Janhvi Kapoor : జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలోనా.. ఈ అమ్మడు రియాక్షన్ ఏంటి?
Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు సినిమాల కన్నా కూడా గ్లామర్, ఎఫైర్స్ వంటి విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది.జాన్వి కపూర్ తెలుగులో ఒక్క సినిమా చేయకపోయినా ఆమెకు విపరీతమైన అభిమానులు మాత్రం ఉన్నారు. ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్పటివరకు ఈ హీరోయిన్ తెలుగులో మాత్రం ఏ చిత్రం చేయలేదు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది. అయితే ఈ సినిమా విడుదల కన్నా ముందే ఈ హీరోయిన్ కి తెలుగు రాష్ట్రాలలో అభిమానులు మాత్రం చాలా మందే ఉన్నారు. ఇక జాన్వీ.. రామ్ చరణ్‌తోను ఓ సినిమా చేయనుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రూపొందుతుంది
అయితే జాన్వీ కపూర్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో కొన్నాళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే వారిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకొని.. ఆయన ఆశీర్వాదం తీసుకొంటారు. అయితే వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొంటారనే విషయం వార్త ఆసక్తిగా మారింది. జాన్వీ కపూర్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. తన తల్లి అమితంగా భక్తిని ప్రదర్శించే కలియుగ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపింది. బంగారు పూతతో ఉండే తన తల్లి చీరెను కట్టుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది.
Janhvi Kapoor : జాన్వీ కపూర్ పెళ్లి తిరుపతిలోనా.. ఈ అమ్మడు రియాక్షన్ ఏంటి?
అయితే జాన్వీ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేసింది. దీనిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. తన పెళ్లిపై వచ్చిన వార్తపై జాన్వీ సైటైర్లు వేశారు. నా పెళ్లి గురించి నాకే తొందర లేదు. వీళ్లు తమకు తోచినట్టు ఏదేదో రాస్తారు. వీళ్లకు ఎలాంటి వార్తలు రాయాలో.. వారికి ఎక్కడి నుంచి ఇలాంటి సమాచారం లభిస్తుందో తెలియదు అంటూ కామెంట్ చేసింది. ఆమె కామెంట్స్‌కు సోషల్ మీడియాలో మంచి రియాక్షన్ లభిస్తున్నది. ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు శ్రీదేవిని తలపించడంతో అందరూ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలలో జాన్వి అచ్చం శ్రీదేవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో ఎలా ఉందో అలానే కనిపిస్తుందని అంటున్నారు.
Indiramma Houses : ఈ రోజు ఘట్కేసర్ మున్సిపల్ లో ఇందిరమ్మ పథకం కింద వచ్చిన 5 లక్షల రూపాయలు…
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్ వ్యక్తితో సంబంధం…
This website uses cookies.