Janaki Kalaganaledu 1 September 2022 Full Episode
Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 376 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… జానకి అఖిల్ వాళ్ల గురించి ఆలోచిస్తూ.. ఇంట్లో పనులు ఒకటి చేయబోయి ఇంకొకటి చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ అదంతా చూసి జానకి నువ్వేం చేస్తున్నావ్ అని తనని అంటుంది. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావ్ పరీక్షలు గురించి ఆలోచిస్తున్నావా.. అలాగైతే నువ్వు చదువుకున్న తర్వాతే ఈ పనులన్నీ చేయి.. లేదా చికితకి చెప్పు అని అంటుంది. అప్పుడు జానకి అయ్యో అలా ఏం లేదు అత్తయ్య గారు నేను చేసేస్తాను.. తర్వాత చదువుకుంటాను అని చెప్తుంది. అంతలో రామ అక్కడికి వస్తాడు. ఏమైంది జానకి గారు అని అడుగుతాడు. అయ్యో ఏమి లేదండి అని రామా కి చెప్తుంది. ఇదంతా చూస్తున్న మల్లిక. జానకిని సూట్ పోటీ మాటలు అంటూ ఉంటుంది. జానకి అప్పుడే పోలీస్ అయినట్లు ఊహించుకుంటుంది. అత్తయ్య గారు అందుకే ఇంట్లో పనులు చేయలేక పోతుంది.
అని తనని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో గోవిందరాజు వచ్చి మల్లికను. అమ్మ పుల్లల మల్లికా నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా.. నిన్న విష్ణు కూడా చెప్పాడు కదా తనపై అనవసరంగా నిందలు వేయకు అని. అయినా సరే జానకి పై ఏదో ఒకటి నింద వెయ్యాలని చూస్తావు.. తనని అనరాని మాటలు అంటూ ఉంటావు.. అసలు నువ్వు ఏం మనిషివమ్మా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు మల్లికా అయ్యో మామయ్య గారు తనని ఎందుకు అలా అంటాను తను చేస్తున్న పద్ధతిని చూసి నేను చెప్తున్నాను.. అని డ్రామాలాడుతూ ఉంటుంది. అప్పుడు గోవిందరాజు ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటాడు. కట్ చేస్తే జానకి కాలేజీలో జెస్సి అన్నమాట గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసి అత్తయ్య గారిని ఒప్పించాలి. వీళ్ళ పెళ్లి ఎలా జరిపించాలి. అసలు అత్తయ్య ఎలా ఒప్పుకుంటుంది. జెస్సి కి నచ్చజెప్పిదామని చూస్తుంటే.. తనేమో మా పెళ్లి జరగకపోతే మాకు చావే దిక్కు..
Janaki Kalaganaledu Serial will Janaki help to Jessie marriage
నేను అఖిల్ లేకపోతే బ్రతకలేను అంటుంది. అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో రామ అక్కడికి వస్తాడు. మీరు చదువుకోకుండా ఏం ఆలోచిస్తున్నారు. అని అడుగుతాడు. అప్పుడు కొద్దిసేపు జానకి ఆలోచించి రామకి జరిగిందంతా చెప్తుంది. అప్పుడు రామ అయ్యో అలా ఎలా జరుగుతుంది. మనము ఇప్పుడే వెళ్లి అమ్మకి చెబుదాం.. అమ్మ ఏం చేస్తుందో చూద్దాం అని అంటాడు. అప్పుడు అయ్యో వద్దు..రామగారు అత్తయ్య గారు అస్సలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోరు. అసలే జెసికి అత్తయ్య గారికి గొడవ జరిగింది. ఆ జెసి అంటే అత్తయ్య గారు ముమ్మాటికి ఒప్పుకోరు. అయినా అఖిల్ మీద అత్తయ్య గారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
తనని బాగా చదివించి పై స్థాయికి పంపించాలని అనుకుంటున్నారు. తను ఇలా చేశాడు అంటే అత్తయ్య గారు అసలే తట్టుకోలేరు. అని అంటుంది. అప్పుడు రామ మరి ఏం చేద్దాం.. చెప్పండి జానకి గారు అని అంటాడు. అదే ఆలోచిస్తున్నాను అని అంటుంది జానకి. కట్ చేస్తే అఖిల్ జెసి కలిసి వాళ్ల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జెసి అఖిల్ ని నువ్వు లేకపోతే నేను బ్రతకను నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది. అప్పుడు అఖిల్ నువ్వు అలా మాట్లాడకు జెసి నువ్వు లేకపోతే నేను కూడా లేను. అయినా వదినకు చెప్పావు కదా.. తను తప్పకుండా మనకు సహాయం చేస్తుంది. నువ్వేం కంగారు పడకు అని అఖిల్ అంటాడు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే..
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
This website uses cookies.