Janaki Kalaganaledu 31 May Today Episode : మల్లిక ప్లాన్ రివర్స్.. రామా, జానకి హైదరాబాద్ ప్రయాణానికి లైన్ క్లియర్.. ఇంతలో షాకిచ్చిన జ్ఞానాంబ

Janaki Kalaganaledu 31 May Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 312 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జ్ఞానాంబకు రామా, జానకి వైజాగ్ పెళ్లికి కాదు.. వెళ్లేది హైదరాబాద్ అని చెబుతుంది మల్లిక. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. మీరు నామాటలు నమ్మకపోతే వెళ్లి బస్ టికెట్లు చూపించమని చెప్పండి. అసలు ఈ గూడుపుఠాణీ వెనుక ఉన్నది ఎవరో కాదు.. మామయ్య గారే అంటుంది మల్లిక. దీంతో జ్ఞానాంబకు డౌట్ వస్తుంది. ఖచ్చితంగా హైదరాబాద్ కు వంటల పోటీలకు తీసుకెళ్తుందా రామాను అని అనుమానిస్తుంది జ్ఞానాంబ. దీంతో వెంటనే వెన్నెలను పిలుస్తుంది. ఇలా రా అంటుంది. నాతో రా అని తనను తీసుకెళ్తుంది జ్ఞానాంబ. అప్పుడే రామా, జానకి ఇంట్లోకి రాబోతూ జానకి గారు ఈ టికెట్ చూసి బస్సు ఎన్నిగంటలకో చూడండి అంటాడు రామా.

janaki kalaganaledu 31 may 2022 full episode

వాళ్లను చూసిన జ్ఞానాంబ.. రామా అని పిలుస్తుంది. బస్సుకు టైమ్ అవుతుంటే బయలుదేరకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది జ్ఞానాంబ. దీంతో రెడీ అవుతున్నాం అమ్మ అంటాడు రామా. మీ నాన్న గారు బస్సు టికెట్లు తీసుకొచ్చి ఇచ్చారా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో నాన్న టికెట్స్ తెచ్చి ఇచ్చారు అంటాడు రామా. ఒకసారి టికెట్లు ఇలా ఇవ్వు అంటుంది జ్ఞానాంబ. దీంతో రామా షాక్ అవుతాడు. జానకికి ఏం చేయాలో అర్థం కాదు. తాము హైదరాబాద్ వెళ్లే విషయం ఎక్కడ తెలిసిపోతుందోనని టెన్షన్ పడతాడు రామా. ఏమైంది అమ్మ అంటాడు. దీంతో ఏం లేద నాన్న.. బస్సు విశాఖపట్టణం ఎప్పుడు వెళ్తుంది.. అనే వివరాలు తెలుసుకోవడం కోసం అడిగాను అంటుంది.

వెన్నెలను పిలిచి.. ఆ టికెట్ చూసి.. అందులో ఉన్న వివరాలన్నీ నాకు చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో అలాగే అమ్మ అంటుంది వెన్నెల. ఆ టికెట్ ను తీసుకొని ఓపెన్ చేస్తుంది వెన్నెల. చదివి చెప్పు అంటుంది జ్ఞానాంబ. దీంతో సరే అమ్మ అంటుంది వెన్నెల.

బస్సు మన ఊరిలో 7 గంటలకు బయలు దేరుతుంది అని చెబుతుంది వెన్నెల. ఆత్రేయపురంలో 7 గంటలకు బయలుదేరి.. 12 గంటలకు వైజాగ్ వెళ్తుందమ్మా అంటుంది వెన్నెల. దీంతో మల్లిక షాక్ అవుతుంది. ఏంటి.. ఏమన్నావు అంటుంది మల్లిక.

ఆత్రేయపురం టు వైజాగ్.. అంటుంది వెన్నెల. నాలాగా నీకు కూడా ఇంగ్లీష్ రాదా.. సరిగ్గా చూడు.. హైదరాబాద్ అని ఉంటుంది అంటుంది మల్లిక. దీంతో నీకు ఏబీసీడీలు వచ్చు కదా.. చూడు ఇక్కడ వైజాగ్ అని రాసి ఉంది అని అంటుంది వెన్నెల.

Janaki Kalaganaledu 31 May Today Episode : హైదరాబాద్ తో పాటు వైజాగ్ టికెట్ కూడా తీసిన గోవిందరాజు

దీంతో జ్ఞానాంబకు తీవ్రంగా కోపం వస్తుంది. వంటగదిలో ఇంకా పని ఉంది పదా అని మల్లికను తీసుకెళ్తుంది జ్ఞానాంబ. మల్లిక బుద్ధి తెలిసి కావాలనే గోవిందరాజు వైజాగ్ టికెట్ ను రామాకు ఇస్తాడు. ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటున్నావా.. అర్థం అయ్యేలా చెబుతాను కదా కంగారు ఎందుకు అంటాడు గోవిందరాజు.

జానకి గారు.. హైదరాబాద్ టికెట్ బుక్ చేశారనుకుంటే వైజాగ్ బుక్ చేశారు ఏంటి అని అంటాడు. ఇంతలోనే గోవిందరాజు వచ్చి.. వైజాగ్ టికెట్ కూడా బుక్ చేశాను. ఇది హైదరాబాద్ టికెట్ తీసుకోండి. వైజాగ్ టికెట్ అవసరం ఉంటే మల్లిక దగ్గర వాడుకోవచ్చు అంటాడు గోవిందరాజు.

మరోవైపు సీరియల్ చూస్తూ ఉంటుంది మల్లిక. అత్త.. నా రత్తమ్మత్త.. పద్ధతులు పచ్చిమిరపకాయ అంటూ ఈ కోడలును వేపుకు తింటావా.. అందుకే నువ్వు రోజు వేసుకునే ట్యాబ్లెట్స్ బదులు వేరే ట్యాబ్లెట్స్ తీసుకొస్తున్నాను. ఇవి నీ గొంతులోకి దిగగానే.. నువ్వు మంచానికి పరిమితం అవ్వడమే అని సీరియల్ లో కోడలు అనుకుంటుంది.

ఈ ప్లాన్ ఏదో బాగుంది అని అనుకుంటుంది మల్లిక. దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుంది మల్లిక. మరోవైపు జానకి ఏదో దులుపుతూ కింద పడబోతుంటే రామా పట్టుకుంటాడు. అంత ఎత్తుకెక్కి.. ఎందుకంత అపురూపంగా తూడుస్తున్నారు అని అడుగుతాడు రామా.

దీంతో మీకోసమే అంటుంది జానకి. అంటే కొంపదీసి నన్ను అక్కడ కూర్చోబెడతారా ఏంటి అంటుంది. కాదండి.. మీరు గెలిచాక మీకు వచ్చే షీల్డ్ ను అక్కడ పెడతాను.. అర్థం అయిందా రామా గారు అంటుంది జానకి. ఆ పోటీల్లో బాగా చదువుకున్నవాళ్లు పాల్గొంటారు కదా. నేను తప్పకుండా గెలుస్తానని మీకు ఏంటి అంత నమ్మకం అంటాడు రామా.

నేను ఖచ్చితంగా ఐపీఎస్ సాధిస్తానని మీకు ఎలా నమ్మకం అని అడుగుతుంది జానకి. దీంతో మీకు ఐపీఎస్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం కదా అంటాడు. నాకు కూడా మీరు పోటీల్లో గెలుస్తారని నమ్మకం అంటుంది జానకి. మరోవైపు ట్యాబెట్లను మార్చి.. జ్ఞానాంబను కొన్ని రోజుల పాటు మంచానికి పరిమితం చేయాలని అనుకొని తన రూమ్ లోకి వెళ్తుంది మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Jyotishyam : శుక్రుడు ఆరుద్ర నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు… ఇక ఈ రాశులకి లక్ష్మి కటాక్షం…?

Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…

55 minutes ago

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

9 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

10 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

11 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

13 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

14 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

15 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

15 hours ago