Janaki kalaganaledu 16 March Today Episode : వెన్నెల, దిలీప్ ప్రేమించుకున్న విషయం ఓబులేష్.. మైరావతికి చెబుతాడా? నిశ్చితార్ధాన్ని మైరావతి ఆపేస్తుందా?

Janaki kalaganaledu 16 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 258 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓబులేష్.. వెన్నెలను చూసి.. మీరు దిలీప్ ప్రేమించుకున్నారు కదా అంటాడు. దీంతో వెన్నెల షాక్ అవుతుంది. రామా, జానకి కూడా షాక్ అవుతారు. పెళ్లి కూతురు మీరే కదా.. పద్మావతి గారి అబ్బాయి.. మీరు ప్రేమించుకున్నారు. మిమ్మల్ని నేను రెండు సార్లు బండి మీద చూశాను. ఒకసారి గుడిలో కూడా చూశాను అండి. అంటే.. మీది ప్రేమ పెళ్లి అన్నమాట అంటాడు ఓబులేష్. దీంతో వాళ్లు షాక్ అవుతారు. అమ్మాయి గారు.. ప్రేమ పెళ్లి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదేమైనా మైరావతి అమ్మగారు చాలా గ్రేట్ అండి. ప్రేమ అనే మాటను ఒప్పుకోరు. అట్లాంటిది.. మనవరాలికి ప్రేమ పెళ్లి చేస్తున్నారంటే చాలా గ్రేట్ అండి. పెద్దమ్మ గారి పెద్ద మనసుకు నేను వెళ్లి వెంటనే థ్యాంక్స్ చెప్పాలి అని వెళ్లబోతాడు.

janaki kalaganaledu 16 march 2022 full episode

దీంతో పైన ఉన్న రామా, జానకి, వెన్నెల.. ముగ్గురూ పరిగెత్తుకుంటూ కిందికి వస్తారు. ఓబులేష్ ను మైరావతి దగ్గరికి వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నించబోతారు. మరోవైపు మైరావతి.. నిశ్చితార్థం పనుల్లో బిజీగా ఉంటుంది. ఓబులేష్ గాడిది కూడా రాజమండ్రే. పెళ్లి కొడుకు వాళ్ల వీధిలోనే వాడు ఉంటాడట అని మైరావతి.. జ్ఞానాంబ, గోవిందరాజుకు చెబుతుంది. చాలా మంచిది అత్తయ్య గారు అంటుంది జ్ఞానాంబ. వెన్నెల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అంటుంది జ్ఞానాంబ. వెన్నెల విషయంలో ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. నాకు ధైర్యం వచ్చింది. ఓబులేష్ వల్ల కాదు.. నా కోడలు జానకి గురించి ఆలోచించి అంటాడు గోవిందరాజు. తను ఏం చేసినా కరెక్ట్ గా చేస్తుంది అంటాడు గోవిందరాజు.

దీంతో మైరావతి ముఖం అదోలా పెడుతుంది. ఇంతలో ఓబులేష్ వస్తాడు. అమ్మగారు సూపర్ అంటాడు ఓబులేష్. ఎందుకురా అంటుంది మైరావతి. అప్పుడే రామా, జానకి, వెన్నెల అక్కడికి వస్తారు. తనను ఆపడానికి ప్రయత్నిస్తారు కానీ.. ఓబులేష్ ఆగడు.

విషయం చెప్పరా అంటుంది మైరావతి. అమ్మ గారు.. ఆ విషయం ఏంటంటే అంటూ ఆగిపోతాడు ఓబులేష్. అదేంటో గుర్తుకురాదు. నేను మరిచిపోయినప్పుడల్లా చేతులు ఇలా పిసుక్కుంటాను అని చెబుతాడు ఓబులేష్. మరిచిపోయావా అని రామా, జానకి ఖుషీ అవుతారు.

Janaki kalaganaledu 16 March Today Episode : ఓబులేష్ కు గతం గుర్తొస్తుందా?

నీ మతి ఎలా దొబ్బింది అని అడుగుతాడు గోవిందరాజు. దీంతో అదొక రాజమండ్రి.. అదొక బ్యారేజ్. ఎర్ర చీర కట్టుకొని సంధ్య సైకిల్ తొక్కుతూ వెళ్తోంది. తన వెనుక నేను పరిగెడుతూ ఉన్నాను. అలా పరిగెడుతూ సంధ్య వెనుక వెళ్లాను. అప్పుడు సంధ్య.. బిందిచ్చుక్కొటింది. అప్పటి నుంచి మెమోరీ కలాస్ అంటాడు ఓబులేష్.

కాసేపట్లో పెద్ద గండం నుంచి బయటపడ్డాం అంటాడు రామా. అవును.. ఆయన మతిమరుపే మనల్ని కాపాడింది అని అంటుంది జానకి. వెన్నెల.. నువ్వు పొరపాటున కూడా ఓబులేష్ కంట పడకు.. అంటుంది జానకి. ఇంతలో చాటుగా వచ్చి మల్లిక వినడం గమనించి.. వెన్నెల్లో హాయి హాయి అంటూ పాటలు పాడుతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

ఆ తర్వాత రాత్రి పూట అందరూ కులాశాగా మాట్లాడుకుంటూ ఉంటారు. జానకి అందంగా రెడీ అవ్వడంతో తననే చూస్తూ ఉంటాడు. తనకు స్వీట్ తినిపిస్తా అంటాడు. కానీ.. తను వద్దు అంటుంది. అందరూ ఉన్నారు అంటుంది. తనకు స్వీట్ విసిరేస్తాడు.

దీంతో ఆ స్వీట్ ను తను క్యాచ్ చేస్తుంది. ఏదో జరిగింది అంటుంది మల్లిక. దీంతో నేను చెబుతా.. నేను చెబుతా అంటాడు ఓబులేష్. ఇక్కడున్న పాలకోవాను రామా గారు.. జానకికి విసిరేశాడు అంటాడు ఓబులేష్. దీంతో అందరూ నవ్వుతారు. రామా గారు నాకు కూడా ఒకటి నోట్లే వేయండి అంటాడు ఓబులేష్.

ఆ తర్వాత దాన్ని సగం తిని రామాకు విసిరేస్తుంది జానకి. దాన్ని వెంటనే నోట్లో వేసుకుంటాడు రామా. ఆ తర్వాత అందరూ ఆరుబయటే పడుకుంటారు. కట్ చేస్తే ఉదయమే పెళ్లి వారు వస్తారు. అందులో దిలీప్ ను చూసిన ఓబులేష్.. ఇతడిని ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

55 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago