Home » Entertainment » Jabardasth Varsha Fire On Trollers
Entertainment

Jabardasth Varsha : జబర్దస్త్ వ‌ర్ష చావు, బ్ర‌త‌కుల మ‌ధ్య ఉందా?

Authored By
Sam C
The Telugu News | Published on: June 24, 2022, 12:30 pm
Advertisement

Jabardasth Varsha : బుల్లితెర‌పై త‌న చ‌లాకీ మాట‌లతో పాటు అందంతోను ఆక‌ట్టుకుంటున్న ముద్దుగుమ్మ వ‌ర్ష‌. జబర్దస్త్ వేదికగా కామెడీ పంచుతూనే రొమాంటిక్ జోడీగా పేరు తెచ్చుకున్నారు ఇమ్మానుయేల్‌- వర్ష. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్‌ఫార్‌మెన్స్ జనం మెప్పు పొందాయి. వర్షతో ఇమ్మూ కనిపించాడంటే చాలు కన్నార్పకుండా చూస్తుంటారు ఆడియన్స్. వర్ష అందం, కామెడీ టైమింగ్ చూసి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. దీంతో ఆమె ఫాలోయింగ్ మంచి రెట్టింపవుతూ వస్తోంది.

Advertisement

‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ షోలో కూడా సందడి చేస్తోంది వర్ష. తరచూ ఇమ్మానుయేల్‌తో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయింది. ఇక కొద్ది రోజుల క్రితం వీళ్లిద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా చూపించారు. దీంతో అతనికి సూపర్ జోడీగా పేరు తెచ్చుకుంది వర్ష. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మ‌డు త‌న అంద‌చందాలు ఆర‌బోస్తూనే మ‌రోవైపు త‌న‌పై వ‌చ్చే నెగెటివ్ కామెంట్స్‌పై ఘాటుగా స్పందిస్తూ ఉంటుంది. తాజాగా వ‌ర్ష‌పై ఓ రూమ‌ర్ స్ప్రెడ్ కాగా, దానిపై సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. తాజాగా ఓ థంబ్‌నెయిల్ వర్షపై రెడీ చేసి వీడియో వదిలారు.

Jabardasth Varsha fire on trollers

Advertisement

Jabardasth Varsha : వ‌ర్ష ఫైర్..

దీనిపై చావు బతుకుల మధ్య జబర్దస్త్ వర్ష అని రాశారు. దీంతో అసలు వర్షకు ఏమైంది? అంతా కంగారు పడ్డారు. ఇది వర్ష దృష్టికి రావడంతో ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. తనపై వస్తున్న వార్తలు, పుకార్లను ఖండిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా చావు బతుకుల మధ్య జబర్ధస్త్ వర్ష అంటూ కనిపించిన న్యూస్‌ థంబ్‌నెయిల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసి అసలు విషయం చెప్పేసింది వర్ష. దీంతో పుకార్ల‌కి పులిస్టాప్ పడ్డ‌ట్టు అయింది. వర్ష ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌లో కొత్తద‌నాన్ని ప్ర‌జెంట్ చేస్తూ కేక పెట్టిస్తుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి