Janaki Kalaganaledu 23 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 263 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిలా చేద్దామని చెప్పావు కదా అని పెళ్లి కొడుకు తండ్రి జానకితో అంటాడు. ఓ మై గాడ్.. మా అత్తయ్య గారి మంచితనానికి వెన్నుపోటు పొడిచిన కుట్రలో ప్రధాన సుత్రధారి జానకి అన్నమాట అని అంటుంది మల్లిక. ఈ విషయం బయటపెడితే చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. మీ అత్తయ్యకు ముందే చెప్పితే మంచిది అని నేను అంటే అస్సలు నా మాట వినలేదు.. అంటుంది పెళ్లికొడుకు తల్లి. కానీ.. ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటానని నన్ను పక్కకు తీసుకెళ్లి మరీ నచ్చెప్పావు అంటుంది.
మీరు చెప్పేది నిజమా అంటుంది జ్ఞానాంబ. దీంతో అవునండి.. చెప్పనీయకుండా ఆరోజు మీ కోడలు జానకి అడ్డుపడింది అని అంటుంది పెళ్లి కొడుకు తల్లి. అవును అత్తయ్య గారు.. జానకి మీతో మాట్లాడనీయకుండా పక్కకు తీసుకెళ్లింది మీకు గుర్తుందా అని ఇంకా అగ్నికి ఆజ్యం పోస్తుంది మల్లిక. నేను ఇల్లు చూద్దామని వెళ్లినప్పుడు జానకితో ఈవిడ సీరియస్ గా మాట్లాడటం నేను చూశాను అంటుంది మల్లిక. మల్లిక నువ్వు కాస్త నోరు మూసుకుంటావా అంటాడు గోవింద రాజు.
మరోవైపు చెప్పవమ్మా.. ఎలాంటి గొడవలు జరగకుండా అన్నీ నేను చూసుకుంటా అన్నావు కదా. ఇప్పుడు ఏమైంది అని అడుగుతాడు పెళ్లి కొడుకు తండ్రి. వాళ్లు ప్రాణాలు తీసుకోబోయారు అనేది కూడా అబద్ధం అయి ఉండొచ్చు అంటుంది పెళ్లి కొడుకు సోదరి.
అబద్ధం కాదు.. మేము చెప్పేది నిజం అని జానకి చెప్పినా కూడా వాళ్లు వినరు. చివరకు రామా కూడా అదే చెబుతాడు. చనిపోతున్నామని వెన్నెల మాకు ఫోన్ చేసింది.. అని జానకి చెబుతుంది. దీంతో మిగితా ఎవ్వరికీ చెప్పకుండా కేవలం మీకే చెప్పడం ఏంటి.. అని అంటుంది.
నువ్వేం కొడుకువయ్యా.. భార్యతో చేతులు కలిపి అమ్మను మోసం చేయడానికి సిగ్గుగా లేదా అంటాడు. తల్లిని మోసం చేసే కూతురు కూడా. ఇదేనా మీ పెంపకం అని అడుగుతుంది. దీంతో జ్ఞానాంబకు ఏం చేయాలో అర్థం కాదు. మీ కుటుంబం ఎంత గొప్ప కుటుంబమో ఇప్పటికైనా అర్థం చేసుకోండి జ్ఞానాంబ గారు అని అంటుంది పెళ్లి కొడుకు తల్లి.
మీ వాళ్లు ఎలాంటి వాళ్లో అర్థం చేసుకోండి. మీలాంటి నాటకాల కుటుంబం నుంచి మీ అమ్మాయిని చేసుకోవడానికి ఎవ్వరూ రారు. మా పరువు తీసిన మీ కొడుకు, కోడలును పోలీస్ స్టేషన్ కు లాగుతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంతలో నీలావతి వచ్చి నిన్ను చూస్తుంటే జాలి వేస్తోంది అంటుంది. నీ మాట జవదాటని నీ కొడుకును తన గుప్పిట్లో పెట్టేసుకుంది అంటుంది నీలావతి. బయటపడిపోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకెన్ని అబద్ధాలు చెప్పి ఉండేవాళ్లో. నిన్ను పిచ్చిదాన్ని చేసి గొర్రెలా ఇంకెంత ఆడించేవాళ్లో.. అని అంటుంది నీలావతి.
అందుకే అంటారమ్మా.. గుడ్డిగా నమ్మి కోడలును నెత్తి మీద పెట్టుకోవద్దని అని చెప్పి అక్కడి నుంచి నీలావతి వెళ్లిపోతుంది. మరోవైపు జ్ఞానాంబ కూడా ఇంట్లోకి వెళ్లిపోతుంది. కట్ చేస్తే రాత్రి అవుతుంది. జ్ఞానాంబ ముందు అందరూ నిలబడి ఉంటారు.
నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని తగలపెట్టడమే కాదు. ఇన్నేళ్లుగా నేను మోస్తున్న కాపాడుకుంటూ వస్తున్న ఇంటి పరువును కూడా తగలబెట్టారు. నమ్మకం అనే మాటనే చంపేశారు. కడుపున పుట్టిన బిడ్డలను కూడా గుడ్డిగా నమ్మకూడదని నాకు తెలిసేలా చేశారు అంటుంది జ్ఞానాంబ.
అన్నింటికీ మించి అమ్మ ప్రేమనే మోసం చేశారు. మీలాంటి వాళ్లకు నా ఎదురుగా ఉండే హక్కు లేదు. నా ఇంట్లో ఉండే హక్కు లేదు అంటుంది జ్ఞానాంబ. ఈ విషయంలో ఎవ్వరూ మాట్లాడకూడదు అంటుంది జ్ఞానాంబ. ఈరోజు నుంచి నాకు పెద్దకొడుకు, పెద్ద కోడలు లేరు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది జ్ఞానాంబ.
ఈ జన్మలో మీరు నా కంటికి కనిపించకూడదు. మీ నీడ, గాలి ఏదీ నాకు తాకడానికి కూడా వీలు లేదు. వెళ్లిపోండి అంటుంది జ్ఞానాంబ. నన్ను అమ్మ అని పిలవొద్దు అంటుంది జ్ఞానాంబ. మన మధ్య బంధం తెగిపోయింది. ఇప్పుడు నాకు ఇద్దరే కొడుకులు అంటుంది జ్ఞానాంబ.
వదిలేసుకున్నాను.. పెద్ద కొడుకుకు నీళ్లు వదిలేసుకున్నాను అంటుంది జ్ఞానాంబ. అసలు నా కడుపునే పుట్టలేదు అనుకుంటాను. ఇంకోసారి అలా పిలిస్తే నన్ను చంపుకుతిన్నంత ఒట్టు అంటుంది. వెళ్లండి.. ఇంకొక క్షణం కూడా మీరు నా కంటి ముందు కనిపించడానికి వీలు లేదు.. వెళ్లిపోండి అంటుంది జ్ఞానాంబ.
జరిగిన దాంట్లో అన్నయ్య, వదిన తప్పు లేదు. వాళ్లు ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే అంటుంది వెన్నెల. కానీ.. తన మాట వినకుండా.. తన చెంప వాయిస్తుంది జ్ఞానాంబ. వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అని చెబుతుంది జ్ఞానాంబ.
దీంతో రామా, జానకి.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఇక.. ఇంట్లో మల్లికదే రాజ్యం అవుతుంది. ఇక నుంచి ఈ ఇంట్లో నేనే రాజు.. నేనే మంత్రి అనుకుంటుంది. ఇంతలో తను రామా, జానకి.. అక్కడే ఉండటం చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్‌సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
Hyderabad Air Quality : ఇన్నాళ్లు ఢిల్లీలో వాయి కాలుష్యం ఎక్కువ అని వినేవాళ్లం. కాని ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా…
Devi Sri Prasad : పుష్ప2 మ్యూజిక్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్‌కి నిర్మాతలకి గొడవలు జరిగినట్టు అనేక వార్తలు…
Groom Chase : అచ్చం సినిమాలో జరిగిన చేజ్ సీన్ విధంగా బయట ఓ సంఘటన జరిగింది. విలన్ పారిపోతుంటే…
Allu Arjun Pushpa 2 Kissik Song : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా పుష్న2…
Kangana Ranaut : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ఘోర పరాజయం తర్వాత, బాలీవుడ్ నటి, బిజెపి…
This website uses cookies.