Janaki Kalaganaledu 22 July Today Episode : జానకి చదువు విషయం తెలిసి గోవింద రాజు షాక్.. ఈ విషయం జ్ఞానాంబకు చెబుతాడా?

Advertisement
Advertisement

Janaki Kalaganaledu 22 July Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జులై 2022, శుక్రవారం ఎపిసోడ్ 350 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జానకి నువ్వైనా గీతకు చెప్పు.. సర్దిచెప్పు అని అంటుంది జ్ఞానాంబ. దీంతో జానకిని చూసి నువ్వు చాలా గ్రేట్. ఒక చిన్న మాట కోసం అంతగా ఇష్టమైన నీ చదువును త్యాగం చేశావు అంటూ గీత జానకిని మెచ్చుకుంటుంది. తన తల్లిదండ్రులు కూడా తనకు ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోతారు. ఆ తర్వాత నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం చేయాలో రామా, జానకికి అర్థం కాదు. మీ చదువు కాగితాలు లేకపోతే మీ ఐపీఎస్ చదువు అర్థాంతరంగా ఆగిపోతుంది. అమ్మను అడిగి చదవు కాగితాలు తీసుకోలేరు. ఇప్పుడు ఎలా అని అంటాడు రామా. దీంతో నేను అదే ఆలోచిస్తున్నాను రామా గారు అంటుంది జానకి. ఈరోజు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అకాడెమీలో సబ్మిట్ చేయకపోతే రేపటి నుంచి ఇక అకాడెమీకి రానివ్వరు అంటుంది జానకి. అయితే.. ఇవన్నీ గోవింద రాజు వెంటాడు. విని షాక్ అవుతాడు.

Advertisement

janaki kalaganaledu 22 july 2022 full episode

ఒరేయ్ రాముడు.. ఇది నిజమా. మాకు ఎవ్వరికీ తెలియకుండా జానకి చదువుకుంటుందా? అంటాడు. మాట్లాడవేంట్రా అంటాడు గోవిందరాజు. అవును.. చదివిస్తున్నాను నాన్న అంటాడు రామా. దీంతో గోవిందరాజు షాక్ అవుతాడు. ఏంటి.. నువ్వు చదివిస్తున్నావా అని అడుగుతాడు. ఒరేయ్.. నీకసలు మతి ఉందా? ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా? చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయడం వల్ల తన తమ్ముడి ప్రాణాలు పోయాయన్న భయంతో ఉందిరా మీ అమ్మ. అందుకే.. నీ జీవితంలో ఎక్కడ అలాంటి పరిస్థితులు వస్తాయని నీకంటే తక్కువ చదువుకున్న అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంది. జానకి డిగ్రీ చదివిందని తెలిసి మీ అమ్మ గుండె ఆగిపోయింది. ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తూ భయపడుతూ బతుకుతోంది. దేవుడి దయవల్ల మీ అమ్మ జానకి మంచితనాన్ని అర్థం చేసుకుంది. అలాంటిది స్వయంగా నువ్వే జానకిని చదివిస్తున్నావని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటాడు గోవిందరాజు.

Advertisement

దీంతో తను బతికి ఉన్నంత కాలం కన్నీళ్లు పెట్టుకొని బతుకుతుంటే నేను చూసి ఉండలేను నాన్న. తన జీవితానికి పెళ్లే ఒక శాపంలా మారింది. ఐపీఎస్ అవ్వాలనే తన కలను బలి తీసుకుది. తన కన్నవాళ్ల ఆత్మకు శాంతి లేకుండా చేసింది నాన్న అంటాడు రామా.

మనకు ఇష్టమైన వాళ్లు దూరం అయితేనే మనం తట్టుకోలేం. అలాంటిది తన ప్రాణానికి ప్రాణమైన తన ఐపీఎస్ కల దూరం అయితే తను తట్టుకోగలదా అంటాడు రామా. జానకి మీద మీ అమ్మ బోలెడు నమ్మకంతో ఉందిరా అంటాడు గోవిందరాజు. ఈ విషయం తెలిస్తే మీ అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉందిరా అంటాడు గోవిందరాజు.

Janaki Kalaganaledu 22 July Today Episode : జానకి, రామా మాట్లాడుకుంటుండగా విన్న గోవింద రాజు

ఇందులో జానకి తప్పేం లేదు అంటాడు రామా. తన ఐపీఎస్ కలను వదిలేయడం అంటే.. ప్రాణాన్ని వదిలేయడమే. నేనే బలవంతం పెట్టి జానకిని చదివిస్తున్నాను. తను అమ్మ మాటకు కట్టుబడి ఐపీఎస్ కలను వదిలేస్తానంది. కానీ.. తను ఖచ్చితంగా ఐపీఎస్ చదివి తీరుతుంది.

జానకి కాగితాలు అమ్మ దగ్గర ఉండిపోయాయి. నువ్వే సాయం చేయాలి నాన్న. అమ్మ దగ్గరి నుంచి నువ్వే ఆ కాగితాలు ఇప్పించు నాన్న అంటాడు రామా. దయచేసి ప్రయత్నించు. నువ్వే ఎలాగైనా ఇప్పించు అంటాడు రామా. దీంతో గోవిందరాజుకు ఏం చేయాలో అర్థం కాదు.

దీంతో అలాగేరా అంటాడు గోవిందరాజు. మీ అమ్మతో మాట్లాడి ఏదో ఒక విధంగా ఆ కాగితాలు వచ్చేలా చేస్తాను అంటాడు గోవిందరాజు. దీంతో అలాగే నాన్న అంటాడు రామా. దీంతో జానకి సంతోషిస్తుంది. ఏం చేయాలి అని అనుకుంటూ వెళ్లిపోతాడు గోవిందరాజు. ఇంతలో రామాను గట్టిగా హత్తుకుంటుంది జానకి.

మరోవైపు జ్ఞానాంబ మంచినీళ్లు తాగుతుండగా తన దగ్గరికి వెళ్తాడు గోవిందరాజు. జానకి చదువు కాగితాల గురించి జ్ఞానాన్ని ఎలా అడగాలో అర్థం కావడం లేదు అని అనుకుంటాడు గోవిందరాజు. ఇంతలో అక్కడికి వస్తాడు. దీంతో ఏమండి.. మీకు ఈ విషయం తెలుసా? గీత ఇంటికి వచ్చింది. తనకు మన జానకి త్యాగం చేసిన చదువు గురించి చెప్పాను. దీంతో ఆమె అత్తవారింటికి వెళ్తా అని చెప్పింది. ఆ అమ్మాయి కాపురం నిలబడిందంటే దానికి కారణం జానకి అంటుంది జ్ఞానాంబ.

మరి.. నీకు జానకి మీద ఎందుకు నమ్మకం లేదు అంటాడు గోవిందరాజు. నిజంగా తన మీద నమ్మకం ఉంటే తన చదువు కాగితాలను నీ దగ్గర పెట్టుకోవు కదా జ్ఞానం.. అంటాడు గోవిందరాజు. ఆరోజు అంటే నువ్వు తన చదువు కాగితాలను తీసుకున్నావు. కానీ.. ఇంకా ఎందుకు తన దగ్గర పెట్టుకున్నావు. నీకు నమ్మకం వచ్చాక తన చదువు కాగితాలను తిరిగి ఇచ్చేయొచ్చు కదా జ్ఞానం.. అంటాడు గోవింద రాజు.

దీంతో అవునండి మీరు చెప్పింది కూడా నిజమే. అసలు మీరు చెప్పిన ఈ విషయం గురించి నేను అస్సలు ఆలోచించలేదు అంటుంది. అందుకే తన చదువు కాగితాలు తనకు ఇచ్చేయ్ అంటాడు జ్ఞానాంబ. జానకి చదువు కాగితాలను తనకే ఇచ్చేస్తాను అంటుంది జ్ఞానాంబ.

ఇప్పుడు కాదు.. జానకి నెలతప్పిందన్న శుభవార్త వినగానే అదే సమయంలో ఆ కాగితాలను జానకికి ఇచ్చేస్తాను అంటుంది జ్ఞానాంబ. దీంతో దానికి, దీనికి సంబంధం ఏంటి అంటాడు గోవిందరాజు. తనకు నెల తప్పాక ఒక బహుమతిగా ఆ కాగితాలను ఇచ్చేస్తాను అంటుంది జ్ఞానాంబ.

వెంటనే ఈ విషయం వెళ్లి జానకి, రామాకు చెబుతాడు గోవింద రాజు. రేపటి నుంచి జానకి గారిని చదువుకోవడానికి రానివ్వరు అంటాడు రామా. నాకు ఊపిరి ఆడట్లేదు అంటాడు. ఇవన్నీ చాటుగా మల్లిక వింటూ ఉంటుంది. కాగితాలు లేకపోతే చదువు ఆగిపోతుంది అని అంటాడు రామా.

దీంతో గోవింద రాజుకు ఒక ఐడియా వస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. నేను ఇప్పుడే వస్తాను ఉండండి అంటాడు గోవింద రాజు. వెంటనే జ్ఞానాంబ రూమ్ లోకి వెళ్లి ఒక కీ తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం ఇదే అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Shiva Puja Tips : శివయ్య పూజకు ఈ వస్తువులు నిషేధం… శివపురాణ ప్రకారం శివయ్యకు ఆగ్రహాన్ని తెప్పించేవి ఇవే…?

Shiva Puja Tips : పురాణాల ప్రకారం శివయ్య బోలా శంకరుడు అని అంటారు. ఆయనకు ఇంత కోపం వస్తుందో…

54 minutes ago

Hindu Deities : ఎలాంటి గ్రహదోషాలు తొలగాలన్నా… ఈ ఏడుగురు మూర్తులతోనే సాధ్యం… వీరి అనుగ్రహం కోసం ఇలా చేయండి…!

Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…

2 hours ago

Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ

Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…

12 hours ago

Shilajit In Ayurveda : శిలాజిత్ అనే పదం ఎప్పుడైనా విన్నారా… ఇది ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు… దీని గురించి తెలుసా….?

Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…

13 hours ago

Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్… దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా…?

Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…

14 hours ago

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా.. ప్ర‌త్య‌ర్ధుల‌కి చుక్క‌లే..!

Rohit Sharma : ఐపీఎల్‌-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఘ‌న…

15 hours ago

Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్…వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…

16 hours ago

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…

17 hours ago