Home » Entertainment » Jabardasth Varsha Mind Blowing Looks
Entertainment

Jabardasth Varsha : తెల్ల‌ని దుస్తుల‌లో అందాలు ఆర‌బోస్తూ మ‌తులు పోగొడుతున్న వ‌ర్ష‌

Authored By
Sam C
The Telugu News | Published on: May 11, 2022, 7:00 pm
Advertisement

Jabardasth Varsha : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మేల్ ఆర్టిస్ట్‌లు చాలా మంది ఫేమ‌స్ అయ్యారు. అయితే ఫీమేల్ ఆర్టిస్ట్‌లు కూడా ఇప్పుడిప్పుడే మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారిలో జ‌బ‌ర్ధ‌స్త్ వ‌ర్ష ఒక‌రు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బుల్లితెరపైకి వచ్చిందీ భామ. అందానికి అందం.. టాలెంట్‌కు టాలెంట్ ఉండడంతో సక్సెస్ అయింది. దీంతో ఇప్పుడు చేతి నిండా షోలు, సీరియళ్లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ‘అభిషేకం’, ‘తూర్పు పడమర’, ‘ప్రేమ ఎంత మధురం’ వంటి సీరియళ్లలో నటించి మెప్పించింది. అందంతో పాటు అద్భుతమైన నటనతో వర్ష చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Advertisement

కామెడీ షోకు కావాల్సిన టైమింగ్ కూడా పుష్కలంగా ఉండడంతో ఈ బ్యూటీ వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది.జ‌బర్ధస్త్‌తో పాటు పలు స్పెషల్ ఈవెంట్లలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. వీటితో పాటు ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ అనే షోలోనూ భాగమైంది. వ‌ర్ష ఉంటే ఆ సంద‌డే వేరు. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. ఈ బుల్లితెర సెలబ్రిటీ తెల్లని దుస్తుల్లో దేవకన్యలా తోచింది. వెన్నెలను మిగేసిందా లేక మబ్బులతో స్నానం చేసినట్లుంగా… మెరిసిపోతున్న ఆమె గ్లామర్ కట్టిపడేస్తుంది. ఇప్పుడు వ‌ర్ష పిక్స్ నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Jabardasth Varsha mind blowing looks

Advertisement

Jabardasth Varsha : వ‌ర్ష గ్లామ‌ర్ షో..

క్యూట్ లుక్స్‌కి కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు.జబర్ధస్త్ వర్ష.. యంగ్ కమెడియన్ ఇమాన్యూయేల్‌తో లవ్ ట్రాక్ వల్ల మరింత పాపులర్ అయింది. అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ చేసే స్కిట్ల వల్లే భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. ఇక, తరచూ అతడితో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోతూ హాట్ టాపిక్ అయిపోయింది. రావడమే వర్ష గ్లామర్ కి ప్రేక్షకులు పడిపోయారు. సన్నజాజి తీగ లాంటి నడుము కలిగిన పొడుగు సుందరి ఎవరా అంటూ మాయలో పడిపోయారు. కామెడీ స్కిట్స్ లో వర్ష గ్లామర్ హైలెట్ కాగా, సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నారు. ఎక్కువగా ఇమ్మానియేల్ కి జంటగా వర్ష కనిపిస్తారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి