Janaki Kalaganaledu 6 June Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 316 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేషనల్ చెఫ్ కాంపిటిషన్ పోటీలు ప్రారంభం అవుతాయి. పోటీలను టీవీలో చూస్తుంటారు జ్ఞానాంబ, వాళ్ల ఫ్యామిలీ. ఒక్కొక్కరు తమ చదువు గురించి చెబుతుంటారు. ఇంతలో రామచంద్ర పేరు వస్తుంది. తన గురించి చెప్పమంటారు. దీంతో అందరికీ నమస్కారం అని చెప్పి.. మా ఊరు కోనసీమ అంటాడు రామచంద్ర. మాకు స్వీట్ షాపు ఉంది అంటాడు రామచంద్ర. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పండి అని ఇంగ్లీష్ లో అడుగుతాడు జడ్జి. దీంతో రామచంద్రకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ గురించి అడుగుతుంటే దిక్కులు చూస్తున్నాడేంటి అని అందరూ అనుకుంటారు. చూస్తే పల్లెటూరు వాడు అయిఉంటాడు అని అనుకుంటారు. మిమ్మల్ని అప్పటి నుంచి అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి.. సమాధానం చెప్పండి అని అడుగుతాడు. దీంతో ఆరో తరగతి సార్ అంటాడు రామచంద్ర.
దీంతో అందరూ నవ్వుతారు. చివరికి యాంకర్ కూడా నవ్వుతుంది. ఏంటి రామచంద్ర గారు ఆరో తరగతి వరకే చదువుకున్నారా అని అడుగుతాడు జడ్జి. ఇంతలో టీవీ ముందు నుంచి లేచి వెళ్లబోతుంది జ్ఞానాంబ. కొన్ని కారణాల వల్ల చదువు మానేయాల్సి వచ్చింది అంటాడు రామచంద్ర. మరోవైపు ఇంకా పోటీలు ప్రారంభం కాకముందే నా కొడుకు గురించి ఎగతాళి చేస్తున్నారు. మున్ముందు ఎలాంట పరిస్థితి చూడాల్సి వస్తుందోనని భయంగా ఉంది. అందుకే.. నేను వద్దు అన్నాను.. అంటుంది జ్ఞానాంబ. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. అర్జెంట్ గా మీరు బావ గారికి ఫోన్ చేసి వెంటనే వచ్చేయమని చెప్పండి అని సలహా ఇస్తుంది మల్లిక. హేయ్ మల్లిక.. మనం బట్టల షాపునకు వెళ్దాం పదా అని తనను అక్కడి నుంచి తీసుకెళ్తాడు విష్ణు.
మరోవైపు జ్ఞానాంబ కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇది జాతీయ స్థాయి చెఫ్ పోటీలు. ఇక్కడికి అందరూ హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ, పీజీలు చేసిన వాళ్లు వచ్చారు. వాళ్లందరూ వంటలో చాలా ఎక్స్ పర్ట్స్. మరి మీరు వాళ్లతో పోటీ పడగలరని ఏ నమ్మకంతో వచ్చారు అని అడుగుతాడు జడ్జి.
దీంతో మా అమ్మ అంటాడు రామా. మా అమ్మే నాకు వంటల్లో గురువు అంటాడు రామా. ఈలోకంలో అమ్మ కంటే గొప్ప వంటగత్తె మరెవరూ లేరు. వంటల్లో ఎన్ని డిగ్రీలు చదివినా సరే.. అమ్మ వంటకు ఎవరూ సాటి రారు. ఏదైనా వంట చేసినప్పుడు ఇందులో ఎంత ఉప్పు వేయాలి.. ఎంత కారం వేయాలి అని లెక్కలు చూసుకోని వేస్తుంటారు. కానీ.. మా అమ్మ మాత్రం ఎంత మందికి అయినా అందరికీ నచ్చేట్టు వంట చేయగలదు. అది సార్ అమ్మ చేతిలో ఉన్న మహత్యం అంటాడు రామా.
దీంతో అందరూ రామచంద్రకు చప్పట్లు కొడతారు. అలాంటి మా అమ్మ దగ్గర వంటలు నేర్చుకొని వచ్చాను. అందుకే.. పోటీ పడగలను అన్న నమ్మకంతో ఇంత దూరం వచ్చాను అంటాడు రామచంద్ర. దీంతో జడ్జి కూడా తనను మెచ్చుకుంటాడు.
ఇక.. పోటీలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి. మీ అందరికీ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకోండి అంటుంది యాంకర్. మరోవైపు జ్ఞానాంబ రామా గురించే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో రామా.. తన తల్లికి ఫోన్ చేస్తాడు.
కానీ.. తను రామా గురించే ఆలోచిస్తూ ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో గోవిందరాజు అక్కడికి వచ్చి.. ఫోన్ చూసి లిఫ్ట్ చేస్తాడు. ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వవా నాన్న అంటాడు. దీంతో మీ అమ్మ నిద్రపోతోంది అంటాడు గోవిందరాజు. అమ్మతో మాట్లాడాలని ఉంది నాన్న అంటాడు రామా.
దీంతో ఏం కాదు. రేపు ఉదయం నేను మీ అమ్మతో మాట్లాడిస్తాను. నువ్వేం బాధపడకు. నువ్వు మాత్రం కప్పు గెలిచి రావాలి. ఆ క్షణం కోసమే మేమంతా ఎదురు చూస్తుంటాం. ఉంటాం రా రాముడు. జాగ్రత్త అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు గోవిందరాజు.
మరోవైపు జ్ఞానాంబ ఫోటోను ఇచ్చి మీరేం టెన్షన్ పడకండి అని చెబుతుంది జానకి. పోటీలు ప్రారంభం అవుతాయి. కంగారుగా ఉంది అంటాడు రామా. దీంతో జానకి రామాను మోటివేట్ చేస్తుంది. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ కాంపిటిషన్ లో గెలుస్తారు అని చెబుతుంది జానకి.
ఇక.. ఈ కాంపిటిషన్ గురించి కొన్ని నియమాలు చెబుతుంది యాంకర్. ఈ కాంపిటిషన్ లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఇస్తాం. ఆ డబ్బుల్లోనే మీరు చేయబోయే వంటలకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంటుంది అంటుంది యాంకర్.
30 మెంబర్స్ లో ఈ రౌండ్ లో 10 మంది మాత్రమే చెఫ్ కాంపిటిషన్ కు అర్హులు అని చెబుతుంది. ఆ విజేతలు ఎవరో జడ్జిలు నిర్ణయిస్తారు. ఆ 10 మందిలో విన్నర్ ఎవరు అనేది కూడా జడ్జిలే నిర్ణయిస్తారు. మీకు ఆ అమౌంట్ ను లూసీ ఇస్తుంది.. అని చెబుతుంది యాంకర్.
తర్వాత జానకి వచ్చి రామా గారు ఆల్ ది బెస్ట్ వెళ్లండి అంతా మంచే జరుగుతుంది అంటుంది. కట్ చేస్తే షాపింగ్ మాల్ ముందు ఓ వ్యక్తి నిలబడి.. మా అమ్మను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి సార్.. కొంచెం సాయం చేయండి అని అందరినీ అడుగుతుంటాడు కానీ.. ఎవ్వరూ సాయం చేయరు.
ఇంతలో రామా అక్కడికి వస్తాడు. రామాను కూడా డబ్బులు అడుగుతాడు. నేను అబద్ధం చెప్పడం లేదు సార్.. కావాలంటే మా అమ్మ ఆటోలో ఉంది చూడండి సార్ అంటాడు అతడు. దీంతో తన దగ్గర ఉన్న వెయ్యి రూపాయలలో రూ.500 ఇస్తాడు.
మిగితా రూ.500 తో షాపింగ్ చేద్దామనుకుంటాడు. ఏం చేయాలో తనకు అర్థం కాదు. ఏం తీసుకోవాలో అర్థం కాదు. సామాన్లు అన్నీ తీసుకుంటాడు. రూ.800 బిల్లు అవుతుంది. దీంతో ఏం చేయాలో రామాకు అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.