Janaki Kalaganaled 25 May Today Episode : రామా, జానకిని వంటల పోటీలకు ఒప్పించిన గోవిందరాజు.. ఇంతలో జ్ఞానాంబ షాకింగ్ నిర్ణయం.. జానకి ఒప్పుకుంటుందా?

Janaki Kalaganaled 25 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 మే 2022, బుధవారం ఎపిసోడ్ 308 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వంటల పోటీలకు ఇవాళే ఆఖరి తేదీ కావడంతో అప్లికేషన్ నింపడానికి వెళ్లాం అని జ్ఞానాంబతో చెబుతుంది జానకి. దీంతో నీ సొంత పెత్తనం చేస్తున్నావా అంటుంది. నా కొడుకు అసలే అమాయకుడు. అక్కడికి బాగా చదువుకున్న వాళ్లు వస్తారు. ఈ పోటీలు, గీటీలు ఏం అక్కర్లేదు. నేను వద్దని చెప్పాక కూడా నువ్వు వెళ్లి అప్లికేషన్ ఇచ్చావు అంటే ఏంటి నీ ధైర్యం. నన్ను ఎదిరించి తీసుకెళ్దామనా.. లేకపోతే నాకు చెప్పకుండా దొంగచాటుగా తీసుకెళ్దామనా అంటుంది జ్ఞానాంబ. నేను ఒప్పుకోనని తెగేసి చెప్పినా కూడా ఇంకా ఏంటి ఇవన్నీ. వీళ్ల అన్నయ్య చేసిన అవమానంతో ఇప్పటికే వీడు మానసికంగా కుంగి పోతున్నాడు. అక్కడ కూడా ఏదైనా అవమానం జరిగితే నా కొడుకు తట్టుకొని బతకలేడు. నా కొడుకు బాధ ఈ అమ్మకు మాత్రమే అర్థం అవుతుంది. మీకెవరికీ అర్థం కాదు అని అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 25 may 2022 full episode

అత్తయ్య గారు.. ఆయనకు ఎటువంటి అవమానం జరగదు. ఆయన్ను గెలిపించే బాధ్యత నాది.. అంటుంది జానకి. దీంతో చాలు.. ఇక నిన్ను నమ్మింది చాలు. నిన్ను ఇంకా నమ్మే సహనం నాకు లేదు. ఈ వంటల పోటీల ప్రస్తావన ఇంకోసారి నీ నోటి నుంచి వచ్చినా.. నా ముందు ప్రస్తావించినా మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్ఞానాంబ. గోవిందరాజు సర్దిచెప్పినా కూడా వినదు జ్ఞానాంబ. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు రామా, జానకి. గోవింద రాజు.. రామా, జానకి దగ్గరికి వచ్చి బాధపడుతూ కూర్చోకు. అడుగు ముందుకెయి అంటాడు గోవిందరాజు. అత్తయ్య గారు పోటీలకు వెళ్లొద్దని చెప్పాక ఇక ఎలా అడుగు ముందుకు వేయగలం అంటుంది జానకి. దీంతో అందుకే చెప్పకుండా వెళ్లండి అంటాడు గోవింద రాజు. ప్రస్తుతం ఈ సమస్యకు ఇదొక్కటే పరిష్కారం అంటాడు గోవింద రాజు.

మీరు మూడో కంటికి తెలియకుండా వెళ్లి పోటీల్లో పాల్గొని రండి అంటాడు గోవింద రాజు. ఏంటి నాన్న అలా చెబుతున్నారు అమ్మకు చెప్పకుండా వెళ్తే.. తర్వాత తెలిస్తే ఎంత బాధపడుతుంది అంటాడు రామా. ఒరేయ్.. రాముడు మీ అమ్మ భయపడేది.. పోటీ మీద ఉన్న భయం వల్ల అలా మాట్లాడుతోంది. కొడుకు గెలిస్తే చూడాలని మీ అమ్మకూ ఉంది కానీ.. నువ్వు ఓడిపోతావన్న బాధ కంటే ఆ ఓటమి వల్ల నువ్వు ఎంత కుమిలిపోతావేమోనన్న భయం మీ అమ్మను వెంటాడుతోంది అంటాడు గోవింద రాజు.

రేపు నువ్వు గెలిస్తే నా కొడుకు గెలిచాడు అని ఊరంతా చెప్పుకుంటుంది. అందుకని.. మీరు ఇంకేమీ ఆలోచించకుండా ధైర్యంగా వెళ్లి రండి అంటాడు గోవింద రాజు. దీంతో జానకి వద్దు మామయ్య గారు అంటుంది. అన్నింటికి మించి అత్తయ్య గారికి చెప్పకుండా వెళ్తే అది మోసం చేసినట్టు అవుతుంది.. అంటుంది జానకి.

అత్తయ్య గారిని మోసం చేసి బాధపెట్టదల్చుకోలేదు అంటుంది జానకి. దీంతో నా కొడుకును ఇంకోసారి ఎవరైనా వంటవాడు అని అంటే తట్టుకునే శక్తి నాకు లేదు అంటాడు. ఆనాడు నా ఆరోగ్యం బాగా ఉండి ఉంటే.. నా కొడుకును బ్రహ్మాండంగా చదివించి ఉండేవాడిని.. గొప్ప స్థాయిలో ఉండేవాడు.

Janaki Kalaganaled 25 May Today Episode : రామా, జానకిని హైదరాబాద్ వెళ్లడానికి ఒప్పించిన గోవింద రాజు

ఈరోజు అందరిలో చదువులేని వాడు.. అని అవమానపడుతున్నాడంటే అది నావల్లే కదా అంటాడు గోవింద రాజు. నా కొడుకును అందరూ అవమానిస్తుంటే నా గుండె ఎంత బద్ధలయ్యేదో అది నాకే తెలుసు. అమ్మ జానకి.. ఈ బాధ సంతోషంగా ఉండాలంటే.. నా బిడ్డ ఆ పోటీలలో గెలవాలమ్మా అంటాడు గోవిందరాజు.

నా కొడుకు వంట వాడు కాదు.. విజేత అని అందరూ అంటుంటే నేను చూడాలి. నేను ఉప్పొంగాలి. అది జరగాలంటే మీరు పోటీలకు వెళ్లి తీరాలమ్మా అంటాడు. దీంతో అది కాదు మామయ్య గారు. ఆయనకు అక్కడ ఏదైనా అవమానం జరుగుతుందేమోనని అత్తయ్య గారు టెన్షన్ పడుతున్నారు అంటుంది జానకి.

దీంతో పిచ్చి తల్లి ఈ జానకి ఉండగా.. వాడికి ఏమౌతుంది. నీ భర్తను తీసుకెళ్లి నువ్వు గెలిపించుకొని తీసుకొనిరా అని అంటాడు గోవిందరాజు. దీంతో వద్దు మామయ్య గారు.. మేము అక్కడికి వెళ్లినా కూడా అత్తయ్య గారికి చెప్పకుండా వచ్చాం అని బాధపడాల్సి వస్తుంది అంటుంది.

మీకు ఒక మాట చెబుతా వినండి. మన దూరపు బంధువుల పెళ్లి ఉంది. పెళ్లికి వైజాగ్ బదులు.. హైదరాబాద్ వెళ్లి పోటీల్లో పాల్గొని రండి. గెలిస్తే అమ్మకు చెప్పండి. లేకపోతే.. పెళ్లికి వెళ్లామని చెప్పండి అని గోవిందరాజు చెబుతుండగా.. మల్లిక ఈ మాటలను వింటుంది.

తనకు కోపం వస్తుంది. పెద్ద కోడలును వైజాగ్ పంపిస్తున్నాడా అని అనుకుంటుంది మల్లిక. వెంటనే నీలావతికి ఫోన్ చేస్తుంది మల్లిక. రేపు ఉదయం 10 గంటలకు 10 వేల పట్టు చీర కొనిస్తా అంటుంది మల్లిక. మరి అయితే ఇప్పుడే రానా అంటుంది నీలావతి.

రేపు నా తోడికోడలు జానకి, మా బావ గారు పెళ్లికి వెళ్తున్నారు. వాళ్లు ఆ పెళ్లికి వెళ్లకూడదు. మేము వెళ్లాలి. అలా మేము వెళ్లాలంటే.. వాళ్లను ఆపాలి. ఎవరినైనా స్వీట్ల ఆర్డర్ పేరుతో పంపించు. దీంతో వాళ్లు పెళ్లికి వెళ్లడం క్యాన్సిల్ అవుతుంది అంటుంది.

మరి స్వీట్లు అంటే అంతో ఇంతో అడ్వాన్స్ ఇవ్వాలి కదా అంటుంది నీలావతి. దీంతో అవన్నీ నేను చూసుకుంటా కదా.. నువ్వు ఉదయానే ఎవరినైనా పంపించు అంటుంది మల్లిక. కట్ చేస్తే ఉదయం అవుతుంది. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు.

హైదరాబాద్ పోటీకి వెళ్లడానికి రాముడిని, జానకిని ఒప్పించాను కానీ.. వీళ్లను పెళ్లికి వైజాగ్ పంపించాలని జ్ఞానాంబను ఎలా ఒప్పించో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ టిఫిన్ తినకుండా ఆలోచిస్తుంటాడు గోవింద రాజు. దీంతో జ్ఞానాంబ ఏమైంది అని అడుగుతుంది.

మల్లిక వెంటనే అందుకొని వైజాగ్ పెళ్లి గురించేమో అని అంటుంది. అదే జ్ఞానం.. వైజాగ్ నరసరాజు వాళ్లు మొన్న వచ్చి శుభలేఖ ఇచ్చి వెళ్లారు కదా అంటాడు. దీంతో దాంట్లో ఏముంది.. మీరు, నేను కలిసి పెళ్లికి వెళ్లొద్దాం అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో మాట మార్చి.. మన రామా, జానకి పెళ్లికి రాలేదు కదా.. ఇప్పుడు మనం వాళ్ల ఇంట్లో పెళ్లికి ఎందుకు వెళ్లడం అంటాడు గోవింద రాజు. కాకపోతే వాళ్ల పెద్ద కొడుకు, పెద్ద కోడలు వచ్చారు కదా పెళ్లికి అంటాడు విష్ణు. దీంతో మన పెద్ద కోడలు, పెద్ద కొడుకును పంపిద్దాం అంటాడు గోవిందరాజు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

4 hours ago

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊత‌మిచ్చిన వీడియో

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…

5 hours ago

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…

6 hours ago

Chamala Kiran Kumar Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…

7 hours ago

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

8 hours ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

9 hours ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

10 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

11 hours ago