janaki kalaganaledu 31 march 2022 full episode
Janaki Kalaganaledu 31 March Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 269 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాత్రి పూట.. జానకి, రామా ఇద్దరూ కిందనే పడుకుంటారు. ఉదయం లేవగానే.. జానకి బయట కట్టెలపొయ్యి మీద వంట వండుతూ ఉంటుంది. అప్పుడే తన ఫ్రెండ్ జానకి వస్తుంది. జానకిని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా అంటుంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి అంటుంది. గుడిసె లాంటి ఈ ఇల్లు ఏంటి.. ఆ పొయ్యి ఏంటి.. అసలు నీకు ఈ అవస్థలు ఏంటి అంటుంది శ్రావణి.
janaki kalaganaledu 31 march 2022 full episode
కానీ.. జానకి ఏం చెప్పదు. ఏం జరిగిందో నేను ఊహించగలను. మీ అత్తయ్య ఎంతటి మూర్ఖురాలో నేను ఊహించగలను అంటుంది శ్రావణి. ప్రతి చిన్న విషయానికి ఆవిడ నిన్ను అంతలా వెనకేసుకొస్తుంటే నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావేంటి అంటుంది శ్రావణి. మంచి పొజిషన్ లో ఉండాల్సిన నీకు ఈ కర్మేంటి అంటుంది. అందుకే.. నా మాట విని విడాకులు ఇచ్చేయ్ అంటుంది శ్రావణి. దీంతో పిచ్చా నీకేమైనా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు. కుటుంబం అన్నాక గొడవలు రాకుండా ఉంటాయా అని అంటుంది జానకి.
ఆ తర్వాత శ్రావణి.. యోగికి ఫోన్ చేసి.. జానకి పడే అవస్థల గురించి చెబుతుంది. మా చెల్లెలును ఇంత నరకం పెడుతోందా. నా చెల్లెలు పడిన నరకానికి వందరెట్లు ఆ జ్ఞానాంబ పడేలా చేస్తాను అని చెబుతాడు యోగి. దీంతో సరే అని ఫోన్ పెట్టేస్తుంది శ్రావణి.
మరోవైపు నీలావతి.. స్వీటు కొట్టుకు వచ్చి జ్ఞానాంబను రెచ్చగొడుతుంది. ఆ రాముడైనా తండ్రి మాట జవదాటుతాడేమో కానీ.. నా పెద్ద కొడుకు రామా అస్సలు నా మాట జవ దాటడు అని చెప్పావు కానీ.. భార్య మాటలు విని.. తల్లి కళ్లకు గంతలు కట్టాడు అంటుంది నీలావతి.
అప్పుడే జానకి.. రామాకు బాక్స్ తీసుకెళ్తూ ఉంటుంది. అక్కడ ఆగేసరికి.. నీలావతి జానకిని చూస్తుంది. ఇదిగో జానకి. నిన్నే ఇలారా అంటుంది. మీ అత్తను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించావని ఊళ్లో అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు అంటుంది నీలావతి.
బాగా చదువుకున్న తెలివితేటలు ఉన్న నీ కోడలు కదా. వాళ్ల ఆస్తి వాళ్లకు ఇవ్వమని నీ కొడుకుతో అడిగించకుండా ఉంటుందా అని జ్ఞానాంబతో అంటుంది నీలావతి. మంచికి పోతే చెడు ఎదురు వచ్చిందని నాకెందుకు వచ్చిన గొడవ అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది నీలావతి.
మరోవైపు జ్ఞానాంబ కోసం ఎదురు చూస్తుంటుంది మల్లిక. జ్ఞానాంబ రాగానే జానకి ఫ్రెండ్ శ్రావణి ఇక్కడికి వచ్చిందని చెబుతుంది. జానకి ఆ పిల్లతో ఏమని చెప్పిందో తెలుసా అత్తయ్య. మూర్ఖపు అత్తతో వేగలేకపోతున్నాను.. అమాయకపు భర్తతో ఉండలేకపోతున్నాను. అందుకే విడాకులు ఇచ్చేస్తా అని చెప్పింది అంటుంది మల్లిక.
అన్యాయంగా నువ్వు జానకి మీద ఎందుకు నిందలు వేస్తున్నావు అంటాడు గోవిందరాజు. ఇఫ్పుడే జానకిని అడుగుతా ఆగు అంటాడు గోవిందరాజు. దీంతో అక్కర్లేదు. జానకి నిజంగానే మన రామాకు విడాకులు ఇస్తా అని ఉంటుంది. నేను ఊహించగలను అంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.