Janaki Kalaganaledu 09 August 2022 Full Episode
Janaki Kalaganaledu 09 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగలేదు. ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదలైంది. 362 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జ్ఞానాంబ, జానకిని పిలువగా జానకితోపాటు అందరూ అక్కడికి వస్తారు. అప్పుడు జ్ఞానాంబ ఈ పుస్తకాలు నీవే నా అని జానకిని అడుగుతుంది. అప్పుడు జానకి నావే కానీ ఈ పుస్తకాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అత్తయ్య గారు అని అడుగుతుంది. అప్పుడు జ్ఞానం తోరాలు చూపిస్తూ ఈ తోరాలు ఎంత విలువైనవి, ఎంత ప్రీతికరమైన నీకు తెలుసా… వాటిని తీసి కిందపడేసి నీ పుస్తకాలు అక్కడ పెడతావా.. అని అంటుంది. అప్పుడు జానకి అసలు ఆ పుస్తకాలు మీ గదిలోకి ఎలా వచ్చాయో నాకు తెలియదు అత్తయ్య గారు అని అంటుంది. నీకు షరతులు పెట్టి 24 గంటలు అవడం లేదు అప్పుడే ఇలా చేస్తావా.. నువ్వు నీకు నేను చెప్పాను కథ నీ భర్తని సంతోష పెట్టడంలో గాని ఈ ఇంటి బాధ్యతలను లలో కానీ నువ్వు ఎటువంటి తప్పు చేయకూడదు అని.
కానీ నా మాట అప్పుడే నువ్వు జవ దాటావు అని అంటుంది. అంతలో మల్లిక కూడా జానకి నీ తను ఐపీఎస్ అయిపోయింది అన్నట్లు ఫీల్ అవుతుంది. అందుకే మీరు చెప్పిన మాటల్ని అప్పుడే తన నెత్తి మీద కళ్ళు వచ్చాయి. అత్తయ్య గారు మీరు పెట్టిన షరతులలో ఒక షరతుని కొట్టేయండి అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ ఏమి మాట్లాడ పోయేసరికి మల్లికా నేనే కొట్టివేస్తా. అత్తయ్య గారు అని వెళ్లి కొట్టేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు జానకి ఆలోచించి మల్లికా ఆగు ఇటు రా.. అని పిలుస్తుంది. ఆ ఏంటి అని దగ్గరికి వస్తుంది. అప్పుడు నువ్వు నా రూమ్ లో ఉన్న నక్లెస్ ని దొంగతనం చేశావు. నా నెక్లెస్ నాకు ఇవ్వు అని అడుగుతుంది. వామ్మో నీ నక్లిస్సా అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. నేను ఆ నెక్లెస్ ఎందుకు కొట్టేస్తాను అని అంటుంది. నేను నా నెక్లెస్ కి పసుపు, కుంకుమ వేసి పూజ చేసి నేను అల్మారా లో పెట్టాను. నువ్వు కొట్టేయకపోతే నీ చేతులకి ఆ పసుపు, కుంకుమ ఎలా అంటింది అని అంటుంది జానకి. అప్పుడు మల్లికా నేను తోరాలు తీసి కింద పడేసేటప్పుడు తోరణాలకి ఉన్న పసుపు నాకు అంటుకుంది.
Janaki Kalaganaledu 09 August 2022 Full Episode
అని తన తప్పును తనే ఒప్పుకుంటుంది. అప్పుడు అందరూ ఆశ్చర్యానికి గురవుతారు. జ్ఞానాంబ మల్లిక వైపు సీరియస్ గా చూస్తుంది. అప్పుడు మల్లిక వచ్చి జ్ఞానాంబ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి అత్తయ్య గారు ఏమనకండి నన్ను అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకిని లేపి కొట్టబోతుంది. కానీ గోవిందరాజు ఆపి మల్లిక ఇప్పుడే చచ్చేలా ఉంది. ఇక కొడితే నిజంగానే పైకి పోతుంది వద్దు జ్ఞానం అని అంటాడు. జ్ఞానంభ జానకి ఏమనుకోకు అమ్మ నేను వాటిని చూసి తట్టుకోలేక అలా అన్నాను అని అంటుంది. పర్లేదు అత్తయ్య గారు అని జానకి అంటుంది. కట్ చేస్తే మల్లికా విష్ణు దగ్గరికి వెళ్లి నాకు విడాకులు కావాలి అని అడుగుతుంది. అప్పుడు విడాకులు ఏంటి మల్లికా ఏం మాట్లాడుతున్నావ్.. నువ్వు అని అంటాడు. నా మొగుడు నాకు సపోర్ట్ చేయడం లేదు ఎలాంటి సిచువేషన్ వచ్చిన నా పక్కన నిలబడడం లేదు. ఇక నేను నీతో ఎలా కాపురం చేయాలి. అని అంటుంది మల్లికా. అది కాదు మల్లికా నువ్వు చేసే ప్రతి తప్పు కూడా సాక్షాలతో బయటపడుతున్నావు.
ఇక నేను ఎలా నీకు మద్దతుగా ఉండాలి అని అంటాడు. మీ అన్నయ్య ఎంత పెద్ద తప్పు చేశాడు. తనకంటే నేను పెద్ద తప్పు చేశానా. ఇదంతా కాదు నువ్వు నా మాట వింటావా లేదా విడాకులు ఇస్తావా అని అంటుంది. అప్పుడు సరేలే ఇస్తా అని విష్ణు మాట ఇస్తాడు. అయితే సాయంత్రం మీరు వచ్చేటప్పుడు నాకు చికెన్ బిర్యాని, చికెన్ పకోడీ, చికెన్ బర్గర్ తీసుకుని రండి అని అంటుంది. నీకేమైనా పిచ్చా మా అమ్మ గాని చూసింది అంటే నిన్ను పైకి పంపిస్తుంది. మీ అమ్మ మన మాట విననప్పుడు మనం మీఅమ్మ మాట ఎందుకినాలి. మీరు నాకు మాట ఇచ్చారు తీసుకొస్తున్నారు అని అంటుంది. అప్పుడు విష్ణు సరేలే అని అంటాడు. కట్ చేస్తే రామ షాపులో జ్ఞానంబ పెట్టిన షరతులు గురించి ఆలోచించుకుంటూ ఒకటి చేయ బోయి ఇంకొకటి చేస్తూ ఉంటాడు. అప్పుడు అంతలో జానకి అక్కడికి వస్తుంది.
ఏవండోయ్ శ్రీవారు ఏంటి పరధ్యానంలో ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు పరధ్యానం కాదండి. అమ్మ మీకు పెట్టిన షరతుల గురించి భయపడుతున్నానండి అని అంటాడు. అప్పుడు జానకి అలాంటి సమస్యలకు నేను భయపడితే నేను ఐపీఎస్ అయ్యి రేపు సమాజంలో వచ్చిన సమస్యలన్నీ తీర్చాలి. ఒక్కొక్కసారి ప్రాణాలని కూడా పణంగా పెట్టాలి. ఈ సమస్యలను అన్ని ఎదుర్కొనే వెళ్తేనే నేను రేపు ఏ సమస్య అయినా ఎదుర్కోగలుగుతాను. అని అంటుంది జానకి. అప్పుడు రామ అది కాదండి దానికి దీనికి పొంతన ఎట్లా అని అనగా.. జానకి ఇక మీరు దాని గురించి ఆలోచించకండి. రండి భోజనం చేద్దురుగాని అని ఇద్దరు కలిసి వెళ్లి భోజనం చేస్తూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ.. సంతోషంగా గడుపుతుంటారు. తరువాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్‌తో పాటు కమర్షియల్ ఎక్స్‌పర్‌మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్…
This website uses cookies.