
janaki kalaganaledu 21 march 2022 full episode
Janaki Kalaganaledu 21 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మార్చి 2022, సోమవారం ఎపిసోడ్ 261 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చెప్పు జానకి.. మల్లిక చెప్పింది అబద్ధం అని చెప్పు. నా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తించి నువ్వు అలా చేయవు అని చెప్పు. అన్నింటికీ మించి నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టవు అని చెప్పు అంటుంది జ్ఞానాంబ. సమాధానం చెప్పవేంటి అని అడుగుతుంది. అంటే మల్లిక నీ గురించి చెప్పిన విషయాలు అన్నీ నిజమే అనుకోవాలా అంటుంది జ్ఞానాంబ.
janaki kalaganaledu 21 march 2022 full episode
ఇంతలో పెళ్లి కొడుకు తరుపు బంధువులను బయటికి వెళ్లమని మైరావతి చెబుతుంది. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డాం కదా. ఈ విషయం మల్లికకు ఎలా తెలిసింది అని అనుకుంటాడు రామా. ఇంతలో మైరావతి.. మల్లికను పిలిచి ఇదంతా నిజమేనా అని అడుగుతుంది. దీంతో నిజం అంటుంది. నిజం చెప్పు.. అబద్ధం చెప్పావంటే మొహం సొట్టపడిపోద్ది అంటుంది. కంఠం తెగిపోతున్నప్పుడు కూడా మా నోటి నుంచి నిజం తప్ప అబద్ధమే రాదు అమ్మమ్మ గారు అంటుంది. ఇంతలో గోవింద రాజు.. మల్లిక మీద అరుస్తాడు. మైరావతి.. రామాను అడుగుతుంది. దీంతో రామా కూడా అవును నానమ్మ అంటాడు.
దీంతో మైరావతి షాక్ అవుతుంది. మరోవైపు అడుగుతుంటే సమాధానం చెప్పు అని జ్ఞానాంబ.. జానకిని అడుగుతుంది. ఇంతలో మైరావతి వచ్చి అవసరం లేదు అంటుంది. తన మౌనమే సమాధానం.. తన కన్నీళ్లే తప్పు చేశానని చెప్పడానికి నిదర్శనం. ఏయ్ మిడత.. ఈ పిల్ల చెప్పిన ప్రతి మాట అక్షరాలా నిజం. మన వెన్నెల, అబ్బాయి ప్రేమించుకున్నారు అంటుంది మైరావతి.
ఈ విషయం అందరి దగ్గర దాచిపెట్టారు. వీళ్లంతా కలిసి దీన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చేయాలని పథకం వేశారు అంటుంది మైరావతి. ఆ పథకంలో భాగంగానే జానకి.. ఆ అబ్బాయిని వాళ్ల బంధువుగా చెప్పింది. నీ పెద్ద కోడలు గురించి నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించుకోకుండా.. గుడ్డిగా నమ్మి నెత్తిన ఎక్కించుకున్నావు కదా అంటుంది మైరావతి.
ఈ పిల్ల దగ్గర చదువుకున్న చావు తెలివితేటలు చాలా ఉన్నాయి. ఆ తెలివితేటలతో మిమ్మల్ని అందరినీ గోదాట్లో కలిపేస్తుందని నేను ఎప్పుడో చెప్పినాను కదా అంటుంది మైరావతి. ఇంతమందిని తన మాటలతో గుప్పిట్లో పెట్టుకొని నిన్ను గంగిరెద్దులా ఆడించిందంటే తను ఎంత మాటల మాయలేడో తెలుసుకో అని జ్ఞానాంబతో అంటుంది మైరావతి.
నిన్ను కూతురులా చూసుకున్నాను. నా గౌరవం నిలబెట్టే కోడలు దొరికిందని గర్వంతో పొంగిపోయాను. నా కొడుకు కంటే ఎక్కువగా నమ్మానే నిన్ను. అంతలా నమ్మిన నిన్ను నమ్మించి మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది అని తనను కొట్టబోతుంది జ్ఞానాంబ.
దీంతో జ్ఞానాంబ చేయిని ఆపుతాడు రామా. తనను కొట్టనీయకుండా తన చేతిని పట్టుకుంటాడు. తప్పు చేసిన వాళ్లను శిక్షించడంలో అర్థం ఉంది కానీ.. మేలు చేయాలని చూసిన వాళ్లను శిక్షించడం ధర్మం కాదు అమ్మ అంటాడు రామా. వాళ్లను తన బంధువులని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నిస్తుంది మైరావతి.
జానకి గారు అలా చేయకుండా ఉండి ఉంటే.. ఈ పాటికి వెన్నెల చచ్చిపోయి ఉండేది అని అసలు నిజం చెబుతాడు రామా. రామయ్య.. ఏం మాట్లాడుతున్నావురా.. అంటుంది. దీంతో అవును నానమ్మ అని అసలు విషయం చెబుతాడు రామా.
ప్రేమించిన వాడు దూరం అవుతున్నాడని.. వెన్నెల, దిలీప్ ప్రాణాలు తీసుకోవడానికి వెళ్లారు.. అని అసలు నిజం చెబుతాడు రామా. నేను, జానకి గారు వాళ్లను చూడటం ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే కనీసం వాళ్ల శవాలు కూడా మనకు కనిపించి ఉండేవి కావు అని చెబుతాడు రామా.
ప్రేమించిన వాడితో పెళ్లి చేయకపోతే వెన్నెల ప్రాణాలతో ఉండదు. ప్రేమ పెళ్లి అంటే అమ్మ ఒప్పుకోదు. అందుకే.. వీళ్ల ప్రేమ పెళ్లిని పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చేయాలని అనుకున్నాం. అమ్మకు కడుపుకోత ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం. అంతే కానీ.. ఇందులో ఎలాంటి నమ్మక ద్రోహం లేదు అంటాడు రామా.
నిజంగా జానకి గారికి అమ్మను మోసం చేయాలనుకుంటే.. ఎప్పుడో ఏ గుడిలోనో పెళ్లి చేసి ఉండేవారు. అంతే కానీ.. వాళ్ల కాళ్లు పట్టుకొని ఒప్పించి ఉండేవారు కాదు అని అంటాడు రామా. అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు జానకి గారు ఎంత నరకం అనుభవించారో నేను కళ్లారా చూశాను అమ్మా అంటాడు రామా.
చెల్లి ప్రాణాలు తీసుకుంటే నువ్వు తట్టుకొని బతకగలవా అమ్మా. జానకి గారు ఇదొక్క విషయం గురించే ఆలోచించారు.. అందుకే ఇంత పెద్ద సాహసం చేశారు అంటాడు రామా. జానకి గారికి నువ్వంటే ఎంత ప్రేమో.. అంతే గౌరవం అంటాడు రామా.
కానీ.. జ్ఞానాంబ మాత్రం జానకిని క్షమించదు. ప్రేమ పెళ్లిళ్ల మీద నాకు నమ్మకం లేదు అంటుంది జ్ఞానాంబ. మీరు నా నమ్మకంతో ఆడుకున్నారు. ఇది ఖచ్చితంగా నమ్మకద్రోహమే అంటుంది జ్ఞానాంబ. మీరెన్ని సంజాయిషీలు చెప్పినా.. ఎన్ని కారణాలు చెప్పినా మీ మోసాన్ని నేను క్షమించలేను అంటుంది జ్ఞానాంబ.
అత్తయ్య గారు.. తన తెలివితేటల గురించి మీరు నాకు మూడు సార్లు చెప్పారు. అయినా సరే నేను తనను బలంగా నమ్మాను. మీ నిర్ణయాన్ని కాదన్నాను. కానీ.. తనేంటో నాకు ఇప్పుడే అర్థం అయింది. మీరందరూ కలిసి నా కళ్లు తెరిపించారు. మీ గురించి తెలుసుకునేలా చేశారు అంటుంది జ్ఞానాంబ.
ఈరోజు తన విషయంలో నిర్ణయం తీసుకునే అర్హత నాకు లేదు. ఈ సమస్యను, మోసం చేసిన వాళ్లను మీ దగ్గరే వదిలేసి వెళ్తున్నాను. ఏ నిర్ణయం తీసుకుంటారో.. ఎలాంటి శిక్ష వేస్తారో మీ ఇష్టం. వస్తాను అత్తయ్య అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
నువ్వు చేసిన తప్పుకు ఏ శిక్ష వేసినా తప్పు లేదు. అందుకే.. నీ మీద నాకున్న అభిప్రాయానికి నాకు నేను శిక్ష వేసుకుంటున్నాను అంటుంది మైరావతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.