Home » Entertainment » Janaki Tells Ram About Akhil Love
Entertainment

Janaki Kalaganaledu : అఖిల్ ప్రేమ విషయాన్ని రామకి చెప్పిన జానకి… జ్ఞానంబ తో మాట్లాడాలి అనుకుంటున్నా జెస్సి…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 4, 2022, 10:30 am
Advertisement

Janaki Kalaganaledu : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ జానకి కలగనలేదు. ఈ సీరియల్ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు రిలీజ్ కాదు. సోమవారం ఎపిసోడ్ 380 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మల్లిక విష్ణు ఎవరికీ తెలియకుండా వెళ్లి బంగారు గాజులు తీసుకొని వస్తారు. అప్పుడు జ్ఞానాంబ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుండగా ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. కట్ చేస్తే జానకి అఖిల్ వాళ్ల గురించి కంగారుపడుతూ ఉండగా… రామా చూసి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు జరిగిందంతా రామకు చెబుతుంది. అప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై రామ అఖిల్ దగ్గరికి కోపంగా వెళుతూ ఉంటాడు.

Advertisement

అప్పుడు జానకి తనని ఆపి ఏదో తెలియని వయసు అలా జరిగిపోయింది మీరు ఆవేశపడకండి దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటుంది. కట్ చేస్తే జెస్సి వాళ్ళ ఇంట్లో జెసిని నీ ప్రెగ్నెంట్ కి కారణం ఎవరని అడుగుతూ తిడుతూ ఉంటారు. కానీ జెస్సి చెప్పకుండా ఏదో ఒకటి సాకు చెప్పి బయటికి వచ్చి.. జ్ఞానంబ దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని అనుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు జానకి అటుగా వెళుతుండగా.. జెస్సిని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కొద్దిసేపు ఆలోచించి నేను అఖిల్ వాళ్ళ అమ్మ గారితో నేను మాట్లాడతాను అని చెబుతుంది. అప్పుడు ఇప్పుడే వద్దు జేసి నేను ఒక సమయం చెప్తాను. ఆ సమయంలో వచ్చి నువ్వు మాట్లాడదు గాని నేను కూడా నీకు తోడుగా ఉంటా..

Janaki tells Ram about Akhil love

Advertisement

నీకు అన్యాయం జరగనివ్వను, కావాలంటే నేను వచ్చి మీ అమ్మగారు వాళ్ళతోనే మాట్లాడతా.. నీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని తనని తిరిగి ఇంటికి పంపిస్తుంది. దాంతో జెసి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత రామ జానకి జెసి వాళ్ళ ఇంటికి వెళ్ళి.. అఖిల్ గురించి జ్ఞానాంబ గురించి అంత వివరంగా తెలియజేస్తారు. అప్పుడు అందరూ ఎలా అని కంగారు పడిపోతూ ఉంటారు. కట్ చేస్తే మల్లిక బంగారు గాజులు వేసుకొని చూసుకుంటూ మురిసిపోతూ డాన్సులు చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్ఞానంబా అటుగా వెళుతుండగా.. తనని చూసి ఈ పిల్లకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు కడుపుతో ఉండి ఎగుర్లు పెడుతుంది అని వెళ్లి.. హే మల్లిక అని గట్టిగా పిలుస్తుంది. అప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి మల్లికా భయపడిపోతుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి