Janaki Kalaganaledu 4 Oct Monday Episode : కార్తీక దీపం సీరియల్ శని, ఆదివారాల్లో ప్రసారం కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రసారం కాదు కాబట్టి.. సోమవారం, 4 అక్టోబర్ 2021 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
శుక్రవారం ఏం జరిగిందో అందరికీ తెలుసు. ట్యాబ్లెట్ల విషయంలో జానకి ఇంట్లో గొడవ జరిగింది. జానకి రూమ్ లో ట్యాబ్లెట్లు దొరకడంతో జ్ఞానాంబ తనను నిలదీస్తుంది. ఎందుకు పిల్లలు పుట్టకుండా.. ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు అని నిలదీస్తుంది. దీంతో జానకి.. ఆ ట్యాబ్లెట్ల గురించి తనకేమీ తెలియదని చెబుతుంది.
ట్యాబ్లెట్లు నేను వేసుకోలేదని చెబుతుంది. ఆ తర్వాత ఆ ట్యాబ్లెట్లు మల్లికే కొన్నదని తెలుసుకొని జ్ఞానాంబ.. మల్లికపై సీరియస్ అవుతుంది. ఎందుకిలా చేశావు అంటూ నిలదీస్తుంది మల్లికను.
దీంతో మల్లిక భయపడిపోతుంది. వామ్మో.. పోలేరమ్మ నన్ను ఏం చేస్తుందో అని తెగ భయపడుతుంది. వెంటనే వెళ్లి జ్ఞానాంబ కాళ్లు పట్టుకుంటుంది మల్లిక.
నువ్వు కాళ్లు పట్టుకున్నా.. ఏం పట్టుకున్నా.. నువ్వు చేసింది మోసం. నన్ను మోసం చేయడమే కాకుండా.. నువ్వు చేసిన తప్పును జానకి మీద నెట్టేస్తున్నావా? దీనికి నేను శిక్ష వేయడం కాదు.. జానకే వేస్తుంది అని జానకిని అడుగుతుంది జ్ఞానాంబ.
ఈ ఇంట్లో ఏది మంచో.. ఏది చెడో.. మీకే తెలుసు కాబట్టి మీరే ఈ విషయంలో చర్యలు తీసుకోండి.. అత్తయ్య అని జానకి.. జ్ఞానాంబకు చెబుతుంది.
దీంతో.. మల్లిక చేసిన తప్పిదానికి ఇంట్లో నుంచి మల్లిక, విష్ణు వెళ్లిపోవాలని ఆదేశిస్తుంది జ్ఞానాంబ. వేరే కాపురం పెట్టాలని మల్లికకు చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. విష్ణు అయితే.. ఏంటి అమ్మా.. అలా మాట్లాడుతున్నావు. నువ్వు లేకుంటే నేను ఎలా ఉంటాను.. అంటాడు. అయినా కూడా జ్ఞానాంబ తన మాట వినదు. నేను చెప్పిందే ఫైనల్.. నాకు అబద్ధం చెప్పి మోసం చేసినందుకు ఇదే మీకు శిక్ష.. ఇంట్లోంచి వెంటనే వెళ్లిపోండి.. అంటుంది జ్ఞానాంబ.
కట్ చేస్తే.. జానకి రాత్రి పూట రామా దగ్గరికి వెళ్తుంది. రామా అప్పటికే నిద్రపోతుంటాడు. అతడి దగ్గరికి వెళ్లి.. నేను ఐపీఎస్ కావడానికి కల మాత్రమే కన్నాను. ఆ కలను నిజం చేయడానికి మీరు నరకం అనుభవిస్తున్నారు. అత్తయ్య గారి ముందు నిజం దాస్తూ బతకడం ఇక నావల్ల కాదు.. అని అనుకున్న జానకి.. తన ఐపీఎస్ పుస్తకాలను అన్నింటినీ బయటకు తీసుకొచ్చి కాల్చేస్తుంది. జానకి ఆ పని చేయడం చూసి రామా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.