Intinti Gruhalakshmi 15 Nov Today Episode : మీటింగ్ కు వెళ్లే సమయానికే కళ్లు తిరిగి పడిపోయన తులసి.. తులసికి ఏమైంది.. ఆరోగ్యం పాడయిందా? టెన్షన్ లో నందు

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 నవంబర్, 2021 సోమవారం ఎపిసోడ్ 477 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య వీడియో కాల్ చేసి నందుతో మాట్లాడుతుండగా తులసి అప్పుడే టీ తీసుకోండి అని నందుకు తెచ్చి ఇస్తుంది. నందు పక్కనే తులసి ఉండటం చూసిన లాస్య తట్టుకోలేదు. నాకు ఎందుకు అబద్ధం చెప్పావు నందు అంటూ సీరియస్ అవుతుంది లాస్య. నువ్వు వేరే రూమ్ బుక్ చేసుకోవచ్చు కదా అంటూ అరుస్తుంది. ట్రై చేశాను కానీ కుదరలేదు అంటాడు.

intinti gruhalakshmi 15 november 2021 full episode

ఎందుకు నాకు అబద్ధం చెప్పావు నందు అంటే.. ఆయన చెప్పేవన్నీ నిజాలే అంటుంది తులసి. నువ్వు మాట్లాడకు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. ఇంతలో నందుకు కూడా కోపం వస్తుంది. చూడు లాస్య.. దీన్ని పెద్దగా చేయకు. దీంట్లో అంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రేపు నాకు క్లయింట్ తో మీటింట్ ఉంది. నాకు అది ముఖ్యం. దాని గురించి నేను ప్రిపేర్ అవ్వాలి అని ఫోన్ పెట్టేస్తాడు నందు. ఇంతలో తులసికి కళ్లు తిరుగుతాయి. కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో నందు తులసిని పట్టుకొని పరుపు మీద పడుకోబెడతాడు.

కాస్త నీరసంగా ఉందండి. రెస్ట్ తీసుకుంటే నార్మల్ అయిపోతాను అని చెబుతుంది తులసి. సరే.. పడుకో అని చెప్పి తనను పడుకోబెడతాడు నందు. మరోవైపు లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. విడాకులు అయిన వాళ్లు విడివిడి రూమ్స్ లో ఉండాలి కానీ.. ఒకే రూమ్ లో ఎలా ఉంటారు అంటూ తనకు తానే చిరాకు పడుతుంది.

తులసికి నీరసంగా ఉందని.. పండ్లు తీసుకొచ్చి ఇస్తాడు నందు. వద్దండి అంటిం. రేపు మీటింగ్ ఉంది. చాలా నీరసంగా ఉన్నావు. రేపు మీటింగ్ కోసం ఓపిక ఉండాలంటే ఏదైనా తినాలి కదా.. అని చెప్పి.. యాపిల్ కట్ చేసి ఇస్తాడు నందు. తనకు యాపిల్ తినిపిస్తాడు. దీంతో తులసి ఆశ్చర్యపోతుంది. నందు తినిపిస్తుంటే తింటుంది.

Intinti Gruhalakshmi 15 Nov Today Episode : శృతి, అంకితపై లాస్య సీరియస్

తనను పడుకోబెట్టి.. ప్రాజెక్ట్ వర్క్ చేస్తాడు నందు. మరోవైపు సినిమాకు వెళ్లి గ్యాంగ్ అంతా అప్పుడే వస్తుంది. వాళ్లు ఇకఇకలు పకపకలు.. నవ్వుతుంటే చూసి లాస్యకు అస్సలు నచ్చదు. లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. నాకు మాత్రం మీ పద్ధతి అస్సలు నచ్చడం లేదు అంటుంది. మిమ్మల్ని మూవీకి తీసుకెళ్లలేదని హర్ట్ అయ్యారా.. అంటుంది దివ్య. దీంతో షట్ అప్ అంటుంది.

కట్టకట్టుకొని అందరూ బయటికి పోతే.. ఇల్లు ఎటుపోతుందని అనుకున్నారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నారు.. వాళ్లను చూసుకోవాలి అనే విషయం కూడా తెలియదా. టీ పెట్టబోయి.. టీ మీద పోసుకొని కాళ్లు కాల్చుకుంది.. అంటూ చెబుతుంది. అందరినీ లాస్య నిలదీస్తుండగా.. లాస్య నీ ప్రాబ్లమ్ ఏంటి.. అంటూ పరందామయ్య.. అంటాడు.

అయితే.. లాస్య మాటలకు.. కౌంటర్లు ఇస్తారు అందరూ. శృతి, అంకిత.. అభి, ప్రేమ్.. అందరూ తనకు కౌంటర్లు ఇస్తారు. మీరు మాకు బుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ తన మీద సీరియస్ అవుతారు. తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దీంతో లాస్యకు ఏం చేయాలో అర్థం కాదు.

కట్ చేస్తే… ఉదయం అవుతుంది. నందు, తులసి మీటింగ్ కు రెడీ అవుతుంటారు. టై కట్టుకోవడానికి నందు ఇబ్బంది పడుతుంటాడు. ఏమైందండి అంటే పొద్దున బాత్ రూమ్ డోర్ కు వేలు పడింది అంటాడు. దీంతో తను దగ్గరుండి నందుకు టై కడుతుంది. ఇంతలో స్కైప్ నుంచి వెంటనే నందుకు కాల్ చేస్తుంది లాస్య.

కాల్ కట్ చేయబోయేసరికి.. కాల్ కనెక్ట్ అవుతుంది. నందుకు.. తులసి టై కట్టడం చూసి లాస్య షాక్ అవుతుంది. ఏం చేస్తున్నావు తులసి అని అడుగుతుంది. ఇక్కడ నువ్వు లేవు కదా అందుకే నీ పని నేను చేస్తున్నాను అంటుంది తులసి. నందుకు చిన్నపిల్లాడా టై కట్టుకోవడం రాదా అని అంటుంది లాస్య.

నీ నస వదిలేయ్ లాస్య.. మేము ఆఫీసుకు వెళ్లాలి.. అంటాడు నందు. లాస్య నువ్వు ఆఫీసుకు వెళ్లవా అంటుంది తులసి. దీంతో లాస్యకు చిరాకు వస్తుంది. మరోవైపు అనసూయ.. తులసికి ఫోన్ చేస్తుంది. ఇంతలో తులసి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. దీంతో అనసూయ భయపడి అందరికీ ఆ విషయం చెబుతుంది. వెంటనే నందు చూసి తనను లేపబోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Hero Vida : కేవలం రూ.45,000తో 142కి.మీ మైలేజ్‌.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…

19 minutes ago

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…

1 hour ago

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

2 hours ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

4 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

5 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

7 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

8 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

9 hours ago