janaki kalaganaledu 13 november 2021 full episode
Janaki Kalaganaledu 13 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. అయితే.. 15 నవంబర్, 2021, సోమవారం ఎపిసోడ్ 171 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. మైరావతి వేసిన శిక్షను పాటించి.. రాత్రంతా బయట చలిలోనే నిద్రపోతుంది జానకి. కానీ.. జానకి కోసం దుప్పటి తీసుకొచ్చి కప్పుతుంది జ్ఞానాంబ. దీంతో జానకికి కాస్త చలి తగ్గుతుంది.
janaki kalaganaledu 13 november 2021 full episode
ఉదయం లేవగానే జానకి అన్ని పనులు చేస్తుంటుంది. బావి వద్ద నీళ్లు చేదుతుండగా అక్కడికి వచ్చిన రామా తనకు సాయం చేస్తాడు. అయ్యో రామా గారు వద్దండి.. అమ్మమ్మ గారు చూస్తే బాగోదు అని అంటుంది. నానమ్మ లేదు బయటికి వెళ్లింది అని చెబుతాడు రామా. కానీ.. రామా కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నట్టు కనిపిస్తాడు. దీంతో రామాను నవ్వించడం కోసం ప్రయత్నిస్తుంది జానకి. నా వల్లనే మీకు చాలా సమస్యలు వస్తున్నాయి అని అంటాడు రామా. మీరు చలిలో పడుకుంటే నేను ఏం చేయలేకపోయాను. భర్తగా నేను ఓడిపోయాను అండి అంటాడు రామా.
లేదండి.. మీరు భర్తగా ఓడిపోలేదు. ఏనాడూ ఓడిపోరు అంటుంది జానకి. మీరు రాత్రంతా నా కోసం బయటకు చూశారు. నాకోసం రాత్రంతా నిద్రపోకుండా తోడుగా, అండగా ఉన్నారు. భార్య మీద మీకు ఉన్న ప్రేమకు నిదర్శనం అంటుంది జానకి. అయినా కూడా రామా మాత్రం వినడు. ఏంటి అలా చూస్తున్నారు.. నేను మా ఆయనకు లైన్ వేస్తున్నాను అంటూ రామాను నవ్విస్తుంది జానకి.
తనకు దుప్పటి కప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి.. అంటూ జ్ఞానాంబకు చెబుతుంది జానకి. కానీ.. జ్ఞానాంబ మాత్రం నీ స్థానంలో ఎవ్వరు ఉన్నా నేను దుప్పటి కప్పేదాన్ని. అది మానవత్వంతో చేశాను. దానికి పరీక్షకు ఏం సంబంధం లేదు.. అంటూ జ్ఞానాంబ జానకితో అంటుంది.
మరోవైపు మల్లిక అనుకున్న ప్లాన్స్ ఏవీ వర్కవుట్ కాకపోవడంతో మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. అడ్డంగా బుక్ చేసినా కూడా జానకికి ఏం శిక్ష విధించలేదు ఏంటి అని బాధపడుతుంది మల్లిక. జానకి ఎదుర్కొంటున్న పరీక్షలే నా కొంప ముంచి ఏడిపిస్తున్నాయి అంటుంది. జానకి నాలాగా ఊర మాస్ కాదు. చాలా క్లాస్. చలిలో పడుకోలేక పారిపోతుందనుకున్నాను కానీ.. మైరావతి పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గుతోంది అంటూ బాధపడుతుంది మల్లిక.
మీ భార్యంటే మీకు నిజంగా ప్రేమ ఉందా? అని మైరావతి ఇంట్లో పనిచేసే వ్యక్తిని అడుగుతుంది జానకి. ఉంది కాబట్టే కదండి.. తీసుకెళ్లడానికి వచ్చాను అంటాడు. మరి అంత ప్రేమ ఉన్నవాడివి తనకు విడాకులు ఇస్తాను అని ఎందుకు అన్నావు? నీకు మనసెలా వచ్చింది అని ప్రశ్నిస్తుంది. దీంతో చెప్పాను కదండి.. మా అమ్మ మాటే నాకు వేదవాక్కు అని అంటాడు.
మీ అమ్మ గారి మీద ఉన్నది మీకు నిజమైన ప్రేమే అయితే.. మీరు మీ భార్యను అర్థం చేసుకుంటారు. మీ భార్య పరిస్థితిని మీ అమ్మగారికి అర్థం అయ్యేలా చెబుతారు. అలా కాకుండా చచ్చినట్టు పనిచేయమని వేధించడం ప్రేమ అవ్వదు. హింస అవుతుంది.. అని అంటుంది జానకి. ఆ తర్వాత ఏం జరుగతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
Green Chicken Curry : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొత్త వంటకాన్ని ట్రై చేసి చూడాలి అనుకుంటారు.…
Hari Hara Veera Mallu Movie Trailer : తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా వెలుగొందుతున్న పవర్స్టార్ పవన్…
Ram Charan Fans : 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత, పలు నిర్మాతలు రామ్ చరణ్తో సినిమాలు చేయాలని ఆసక్తి చూపినా,…
This website uses cookies.