

Advertisement

ఇక ప్రోమో చివ‌ర‌లో ప‌లువురు కంటెస్టెంట్స్ త‌మ త‌ల్లుల పాదాలని క‌డిగి నీళ్లు నెత్తి మీద చ‌ల్లుకున్నారు. ప్రోమో చాలా ఎమోష‌న‌ల్‌గా సాగ‌గా, ఇది ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు పెట్టిస్తుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది. అంతేకాక ఈ వీడియో చూసిన ప్ర‌తి ఒక్క‌రు కంట క‌న్నీరు పెట్టుకుంటున్నారు. ఇక వ‌ర్ష విష‌యానికి వ‌స్తే జబర్దస్త్` వర్ష యంగ్‌ సెన్సేషనల్‌గా మారుతుంది. యాంకర్‌గా, సీరియల్‌ నటిగా రాణించిన ఈ భామ `జబర్దస్త్`తో ఒక్కసారిగా దూసుకొచ్చింది. టీవీ ఆడియెన్స్ కి, సోషల్‌ మీడియా అభిమానులను మెస్మరైజ్‌ చేస్తూ యువ అందాల తరంగంలా మారింది.

Jabardasth Varsha emotional after watching video

Advertisement

Jabardasth Varsha : వ‌ర్ష కంట క‌న్నీరు…

`శ్రీదేవి డ్రామా కంపెనీ` షోలో భాగంగా ఈ అందాల భామ మరింత అందంగా ముస్తాబై పరువాల విందుని వడ్డించింది. కవ్వించే చూపులతో కుర్రాళ్లకి గిలిగింతలు పెడుతుంది. ఆయా ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సండే సందర్భంగా బెస్ట్ విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయని చెప్పొచ్చు. జబర్దస్త్`తో పాటు పలు టెలివిజన్ కార్యక్రమాలలో వర్ష ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈవెంట్స్ లో ఆమె ప్రజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.సీరియల్ నటిగా ఒకటి రెండు సీరియల్స్ లో నటించినా వర్షకు సరైన గుర్తింపు రాలేదు. దీనితో మోస్ట్ పాపులర్ కామెడీ షో జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి