Home » Entertainment » Janaki Kalaganaledu 27 September 2022 Full Episode
Entertainment

Janaki Kalaganaledu 27 Sep Today Episode : జెస్సీ అఖిల్ భార్య అని తెలిసి ముత్తయిదువులు షాక్.. ఇంతలో జెస్సీకి షాకిచ్చిన జ్ఞానాంబ

Authored By
Varun G
The Telugu News | Updated on: September 27, 2022 9:36 am
Advertisement

Janaki Kalaganaledu 27 Sep Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 27 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 397 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జెస్సీకి ఉండ్రాల్ల తద్ది గురించి వివరిస్తుంది జానకి. అలాగే ఆంటీ కాదు.. అత్తయ్య గారు అని పిలువు అని జెస్సీకి చెబుతుంది. కోడలుగా ఎలా ఉండాలి.. ఎలా ప్రవర్తించాలి.. వ్రతంలో ఎలా ఉండాలి. అందరి చూపు నీ వైపు ఉంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా అక్కడ వ్యవహరించాలి. లేకపోతే అత్తయ్య గారికి సమస్య వస్తుంది అంటుంది జానకి. దీంతో సరే అక్క అంటుంది. ఇవన్నీ విన్న మల్లిక ఎలాగైనా రేపు జెస్సీని అత్తయ్య తిట్టేలా చేయాలని అనుకుంటుంది మల్లిక. కట్ చేస్తే తెల్లవారుతుంది. వ్రతం కోసం పిండి పదార్ధాలు తయారు చేస్తూ ఉంటుంది జానకి. ఇంతలో అక్కడికి వచ్చిన జెస్సీ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దీంతో వ్రతం కోసం తయారు చేస్తున్నా అంటుంది. నేను చేస్తా అంటే సరే.. దీన్ని మిక్స్ చేస్తూ ఉండు అని చెప్పి జానకి అక్కడి నుంచి వెళ్తుంది.

Advertisement

janaki kalaganaledu 27 september 2022 full episode

జెస్సీ ఉండ్రాళ్లు తయారు చేస్తుండగా అక్కడికి వచ్చిన మల్లిక ఏం చేస్తున్నావు జెస్సీ అని అడుగుతుంది. దీంతో ఉండ్రాళ్లు చేస్తున్నా అక్క అంటుంది. ఉండ్రాళ్ల పిండిలో ఉప్పు కలుపుదామని అనుకుంటుంది. ఇంతలో ఉప్పు డబ్బాను అక్కడ నుంచి పక్కన పెట్టబోతుంది జానకి. ఇంతలో జ్ఞానాంబ అక్కడికి రాబోతుండగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది మల్లిక. ఇంతలో పిండి బదులు ఉప్పు వేయబోతుంది జెస్సీ. దీంతో జ్ఞానాంబ చూసి జానకిని పిలుస్తుంది. అది అమ్మవారికి వండే నైవేద్యం. నేను చూశాను కాబట్టి సరిపోయంది అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జెస్సీ కోసం ఒక చీర తీసుకొచ్చి ఇది కట్టుకో అంటుంది జానకి.

Advertisement

మరోవైపు జెస్సీ, జానకిని ఎలా జ్ఞానాంబతో తిట్టించాలా అని అనుకుంటుంది మల్లిక. ఇంతలో జానకి, జెస్సీ ఇద్దరూ రెడీ అయి వస్తారు. జెస్సీని బాగా రెడీ చేసి తీసుకొస్తుంది జానకి. ఇంతలో ముత్తయిదువులు వస్తారు.

Janaki Kalaganaledu 27 Sep Today Episode : జెస్సీని చూసి ఎవరని అడిగిన ముత్తయిదువులు

ఎవరీ అమ్మాయి పద్ధతికి చీర కట్టినట్టు లక్షణంగా ఉంది అని అడుగుతారు ముత్తయిదువులు. ఎప్పుడూ చూడలేనేలేదు. సాంప్రదాయానికి మనిషి రూపంలో నిలువెత్తులా ఉంది అంటారు. ఇంతలో మల్లిక వచ్చి ఎవరో చెప్పడానికి మా అత్తయ్య గారికి నోరు రావడం లేదు అంటుంది మల్లిక.

Advertisement

ఇంతలో మా అఖిల్ భార్య అని చెబుతుంది మల్లిక. ఒక మాట అయినా చెప్పకుండా గుట్టుచప్పుడు కాకుండా మూడో కొడుకు పెళ్లి చేశారు ఏంటి అని అడుగుతారు. తన పేరు జెస్సీ అని చెప్పేసరికి అందరూ తమలో తాము మాట్లాడుకుంటారు.

మరోవైపు నీలావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మల్లిక. ఇంతలో తను వస్తుంది. మనం జానకి బాధ్యతను తగలపెట్టాలి అంటుంది మల్లిక. లక్కను ముత్తయిదువులకు వాయినం ఇచ్చే జాకెట్ల దగ్గర పూస్తే వెంటనే అవి తగలబడిపోతాయి అంటుంది నీలావతి.

పూజ స్టార్ట్ అవుతుంది. జెస్సీ కూడా పూజలో కూర్చొంటుంది. పంతులు పూజ చేస్తాడు. ఆ లక్కను ముత్తయిదువులకు వాయినం ఇచ్చే జాకెట్లకు ఎవరూ చూడకుండా పూస్తుంది మల్లిక. ఆ తర్వాత వాటిని దీపం దగ్గర పెడతారు. పూజ జరుగుతుండగానే అవి అంటుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి