janaki kalaganaledu 31 august 2022 full episode
Janaki Kalaganaledu 10 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా విడుదల అయింది. 363 ఎపిసోడ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. జానకి రామ సంతోషంగా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కట్ చేస్తే విష్ణు మల్లిక కోసం నాన్ వెజ్ ఐటెం తీసుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు మల్లికా సంతోషంతో అమె రూమ్లో కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ అదంతా చూసి మల్లికను పిలుస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా నాన్ వెజ్ ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చావు అని మల్లికను తిడుతుంది. అప్పుడు మల్లికా ఏంటి అత్తయ్య గారు ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి అని జ్ఞానాంబ అంటుంది. అప్పుడు జానకికి ఇష్టమైన చదువుని మీకు ఇష్టం లేకపోయినా చదువుకోడానికి ఒప్పుకున్నారు. నాకిష్టమైన నాన్ వెజ్ ని తినడానికి ఎందుకు ఒప్పుకోరు అని అంటుంది. అప్పుడు దాంతో జ్ఞానంబ మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు అక్కడికి వస్తాడు.అమ్మ పుల్లల మల్లికా దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని అడుగుతాడు.
ఎందుకు లేదు మావయ్య గారు తనకి ఇష్టం లేకుండా అత్తయ్య గారు జానకిని చదువుకోడానికి ఒప్పుకుంది. నాకు ఇష్టమైన నాన్ వెజ్ ని ఎందుకు తిననివ్వరు. అప్పుడు జ్ఞానాంబ గోవిందరాజు ఈ పిచ్చి మళ్లిక ను వదిలేయ్ జ్ఞానం అని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. అప్పుడు మల్లికా సంతోషంతో పొంగిపోతూ ఇదే కాదు.. ఇంకా నేను సిటీకి వెళ్లడానికి కూడా ప్లాన్ చేసి మీరు ఒప్పుకునేలా చేస్తాను అని ప్లాన్ వేస్తుంది. కట్ చేస్తే రామ జానకి స్వీట్ షాప్ లో స్వీట్స్ అమ్ముతూ ఉంటారు. అప్పుడు జానకిని రామ మీరు ఇంటికి వెళ్లి రెడీ అవ్వండి అకాడమీకి వెళ్లాలి కదా అని అంటుంది. అయితే సరే వెళ్తాను కానీ మీరు వచ్చేటప్పుడు స్వీట్స్, మల్లెపూలు తీసుకొని రండి అని అంటుంది. అదేంటి అవి ఎందుకు అని అడుగుతాడు రామ, అప్పుడు జానకి నేను చదువుకోడానికి అత్తయ్య గారు ఒప్పుకున్నారు. అలాగే నాకు ఒక ఐదు షరతులు పెట్టారు. ఆ షరతులు అన్ని నేను సవ్యంగా పాటించాలి కదా. అని అంటుంది. అప్పుడు రామ అవును పాటించాలి అని అంటాడు. ఆ షరతులలో ఒకటి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడంలో ప్రేమ అనురాగాలు తో చూడడంలో, ఇంటికి వారసులు ఇవ్వడంలో నా చదువు అడ్డు రావద్దని చెప్పారు కదా…అందుకే ఆషరతుని నేను పాటించాలి కదా..
Janaki Kalaganaledu 10 August 2022 Full Episode
దానికి మీరు సపోర్ట్ చేయాలి. అందుకే మీరు వచ్చేటప్పుడు స్వీట్స్ మల్లెపూలు తీసుకుని రండి అని అంటుంది. అప్పుడు రామ ఇలాంటివన్నీ లేవు మీరు ఫస్ట్ చదువు మీదనే దృష్టి పెట్టి ఐపీఎస్ అవ్వండి అని అంటాడు. నేను ఐపీఎస్ అవ్వాలి అంటే అత్తయ్య చెప్పిన షరతులు అన్ని పాటించాలి కదా రామ గారు అని అంటుంది. అప్పుడు రామ ఇదేం ట్విస్ట్ అండి బాబు అని కంగారు పడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే గోవిందరాజు జ్ఞానంబ జానకి రామాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జ్ఞానాంబ ఈ ఇంటికి వారసులు ఎప్పుడు వస్తారు వాళ్ళతో సరదాగా ఎప్పుడు ఆడుకోవాలో అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు నువ్వేం కంగారు పడకు జ్ఞానం, జానకి ఐపీఎస్ అవ్వడం తదుపరి నీకు వారసుని ఇస్తుంది.అని అంటాడు. అప్పుడు అదేం కుదరదు అండి నాకు ఈ ఇంటికి వారసులను ఇచ్చే క్రమంలో ఆ చదువు అడ్డు రావద్దని నేను తనకి చెప్పాను కదా. అదెలా కుదురుతుంది జ్ఞానం పిల్లల్ని కంటే తను ఐపీఎస్ కి ఎలా అవుతుంది. అర్థం చేసుకో జ్ఞానం అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.