Home » Entertainment » Janaki Kalaganaledhu Fame Vishnu Priya Phone Conversation With Her Husband Siddhu
Entertainment

Janaki Kalaganaledhu Vishnu Priya : అర్దరాత్రి భర్త ఫోన్.. జానకి కలగనలేదు మల్లిక షాకింగ్ రియాక్షన్

Authored By
aruna
The Telugu News | Published on: August 7, 2022, 3:40 pm
Advertisement

Janaki Kalaganaledhu Vishnu Priya : బుల్లితెరపై సీరియల్స్‌లో జంటగా నటించి.. రియల్ లైఫ్‌లోనూ జంటగా మారుతుంటారు. ఇక సీరియల్ షూటింగ్‌లు నిత్యం ఉంటూ ఉంటాయి. ప్రతీ రోజూ కలుస్తుంటారు. పైగా ఏళ్ల ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో స్నేహం ప్రేమగా కూడా మారుతుంటుంది. అలాంటి ప్రేమతోనే సిద్దు విష్ణుప్రియలు ఒక్కటయ్యారు. ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ జోడి అదిరిపోయేలా ఉంటుంది. ఇక సిద్దు అయితే మరీ చిన్న పిల్లాడిలానే ఉంటాడు. పెళ్లి కాని అబ్బాయిలా కనిపిస్తుంటాడు. ఇక ఈ జోడి ఆన్ స్క్రీన్ మీద నవ్వులు పూయిస్తుంటుంది. ఏదైనా స్పెషల్ ఈవెంట్, పండుగ ప్రోగ్రాంలకు వచ్చినప్పుడు విష్ణు, సిద్దులు నవ్వులు పూయిస్తుంటారు.

Advertisement

వీరిది లవ్ మ్యారేజ్ అని చూస్తుంటేనే అర్థమవుతుంది. తాజాగా విష్ణుప్రియ ఓ వ్లాగ్ చేసింది. అమర్ దీప్ ఎంగేజ్మెంట్ అంటూ ఓ వీడియోను యూట్యూబ్‌లో వదిలింది. ఇందులో ట్రైన్‌లో మల్లిక, జానకిలు తెగ అల్లరి చేశారు. ట్రైన్‌లో అందరూ ఉన్నా కూడా వారు మాత్రం అల్లరి చేస్తూ వ్లాగ్‌లో బిజీగా ఉన్నారు. అర్దరాత్రి అవుతున్నా కూడా ప్రియాంక పడుకోకుండా ఇలా అల్లరి చేస్తోందో చూడండి అంటూ చూపించింది. నన్ను నిద్రపోనివ్వడం లేదు అని విష్ణుప్రియ అంటే.. పడుకోవాలనే వారు ఇలా కూర్చుంటారా? చూడండి. ఇక్కడ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఫోన్, ల్యాప్ ట్యాప్ అంటూ బిజీగా ఉన్నారు.. మేం వ్లాగ్ చేసే పనిలో బిజీగా ఉన్నాం.. అని ప్రియాంక అంటుంది. అదే సమయంలో విష్ణుకి తన భర్త సిద్దు నుంచి కాల్ వస్తుంది. దీంతో ప్రియాంక సెటైర్లు వేస్తుంది.

Janaki Kalaganaledhu Fame Vishnu Priya Phone Conversation With Her Husband

Advertisement

అర్దరాత్రి శ్రీవారు ఫోన్ చేస్తే విష్ణుప్రియ చూడండి ఎలా సిగ్గు పడుతుందో అని సెటైర్లు వేస్తుంది. ఇక తన భర్త అలా ఫోన్ చేయడంతో తెగ సిగ్గు పడిపోయింది. మీరు ఇలా ఫోన్ చేయడం, నేను మాట్లాడటాన్ని కూడా వీళ్లు వ్లాగ్‌లో రికార్డు చేస్తున్నారు.. అయినా నా భర్తకు నేను అంటే ఎంత ఇష్టమో.. అర్దరాత్రి నేను ఏం చేస్తున్నానా? ఎలా ఉన్నానా? ఎక్కడి వరకు వచ్చానా? అని తెలుసుకుంటున్నాడు.. వ్లాగ్ చేసేటప్పుడు మీతో మాట్లాడలేను.. సిగ్గు వేస్తోంది.. వ్లాగ్ ఆపడం లేదు.. రికార్డ్ చేస్తూనే ఉన్నారు అంటూ తెగ సిగ్గుపడిపోయింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి