Janaki Kalaganaledu 31 Dec Today Episode : పరీక్షలో టాప్ ర్యాంక్ తెచ్చుకున్న జానకి.. మల్లిక, జానకి మధ్య గొడవను పరిష్కరించబోయిన జ్ఞానాంబకు షాక్

Janaki Kalaganaledu 31 Dec Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 205 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొన్న రాసిన పరీక్షలో నువ్వు సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నావని అభి చెబుతాడు. దీంతో జానకి ఉబ్బితబ్బిబ్బవుతుంది. రామా గారు.. ఇదంతా మీవల్లే అని రామాను పొడిగేస్తుంది. నాదేముందండి అంటాడు రామా. మీ సపోర్ట్ వల్లే నేను ఇదంతా సాధించగలుగుతున్నాను అంటుంది జానకి. రేపు నాకు కోచింగ్ ఫీజు కూడా తగ్గుతుంది అని చెప్పి సంతోషపడుతుంది జానకి. అభి గారు ఏం అనుకోకుండా ఒకసారి పెద్దమనసు చేసుకొని అటు తిరుగుతారా అంటే.. సరే అని వెనక్కి తిరుగుతాడు. దీంతో జానకిని ఎత్తుకొని తిప్పుతాడు. తర్వాత బుగ్గ మీద కిస్ పెడతారు రామా. దీంతో జానకి సిగ్గుపడిపోతుంది.

janaki kalaganaledu 31 december 2021 full episode

రేపు మన అకాడెమీలో జరిగే ఇన్సిపిరేషన్ మీటింగ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వాళ్లకు పోలీస్ క్యాప్ ప్రజెంట్ చేస్తారట.. అనగానే జానకి ఫుల్ ఖుషీ అవుతుంది. మరోసారి తిరగండి అభి గారు అంటాడు రామా. తర్వాత జానకి బుగ్గ మీద మరో ముద్దు పెడతాడు రామా. తెగ సిగ్గు పడిపోతాడు. ఆ తర్వాత అభి వెళ్లిపోతాడు. రామా మాత్రం అస్సలు ఆగడు. ముద్దు ఇవ్వు అంటూ అడుగుతాడు. కానీ.. జానకి అస్సలు ఇవ్వదు. ఒక్క ముద్దు ఇవ్వు ప్లీజ్ అంటాడు. చివరకు ఒక్క ముద్దు ఇస్తుంది జానకి. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాత్రి అవుతుంది. గోవింద రాజు, జ్ఞానాంబ భోం చేస్తుంటారు. జానకి వడ్డిస్తూ ఉంటుంది. జానకి.. ఆగమ్మా నువ్వు వెళ్లి మల్లికను పిలుచుకురా. తను వడ్డిస్తుంది అంటుంది జ్ఞానాంబ. దీంతో ఏమైంది అత్తయ్య గారు అంటుంది.

నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. తనతో మాట్లాడే పని ఉంది వెళ్లు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అత్తయ్య గారు అంటుంది జానకి. అది కాదు జ్ఞానం. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పోదు అని ఆ మల్లిక వింటుందా అంటాడు గోవింద రాజు. కానీ.. మల్లికను అలాగే వదిలేయలేం కదా అంటుంది జ్ఞానాంబ.

ఇంతలో మల్లిక వస్తుంది. అన్నం వడ్డించు అంటుంది జ్ఞానాంబ. అదేంటి.. మీ ముద్దుల కోడలు జానకి రోజూ వడ్డిస్తుంది కదా.. అంటుంది మల్లిక. ఏం నువ్వు వడ్డించవా అంటుంది. సరే అత్తయ్య వడ్డిస్తాను అని చెప్పి తనకు వడ్డిస్తుంది. ఇక.. మల్లిక చేసే హడివుడి మామూలుగా ఉండదు.

మల్లిక.. జానకి అంటే నీకు ఎందుకే అంత కోపం అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏంటి అత్తయ్య గారు అన్ని మాటలు. జానకి నాకు తోటి కోడలు అయినా కూడా తోబుట్టువు లాంటిది అంటుంది మల్లిక. మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉంటే చెప్పు. పెద్ద వాళ్లుగా మేము పరిష్కరిస్తాం అంటుంది జ్ఞానాంబ.

Janaki Kalaganaledu 31 Dec Today Episode : మల్లికకు శిక్ష విధించిన గోవింద రాజు

నాకు జానకి మీద ఎందుకు కోపం ఉంటుంది. తను ఉత్తమురాలు.. హరిశ్చంద్రకు వారసురాలు. అబద్ధం అనే ఒక మాట కూడా తెలుగులో ఉందని అసలు జానకికి తెలియదు అండి. జానకి వాళ్ల అన్నయ్య యోగి అయితే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి. అందుకే ఏది దాచకుండా చెల్లెలు పెళ్లి చేశాడు.. అంటుంది మల్లిక.

ఇంతలో రామా వచ్చి మల్లిక మీద సీరియస్ అవుతాడు. నువ్వు చేసిన విషయాలు చెప్పమంటావా? నువ్వు చేసి మోసం గురించి తెలిస్తే.. అని అని ఆగిపోతాడు రామా. వద్దు అని వారిస్తుంది జానకి. కొంపదీసి నేను వాంతుల మందు కలిపింది చెప్పేస్తారా ఏంటి అని భయపడుతుంది మల్లిక.

రామా.. ఏం చేసింది తను అంటుంది జ్ఞానాంబ. ఏం లేదు అమ్మ అంటాడు. నిజంగా ఏం లేదు అన్నా కూడా జ్ఞానాంబ, గోవింద రాజు వినరు. చెప్పండి.. ఏం చేసింది మల్లిక అంటారు. నేను చెబుతాను అంటాడు విష్ణు. అమ్మ చీర ఉతకనని పక్కన పెట్టింది అని చెబుతాడు విష్ణు.

దీనికి నేను మల్లికకు శిక్ష వేస్తాను అంటాడు గోవింద రాజు. రెచ్చిపోతాడు. తనకు శిక్ష విధిస్తాడు. ఆ తర్వాత మల్లిక.. విష్ణును పిలిచి ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటుంది. లేకపోతే ఆ నిజాన్ని మా అన్నయ్య చెప్పేవాడు. దీంతో నువ్వు ఇంటికి చెక్కేయాల్సి వచ్చేది అని అంటాడు విష్ణు.

రోజూ వాళ్ల బట్టలు ఉతకాలని గోవింద రాజు చెప్పడంతో ఎవరు వాళ్ల బట్టలు ఉతకాలి అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు రామా, జానకి.. అందరూ తమలో తామే నవ్వుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Share

Recent Posts

PM Modi : నిద్ర‌లేని రాత్రి గ‌డిపిన ప్ర‌ధాని మోది.. ఆప‌రేష‌న్‌కి తాను వ‌స్తాన‌ని అన్నాడా..!

PM Modi : ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత ప్ర‌తి ఒక్క భార‌తీయుడి ర‌క్తం మ‌రిగింది. పాకిస్తాన్‌ పై ప్రతీకారం తీర్చుకోవాల‌ని…

47 minutes ago

Allu Arjun : విల‌న్ గెట‌ప్‌లో అల్లు అర్జున్.. నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ ప‌క్కా!

allu arjun plays dual role in atlee film Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…

2 hours ago

Good News : ఉపాధి కూలీల‌కి ఇది పెద్ద శుభవార్త‌.. పెండింగ్ వేతనాలు ప‌డిపోయాయ్

Good News  : ఉపాధి హామీ కూలీలు ఉదయం లేచి ఎండ అన‌క‌, వాన‌క అన‌క క‌ష్ట‌పడుతుంటారు. వారికి ఏ…

3 hours ago

Samantha : కష్టాలను దగ్గర ఉండి చూసా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్‌గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా…

4 hours ago

Renu Desai : రేణూ దేశాయ్ కు అది అస్సలు నచ్చదట..!

Renu Desai doesn't like it at all Renu Desai  : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…

5 hours ago

Pakistani Terror Camps : భారత్‌ ధ్వంసం చేసిన పాక్ ఉగ్రస్థావరాలు ఇవే..!

Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…

6 hours ago

Donald Trump : ఆప‌రేష‌న్ సిందూర్‌పై ట్రంప్ కీల‌క వ్యాఖ్య‌లు.. వీలైనంత త్వ‌ర‌గా ముగింపు ప‌ల‌కాలి

Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భార‌త India  సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…

7 hours ago

Today Gold Price : ఏం కొంటాం.. మళ్లీ లక్ష కు చేరుకున్న బంగారం…!

Today Gold Price : మే 7వ తేదీ బుధవారం బంగారం ధరలు Gold Rates భారీగా పెరిగాయి. 24…

8 hours ago