janaki kalaganaledu 15 november 2021 full episode
Janaki Kalaganaledu 15 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్ 2021, సోమవారం 171 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మల్లిక టీ చేస్తుండటం చూసి షాక్ అవుతుంది చికిత. వామ్మో.. మీరు టీ చేయడం ఏంటి.. అంటుంది చికిత. మా అత్తయ్య ముందు మార్కులు కొట్టేద్దామని అంటుంది మల్లిక. అవునా అని చెప్పి… మల్లికను ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి.. చాయ్ లో ఉప్పు వేస్తుంది. ఎవరు లేరు కదా అంటుంది మల్లిక. అవునా.. ఎవరో పిలిచినట్టు అనిపించిందండి అంటుంది. వెళ్లి గోదారిని రమ్మను.. చాయ్ రెడీ అయింది అంటుంది మల్లిక.
janaki kalaganaledu 15 november 2021 full episode
ఓవైపు జానకి.. ఇంటి బయట ఊడుస్తుండగా గోవిందరాజు చూసి.. ఎంతైనా నా పెద్ద కోడలు బంగారం అని చెబుతాడు. జ్ఞానాంబను చూస్తూ పెద్ద కొడలు గురించి గొప్పలు చెబుతాడు. ఎంతైనా నా పెద్ద కోడలు ముందు ఎవ్వరూ పనికిరారు. తను రామాకు కరెక్ట్ అని ఎప్పుడో రుజువు అయింది. ఇంకా నువ్వు తనకు టెస్టులు పెట్టడం ఏంటి.. అంటూ జ్ఞానాంబకు చెబుతాడు గోవిందరాజు. ఇంతలో మల్లిక వచ్చి.. పెద్ద కోడలే కాదు.. చిన్న కోడలు కూడా బంగారమే. మీకోసమే స్పెషల్ గా టీ చేసి తీసుకొచ్చాను అంటుంది మల్లిక.
మీరు ఒకసారి నా టీ తాగి చూడండి. మల్లిక తోపు.. కత్తి అని అంటారు అంటుంది మల్లిక. సరే ఇవ్వు.. అని అంటాడు గోవిందరాజు. చాయ్ తాగగానే చాలా ఉప్పుగా ఉంటుంది. దీంతో గోవిందరాజుకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. జ్ఞానాంబ కూడా చాయ్ తాగి.. టీ నువ్వే పెట్టావా అంటుంది జ్ఞానాంబ. నేనే పెట్టాను అత్తయ్య గారు అంటుంది. ముందు కూర్చో ఇక్కడ అంటుంది జ్ఞానాంబ.
కింద కూర్చో అంటుంది. కష్టపడి పెట్టావు కాబట్టి ఇంత అద్భుతమైన టీని గుర్తుండిపోయేలా నువ్వే తాగితే బాగుంటుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే.. అని మల్లిక తాగుతుంది. చాలా ఉప్పుగా ఉంటుంది. దీంతో మల్లిక తాగలేకపోతుంది. నువ్వు చేసిన చాయ్ మొత్తం నువ్వే తాగాలి అని తను చేసిన చాయ్ మొత్తం తాగిస్తారు.
ఇంతలో ఊరి నుంచి కొందరు వ్యక్తులు వస్తారు. మైరావతిని పిలుస్తారు. కానీ.. మైరావతి ఇంట్లో ఉండదు. సుబ్బయ్య తన కూతురు కష్టం గురించి చెప్పుకోవడానికి మైరావతిని కలుద్దామని వచ్చాను అంటారు. తన అల్లుడు, కూతురును తీసుకొని సుబ్బయ్య వస్తాడు. నా భార్య నాతో గొడవ పడి పుట్టింటికి వచ్చిందండి.. అంటాడు.
భార్య కడుపుతో ఉండటం వల్ల.. పనులు చేయలేక వచ్చానండి అంటుంది. లేదండి.. అక్కడ నేను రోజూ పనులు చేయలేనండి. నా వల్ల కాదమ్మా ఇప్పుడు కడుపుతో ఉన్నా అంటుంది. అవన్నీ కాదు.. పెద్దమ్మ గారు చెప్పినట్టు వింటావా.. లేదంటే మా అమ్మ చెప్పినట్టు విడాకులు ఇస్తాను అంటాడు సుబ్బయ్య అల్లుడు.
జ్ఞానాంబ ఈ విషయంలో ఏం పరిష్కారం చెప్పదు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. మా అమ్మ చెప్పినట్టు నీకు విడాకులు ఇస్తా అంటూ వెళ్లిపోబోతుంటే.. ఒక్క నిమిషం అని ఆ వ్యక్తిని ఆపుతుంది జానకి. మీ భార్యంటే నీకు నిజంగా ప్రేమ ఉందా.. అని అడుగుతుంది. అంత ప్రేమ ఉంటే విడాకులు ఇస్తా అనడానికి మీకు మనసెలా వచ్చింది అంటుంది.
మా అమ్మ మాటే నాకు వేదవాక్కు అంటాడు. మీ అమ్మగారి మీద ఉన్నది నిజమైన ప్రేమ అయితే మీ భార్యను అర్థం చేసుకుంటారు.. మీ భార్య పరిస్థితిని మీ అమ్మ గారికి అర్థమయ్యేలా చెబుతారు. కడుపుతో ఉంది కాబట్టి నెలలు నిండాయి కాబట్టి తను పనిచేయలేను అంటుంది. చచ్చినట్టు పనులు చేయమంటే అది ప్రేమ అవ్వదు.. హింస అవుతుంది అని చెబుతుంది.
తనకు బుద్ధి చెప్పడంతో.. తన తప్పు ఒప్పుకొని తనను అర్థం చేసుకొని తన భార్యను తన ఇంట్లో వదిలేసి… ఆ వ్యక్తి వెళ్లిపోతాడు. తన కాపురాన్ని నిలబెట్టినందుకు చాలా థ్యాంక్స్ అండి అని ఆ మహిళ జానకికి చెబుతుంది. జానకి చెప్పిన పరిష్కారానికి రామా, గోవిందరాజు సంతోషిస్తారు. ఆతర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.