Janaki Kalaganaledu 17 August 2022 Episode : అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ ని పరిచయం చేసుకోబోతున్న జెస్సి.. జ్ఞానాంబకి, జెస్సికి మళ్లీ ఘర్షణ జరగబోతుందా..

Janaki Kalaganaledu 17 August 2022 Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయి మన ముందుకి వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ 368 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జ్ఞానాంబ వాళ్ళ ఇంట్లో రాఖీ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ అందరికీ అందరూ కడుతూ ఉంటారు. కానీ జానకి మాత్రం తను వాళ్ల అన్నయ్యకి రాఖి కట్టలేకపోయినందుకు బాధపడుతూ ఉంటుంది. జానకి బాధపడుతూ ఉంటే మల్లికా సంతోష పడిపోతూ ఉంటుంది. నీకు ఆ అదృష్టం లేకుండా పోయింది అని ఎటకారంగా మాట్లాడుతుంది మల్లిక. అప్పుడు జ్ఞానాంబ ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధపడతారు అనే ఆలోచించకుండా మాట్లాడతావ్ ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు చెప్తున్న అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది జ్ఞానంబ. అందరం గుడికి వెళ్దాం రెడీ అవ్వండి అని చెప్పి జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

జానకి గదిలోకి వెళ్లి వాళ్ళ అన్నయ్యకి రాఖి కట్టలేక పోయినందుకు బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి రామ వస్తాడు. నేను అమ్మతో మాట్లాడన.. అని అంటాడు అండి. మా అన్నయ్య మనసులో చెల్లెలు మీద ప్రేమ సచ్చిపోయింది. నాకు అన్నయ్య మీద ప్రేమ చచ్చిపోయింది. ఇక వెళ్లి కడితే అది మొక్కుబడిగానే ఉంటుంది. చిన్నప్పుడు ఈ రాఖీ పండుగ వచ్చిందంటే నేను ఎంతో హడావిడి చేసే దాన్ని నాకు ఆ అదృష్టం లేదు ఇక దాని గురించి వదిలేయండి రామ గారు అని అంటుంది. నేను అమ్మతో మాట్లాడతాను అని అంటాడు. అప్పుడు జానకి అత్తయ్య గారు మా అన్నయ్యని క్షమించి నన్ను రాఖీ కట్టడానికి పంపించిన సరే నేను వెళ్ళను అని అంటుంది జానకి. అప్పుడు రామ అదేంటి జానకి గారు అని అంటాడు. నా భర్తని అవమానించి నా అత్తవారింటిని అగౌరవంగా మాట్లాడిన బంధం నాకు అక్కర్లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జానకి. ఇదంతా జ్ఞానంబ వింటూ ఉంటుంది. గోవిందరాజు అందర్నీ పిలుస్తాడు.. గుడికి వెళ్లడానికి అందరూ వస్తారు. అఖిల్ మాత్రం బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు జ్ఞానంబ పిలిచి ఎక్కడికెళ్తున్నావ్ రా హడావిడిగా అని అంటుంది.

Janaki Kalaganaledu 17 August 2022 Full Episode

అప్పుడు అఖిల్ నా ఫ్రెండ్ బర్త్ డే అని చెప్తాడు. అప్పుడు మల్లికా ఫ్రెండ్ అంటే అమ్మాయా, అబ్బాయా లేదా లవరా అని అంటుంది. అప్పుడు జ్ఞానాంబ మల్లికను తిడుతుంది చిన్నపిల్లలు పట్టుకుని ఏం మాట్లాడుతున్నావ్ అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అఖిల్ ని కూడా ఫ్రెండ్ పుట్టినరోజు లేదు ఏం లేదు గుడికి వెళ్ళాలి రావాలి అని చెప్తుంది. కానీ అఖిల్ చాలా ముఖ్యమైన ఫ్రెండు నేను వెళ్తాను అని అంటాడు. అప్పుడు గుళ్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత వెళ్ళు గాని రా అని గోవిందరాజు చెప్తాడు. అప్పుడు అఖిల్ జెస్సికి చాటుగా మెసేజ్ చేసి ఇప్పుడు రాలేకపోతున్నాను అని చెప్తాడు. కట్ చేస్తే జెస్సి నేను కూడా గుడికి వెళ్లి అఖిల్ వాళ్ల ఫ్యామిలీని నేనే పరిచయం చేసుకుంటాను. మంచి సందర్భం కదా.. అని గుడికి వెళుతుంది జెస్సి. గుడికి వెళ్లి ప్రదక్షణ చేస్తుండగా జానకి వాళ్ళ అన్నయ్య కనిపిస్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య జానకి అని పిలుస్తుంటే తను పక్కకి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు జానకిని వాళ్ళ అన్నయ్య ఆగు జానకి అని నేను చేసిన తప్పుకి ఎంతో నరకం అనుభవిస్తున్నాను. ఇక నువ్వు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే ఇంకా ఆ నరకం పెరిగిపోతుంది.

నన్ను క్షమించి అన్నయ్య అని పిలవరా.. ఆ బాధ తగ్గిపోతుంది అని అంటాడు. నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నేను మర్చిపోను నా భర్తని ఎంతగానో అవమానించి ఇబ్బంది పడేలా చేశావు. అది నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటుంది. నువ్వు నా పెళ్లి చేసేటప్పుడు అబద్దం చెప్పి పెళ్లి చేశావు దాన్ని క్షమించగలనేమో గాని నా భర్తని అవమానించావు దానిని మర్చిపోయి ఎప్పటికీ నేను క్షమించను క్షమించను అని గట్టిగా అంటుంది. అప్పుడు జ్ఞానాంబ జానకి మీ అన్నయ్యకి రాఖీ కట్టు అని తనకి రాఖీ ఇస్తుంది. అప్పుడు జానకి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఇంకా చూస్తావ్ ఏంటి కట్టు అని అంటుంది జ్ఞానాంబ. అత్తయ్య గారు మా అన్నయ్యని క్షమించడం మీ మంచితనం కావచ్చు.. కానీ నా భర్తకి జరిగిన అవమానం తాలూకా బాద నా మనసులో ఇంకా అలాగే ఉంది అని అంటుంది జానకి. నువ్వు చెప్పింది నిజమే కానీ ఈ రాఖీ పండుగ అంటే అన్న చెల్లెల ప్రేమకు గుర్తు అవన్నీ ఈరోజు మర్చిపోవాలి అందుకే నేనే మీ అన్నయ్యని ఫోన్ చేసి పిలిపించా అని అంటుంది. ఇదంతా చూస్తూ మల్లిక మండిపోతూ ఉంటుంది. తర్వాతే ఏం జరి

Recent Posts

Sahasra Case : క్రిమినల్ కావాలనేదే అతడి కోరిక !!

కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…

30 minutes ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

2 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

2 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

3 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

5 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

5 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

7 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

8 hours ago