janaki kalaganaledu 17 january 2022 episode
Janaki Kalaganaledu 17 Jan Episode Highlights : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం 17 జనవరి 2022, ఎపిసోడ్ 216 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సునంద.. జానకిని తీసుకొని జ్ఞానాంబ ఇంటికి వస్తుంది. మైరావతికి క్షమాపణలు చెబుతుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదు అని చెబుతుంది. నా కొడుకు తప్పు చేశాడు అంటుంది. నీ కొడుకే కాదు.. నువ్వు కూడా తప్పు చేశావు అంటుంది మైరావతి. నీ గురించి నేను ఒక్క క్షణం అయినా ఆలోచన చేశానంటే ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవడానికి నువ్వు ఉండవు.. నీ పదవి ఉండదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపో అని జ్ఞానాంబ కూడా సునందతో అంటుంది.
janaki kalaganaledu 17 january 2022 episode
సునంద వెళ్లిపోయాక.. అసలు ఏం జరిగింది అని మైరావతి.. జ్ఞానాంబను ప్రశ్నిస్తుంది. నేను అప్పుడే చెప్పాను కదా. తనను ఇంట్లో నుంచి పంపించేయమని. ఇంకా జానకిని ఎందుకు ఇంట్లో ఉంచుకున్నారు. నా మాటను ఖాతరు ఎందుకు చేయలేదు అంటూ సీరియస్ అవుతుంది మైరావతి. దీంతో మీ మాటను వినకూడదని కాదు అత్తయ్య గారు. మీకు జానకితో ఎక్కువ రోజులు గడిపే సమయం దొరకలేదు కాబట్టి నేను మీకు జానకి గురించి తర్వాత చెబుదామనుకున్నా అని అంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు ఏమైందో చూశావు కదా. మన ఇంటి పరువును ఈవిడ గంగలో కలిపేసింది అంటుంది మైరావతి. మన కుటుంబం ఏనాడైనా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిందా అని సూటిగా ప్రశ్నిస్తుంది మైరావతి.
అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగింది చెప్పు జానకి అంటుంది జ్ఞానాంబ. కన్నబాబును ఎందుకు కొట్టావు అని అందరూ అడుగుతారు. కానీ.. జానకి మాత్రం ఇప్పుడు నేను ఏం చెప్పలేను అంటుంది జానకి. దీంతో మైరావతికి కోపం వస్తుంది. జ్ఞానాంబకు కూడా కోపం వస్తుంది.
ఇక చాలు.. అడిగింది చాలు. మేము అడిగింది అయిపోయింది. నువ్వు చెప్పేది కూడా అయిపోయింది. ఇక ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే అని జ్ఞానాంబకు చెబుతుంది మైరావతి. అప్పుడు నా నిర్ణయానికి విలువ ఇవ్వలేదు. కనీసం ఇఫ్పుడైనా నువ్వు నిర్ణయం తీసుకో అంటుంది మైరావతి.
ఇదేనా నీకోడలుకు పెద్దవాళ్లంటే ఉన్న గౌరవ మర్యాదలు అంటుంది మైరావతి. అప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని కాదన్నందుకు నాదే తప్పు. ఇక నుంచి అలా జరగకుండా చూసుకుంటాను. జానకి ఈ క్షణమే ఇంటి నుంచి వెళ్లిపో అంటుంది జ్ఞానాంబ. ఈ ఇంటి నుంచి నా కొడుకు జీవితంలో నుంచి వెళ్లిపో అంటుంది జ్ఞానాంబ.
దీంతో అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా రామాకు ఏం చేయాలో అర్థం కాదు. నీకు ఇక ఈ ఇంటితో సంబంధం లేదు అంటుంది జ్ఞానాంబ. శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో అని అందరి ముందు చెప్పేస్తుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.