Janaki Kalaganaledu 21 Dec Today Episode : జానకి కోచింగ్ కోసమే రాజమండ్రి వెళ్తోందని తెలుసుకున్న జ్ఞానాంబ.. జానకికి ఏ శిక్ష విధిస్తుంది?

Janaki Kalaganaledu 21 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 డిసెంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 197 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దెయ్యం అంటూ మల్లికను బెదిరిస్తాడు రామా. దీంతో దెయ్యం దెయ్యం అంటూ భయపడి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది మల్లిక. ఇక తన కోసం తయారు చేసిన గ్రీన్ టీను తీసుకొచ్చి జానకికి ఇస్తాడు రామా. ఏంటండి ఇది అని అడుగుతుంది జానకి. గ్రీన్ టీ అని చెబుతాడు. తాగండి అని ఇస్తాడు తనకు. నాకోసం మీరు తీసుకురావడం ఏంటండి.. తప్పు కదా అంటుంది జానకి. అవునా.. తప్పా. ఇప్పుడు నన్ను కోర్టుకు పిలిచి శిక్ష వేస్తారా? మీరు లాయర్ కూడా కాదే.. నన్ను విడిపించడానికి అంటాడు రామా. జోకులు కాదు రామా గారు.. అంటుంది జానకి. భార్య భర్తకు సేవలు చేయాలి కానీ.. భర్త.. భార్యకు సేవలు చేయడం ఏంటండి అంటుంది జానకి.

janaki kalaganaledu 21 december 2021 full episode

అవన్నీ ఒకప్పుడు.. భార్యాభర్తల మధ్య బంధం ఎప్పుడూ గట్టిగా ఉండాలంటే.. భర్త భార్యకు.. భర్య.. భర్తకు సేవలు చేయాలి.. అంటాడు. భర్త కూడా భార్య సేవలు చేయొచ్చు.. అంటాడు. దీంతో జానకి.. రామా కాళ్లకు మొక్కుతుంది. దీంతో జానకి గారు ఏం చేస్తున్నారు. తప్పు అండి అంటాడు. తప్పు కాదండి. మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్థం కావడం లేదండి అంటుంది. అలా కాసేపు సరదాగా ఇద్దరు గడుపుతారు. జానకి గారు. మీరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే విషయం ఒకటి చెప్పనా అంటాడు. మల్లిక గురించి చెబుతాడు. దెయ్యం అనుకొని మల్లిక తన రూమ్ లోకి పరిగెత్తిందని చెబుతాడు రామా. తర్వాత జానకి చదువుకుంటూ ఉంటుంది. రామా అక్కడ నిద్రపోతాడు. దీంతో తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది జానకి.

కట్ చేస్తే తెల్లారుతుంది. అప్పుడే నిద్రలేచిన మల్లిక.. దెయ్యం దెబ్బకు ఇంకా భయపడుతూనే ఉంటుంది. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ కాఫీ పట్టుకొని వస్తుంది. ఇంతలో జ్ఞానాంబ వస్తుంది. అత్తయ్య గారు కాఫీ అంటూ ఇస్తుంది. ఏంటి ఎప్పుడూ లేనిది ఇప్పుడు కొత్తగా దేవుడిని తలుచుకుంటున్నావేంటి అంటుంది.

భక్తి కాదు అత్తయ్య గారు భయం అంటుంది. భయం ఎందుకు అంటుంది జ్ఞానాంబ. అది కాదు అత్తయ్య గారు.. మన ఇంట్లో దెయ్యం ఉందండి అంటుంది. ఏంటి దెయ్యమా అంటుంది జ్ఞానాంబ. అవును అత్తయ్య గారు రాత్రి నన్నే దెయ్యం భయపెట్టింది అంటుంది మల్లిక. ఆ విషయాన్ని జానకి, రామా విని నవ్వుకుంటారు.

జోకులు కాదు అత్తయ్య గారు. సీరియస్ మ్యాటర్ ఇది అంటుంది. కానీ.. జ్ఞానాంబ నమ్మదు. ఇంతలో రామా వచ్చి.. వద్దని చెప్పాను కదా జానకి గారు. నా మాట వినండి అంటూ యాక్షన్ చేస్తాడు రామా. అమ్మ వద్దని చెప్పింది కదా.. తెలిసిందే కదా అంటాడు. తెలిసి కూడా అమ్మతో మాట్లాడటానికి రావడం ఏంటి అంటాడు రామా.

Janaki Kalaganaledu 21 Dec Today Episode : జ్ఞానాంబకు జానకితో రాజమండ్రికి.. కేకుల షాపుకు బయలుదేరిన ఇద్దరు

ఇంతలో జ్ఞానాంబ విని.. రామా ఏమైంది. దేని గురించి మీ మధ్య గొడవ.. అంటుంది జ్ఞానాంబ. అదేదో బర్రె కేకు నేర్చుకోవడం మిగిలిపోయిందట. బర్రె, దున్నపోతు కేకు కాదండి. స్ట్రాబెర్రి కేకు అంటుంది జానకి. అది నేర్చుకోవడానికి మరికొన్ని రోజులు రాజమండ్రి వెళ్తా అంటున్నారు అని అంటాడు రామా.

ఏంటి జానకి ఆ కేకులు తయారు చేయడం తప్పనిసరిగా నేర్చుకోవాలా అంటుంది జ్ఞానాంబ. దీంతో అవును అత్తయ్య గారు. చాలా చాలా ముఖ్యం అంటుంది. ఇప్పటి వరకు నేర్చుకున్న దానికి ఒక అర్థం విలువ ఉంటాయి అంటుంది జానకి. దీంతో రామా.. కోడలు అంత ముఖ్యం అని చెబుతున్నప్పుడు నేను ఎందుకు కాదంటాను నాన్న అంటుంది జ్ఞానాంబ.

దీంతో ఇద్దరూ ఖుషీ అవుతారు. జ్ఞానాంబ కాళ్లకు దండం పెట్టి రాజమండ్రికి బయలుదేరుతారు. ఓయబ్బో… ఏదో ఐపీఎస్, ఐఏఎస్ పరీక్ష రాయడానికి వెళ్తున్నట్టు తెగ డైలాగులు కొడుతున్నారు వీళ్లు అనుకుంటుంది మల్లిక. అయితే.. ముఖ్యమైన పని మీద నేను కూడా రాజమండ్రికి వెళ్తున్నాను. జానకిని నేను తీసుకెళ్తానులే అంటుంది జ్ఞానాంబ.

దీంతో రామా, జానకి షాక్ అవుతారు. ఇంతలో మల్లిక కల్పించుకొని.. బావ గారు మీరు భలే ఉన్నారు. అత్తయ్య గారు ఏమైనా జానకిని సంకలో తీసుకొని వెళ్తున్నారా? ఇందులో శ్రమ ఏముంటుంది.. అంటుంది. మధ్యలో పుల్ల పెడుతుంది. దీంతో సరే.. పదా అని జ్ఞానాంబ అంటుంది.

ఇంతలో కారు డ్రైవర్ కోసం వెతుకుతుంది జ్ఞానాంబ. జానకిని పిలుస్తుంది. ఇద్దరు కలిసి కారులో రాజమండ్రి బయలుదేరుతారు. జానకికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. రామా కూడా కొట్టుకు వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. ఇప్పుడు అమ్మ ఆ కేకుల షాపు దగ్గరికి వెళ్తే ఇంకేమైనా ఉందా అని అనుకుంటుంది.

నీకు కేకులు తయారు చేసిన షాపు అతడికి మన కుటుంబం అంటే చాలా గౌరవం. నీకు కేకు తయారు చేయడం నేర్పించి బహుమతి గెలుచుకునేలా చేసినందుకు అతడికి నేను కూడా కృతజ్ఞతలు చెప్పాలి అంటుంది జ్ఞానాంబ. మరోవైపు రామా.. వీరభద్రానికి ఫోన్ చేస్తాడు. కానీ.. ఫోన్ కలవదు.

దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. ఇంతలో కాలేజీలో కారు ఆపి.. పుస్తకాలు మాస్టారుకు ఇచ్చివస్తాను అంటుంది జానకి. మీరు వెళ్లండి. నేను పుస్తకాలు ఇచ్చి వస్తాను అంటుంది. కానీ.. నేను కూడా వస్తా అంటుంది జ్ఞానాంబ. లోపలికి ఇద్దరూ వెళ్తారు. పరమేశ్వరం మాస్టార్ ఎక్కడ ఉన్నారు అని అక్కడ ఉన్న స్టూడెంట్ ను అడుగుతుంది జ్ఞానాంబ. అటువంటి వాళ్లు ఎవరూ లేరిక్కడ అంటుంది ఆ స్టూడెంట్. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago