Home » Entertainment » Janaki Kalaganaledu 10 January 2022 Episode
Entertainment

Janaki Kalaganaledu 10 Jan Episode Highlights : జానకిని అరెస్ట్ చేసి ఎస్సై.. సునంద ప్లాన్ వర్కవుట్.. వెన్నెల పెళ్లి కూడా పెటాకులు అయినట్టేనా?

Authored By
Varun G
The Telugu News | Published on: January 8, 2022, 12:00 pm
Advertisement

Janaki Kalaganaledu 10 Jan Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఫ్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 10 జనవరి 2022, 211 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకికి ముక్కుపుడుక పెడుతూ తన పెదవులు తాకడంతో రామాకు షాక్ కొడుతుంది. దీంతో రామాకు ఏం చేయాలో అర్థం కాదు. అద్దంలో తన పెదవుల మీద చేయి పెట్టి షాక్ కొట్టిందని చెబుతాడు రామా. చాలా కరెంట్ ఉందండి బాబు అంటాడు రామా. సరే ఇటు ఇవ్వండి నేనే పెట్టుకుంటాను అంటే.. షాక్ కొట్టకుండా నేనే పెడతాను అంటాడు రామా. దీంతో సరే పెట్టండి అంటుంది జానకి. ముక్కు పుడక పెట్టాక జానకి ఇంకా అందంగా మారుతుంది. అదిరిపోయిందండి బాబు.. సూపర్ అంటాడు రామా. ఇద్దరూ కాసేపు సిగ్గుపడతారు. అయ్యబాబోయ్ జానకి గారు.. ఈ ముక్కు పుడకకు మీ వల్లే అందం వచ్చింది అని చెప్పి.. అద్దంలో జానకి పెదాలకు ముద్దు పెడతాడు రామా.

Advertisement

janaki kalaganaledu 10 january 2022 episode

మరోవైపు పెళ్లి వాళ్లు వస్తారు. అబ్బాయి కూడా బాగున్నాడని అందరూ అనుకుంటారు. కాఫీ తాగాక.. వెన్నెలను చూస్తారు. వెన్నెలను చూడగానే అమ్మాయి నాకు నచ్చింది అంటాడు అబ్బాయి. వెన్నెల నువ్వు కూడా ఒకసారి అబ్బాయిని చూడు అంటుంది జ్ఞానాంబ. చాలాసేపు చూడకుండా అలాగే ఉంటుంది వెన్నెల. తర్వాత అబ్బాయి వైపు చూసి ఓకే అన్నట్టుగా తల ఊపుతుంది. దీంతో అందరూ సంతోషిస్తారు. శుభం.. అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడు కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటారు అబ్బాయి తరుపు పెళ్లివాళ్లు. దీంతో ముహూర్తం కోసం అన్నీ చూసుకోవడం స్టార్ట్ చేస్తారు.

Advertisement

Janaki Kalaganaledu 10 Jan Episode Highlights : జానకిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు

అన్ని విషయాలు మాట్లాడుకుంటుండగానే అంతలోనే పోలీసులు జ్ఞానాంబ ఇంటికి వస్తారు. వెన్నెల ఇంట్లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. జ్ఞానాంబ ఇల్లు ఇదేనా అడుగుతారు వచ్చిన పోలీసులు. రామా వెళ్లి ఏమైంది సార్.. అంటాడు. నేను జ్ఞానాంబను ఏమైంది ఎస్సై గారు అని అడుగుతుంది జ్ఞానాంబ.

అడ్రస్ మారలేదు. కరెక్ట్ అడ్రస్ కే వచ్చాను అంటాడు. ఇక్కడ జానకి ఎవరు అని అడుగుతాడు ఎస్సై. దీంతో నేనే సార్.. చెప్పండి సార్ అంటుంది జానకి. నా భార్య సార్. తనే జానకి. ఎందుకు సార్ అంటాడు రామా. దీంతో జానకిని అరెస్ట్ చేస్తున్నాం అంటాడు ఎస్సై.

Advertisement

ఎవ్వరు చెప్పినా వినకుండా.. కన్నబాబును కొట్టినందుకు జానకిని అరెస్ట్ చేస్తున్నామని ఎస్సై చెబుతాడు. అరెస్ట్ వారెంట్ కూడా చూపించి.. జానకిని పోలీసు జీపు ఎక్కిస్తాడు ఎస్ఐ. జానకి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఏం చేయాలో తెలియదు. రామా పోలీసు జీపు వెంట పడుతుంటాడు.

ఆగండి సార్ అని చెప్పినా కూడా వినరు. పోలీసు జీపు వెంట చాలా సేపు పరిగెత్తాక రామాను ఆపుతారు అఖిల్, విష్ణు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి