
Janaki Kalaganaledu 09 September 2022 Full Episode
Janaki Kalaganaledu 02 September 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 380 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… అఖిల్ క్యారం ఆడుతుండగా జానకి కోపంతో తన వైపు చూస్తూ ఉంటుంది. అదంతా గమనిస్తున్న మల్లిక అనుమానంగా చూస్తూ ఉంటుంది. అఖిల్ జానకిని చూస్తూ భయపడిపోతూ ఉంటాడు. అఖిల్ క్యారంలో ఒక కాయిన్ కొట్టపోయి ఇంకొక కాయిన్ కొడతాడు. అప్పుడు జానకి ఆటైనా జీవితమైనా జాగ్రత్తగా అడిగేయాలి లేకపోతే జీవితం చేజారిపోతుంది అని జానకి వేదాంతం చెప్తుంది. అప్పుడు మళ్లీ కంగారుగా ఆడుతూ ఉంటాడు అఖిల్. అప్పుడు రామ అఖిల్ ఆట ఆడి తనని గెలిపిస్తాడు. అప్పుడు గోవిందరాజు ఏంట్రా నువ్వు ఓడిపోయి గెలిపించావు అని అంటాడు. అప్పుడు జ్ఞానాంబ అఖిల్ కోసం అన్ని వదులుకుంటాడు రామా. తన చదువుని త్యాగం చేసి ఆశలన్నీ అఖిల మీదనే పెట్టుకున్నాడు..అని రామాని పొగుడుతూ ఉంటుంది.
కట్ చేస్తే జానకి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రామ అక్కడికి వచ్చి గాజులు బహుమతిగా తీసుకొచ్చి ఇస్తాడు. ఆ గాజులను రామ తన చేతులతో జానకికి తొడిగి తన చేతులపై ముద్దు పెడతాడు. అప్పుడు జానకి రామాను చూస్తూ సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. తర్వాత జానకి జెస్సి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రామా ఏమైంది జానకి గారు అలా పరధ్యానంలో ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి జానకి మాట దాటేస్తుంది. ఇదంతా చూస్తున్న మల్లికా మండిపోతూ… తనకి కూడా గాజులు తెమ్మని అడుగుదామని విష్ణు దగ్గరికి వచ్చి చూస్తే విష్ణు గురక పెడుతూ ఉంటాడు. అప్పుడు మల్లికా నీటిని చల్లి లేపుతుంది. అప్పుడు మల్లికను విష్ణు తిడతాడు. అప్పుడు మల్లికా నాకు బంగారం గాజులు కొనిపెట్టండి అని అడుగుతుంది. నీకేంటి ఈ దిక్కుమాలిన కోరిక పుట్టింది అని అంటాడు. అప్పుడు మల్లికా మీ అన్నయ్య మీ వదినకి మట్టి గాజులు తీసుకొచ్చి వేశాడు. నా రేంజికి మీరు నాకు బంగారు గాజులు తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటుంది. నేను మీకు బిడ్డనిస్తున్నాను ఆ మాత్రం ప్రేమ లేదా అని తెగ డ్రామాలాడుతూ ఉంటుంది.
Janaki Kalaganaledu 02 September 2022 Full Episode
అప్పుడు విష్ణు సరేలే తీసుకొస్తానులే అని అంటాడు. కట్ చేస్తే జానకి నీకు కొద్దిసేపు చదువుకుంటాను మీరు వెళ్లి పడుకోండి అని రామని అంటుంది. అప్పుడు సరే అని రామా వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి అఖిల గురించి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో జానకికి జెస్సి ఫోన్ చేసి నేను చెప్పింది ఏం చేసావ్ అక్క అని అడుగుతుంది. అప్పుడు జానకి మీరు ఆవేశంలో చేసిన పనికి అర్థమంతమైన జీవితం కావాలంటే కొంచెం టైం పడుతుంది. కడుపుతో ఉన్న నీకు న్యాయం జరిగేలా చేస్తా అని అంటుంది. అప్పుడు అఖిల్ అది విని అబ్బా చెప్పేసింది అని కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడు జెసి నాకు చాలా భయంగా ఉంది అక్క నువ్వే ఏదో ఒకటి చెయ్యక్క అని అంటుంది. అప్పుడు జానకి నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను నువ్వు పంపించిన ఫోటోలు ఉన్నాయి కదా అని అంటుంది.
అప్పుడు దాంతో అఖిల్ కంగారుపడుతూ ఈ గండం నుంచి అలా గట్టెక్కాలి అనుకుంటూ జానకి ఫోన్లో ఫోటోలు డిలీట్ చేయడానికి అఖిల్ జానకి రూమ్ లోకి వెళ్లి తన ఫోన్ తీసుకొని ఫోటోలని చూస్తుండగా.. అంతలో జానకి లేస్తుంది. అది చూసి అఖిల్ మంచం కిందికి దూరుతాడు. జానకి వాటర్ తాగి వెళ్లి పడుకుంటుంది. తర్వాత అఖిల్ నెమ్మదిగా వెళ్లి ఫోటోలను డిలీట్ చేసి వెళ్ళిపోతూ ఉండగా… అఖిల్ కి ఏదో కాలికి తగిలి శబ్దమవుతుంది. అప్పుడు జ్ఞానాంబ నీళ్లు తాగడానికి వచ్చి తాగుతుండగా ఏదో శబ్దం వస్తుంది. అప్పుడు లైట్ వేస్తుంది. అప్పుడు అక్కడ అఖిల్ కనిపిస్తాడు. అప్పుడు జ్ఞానంబా ఇక్కడ ఏం చేస్తున్నావ్ ఇంకా పడుకోలేదా అని అడుగుతుంది. అప్పుడు అఖిల్ చదువు డ్రామా ఆడుతూ తప్పించుకుంటాడు. అప్పుడు జ్ఞానంబ అదంతా నమ్మి నీకు నిద్ర రాకుండా నేను టీ పెట్టుకొని వస్తా ఉండు అని అంటుంది. అప్పుడు తన ప్రేమ విషయం గుర్తు తెచ్చుకొని భయపడిపోతూ ఉంటాడు అఖిల్. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.