Home » Entertainment » Jayam Child Artist Yamini Swetha New Pics Viral
Entertainment

Yamini Swetha : జ‌యం సినిమాలో స‌దా చెల్లెలుగా న‌టించిన యామిని ఇప్పుడు ఎంత అందంగా ఉందో..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 14, 2022, 12:00 pm
Advertisement

Yamini Swetha : ఇటీవ‌లి కాలంలో చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోయిన్‌లుగా మారి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. వారిని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. 2002 వ సంవత్సరం జూన్ 14న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ‘చిత్రం మూవీస్’ బ్యానర్ పై దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని నిర్మించడం కూడా జరిగింది. ఇందులో పక్కింటి అమ్మాయిలా కనిపించే సదా లుక్స్, గోపీచంద్ విలనిజం, ఆర్పీ పట్నాయక్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ హైలెట్టే..! ఈ చిత్రం ఘన విజయం సాధించి బయ్యర్లు పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు లాభాలను అందించింది.

Advertisement

Yamini Swetha : యామిని అందం అద‌ర‌హో..

చిత్రంలో హీరోయిన్ సదా చెల్లెలి పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ చాలా నోటెడ్. తన అక్క ప్రేమ గెలవాలని ఈ పాప చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. ముఖ్యంగా అక్షరాలను తిరగేసి రాస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఈ పాత్రకి గాను ఆ పాపకి నంది అవార్డు లభించింది. ఆ పాప పేరు యామిని శ్వేత. ఈమె ప్రముఖ సీరియల్‌ ఆర్టిస్ట్‌ జయలక్ష్మి కూతురు అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ‘జయం’ చిత్రం కంటే ముందుగా దాదాపు 10 సీరియల్స్‌ నటించింది.

Jayam Child Artist yamini swetha new pics viral

Advertisement

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన ఈమె అక్కడ చదువు పూర్తయ్యాక కొన్నాళ్ళు ఉద్యోగం కూడా చేసింది. అటు తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈమెకి ఓ పాప కూడా ఉంది. ఇక ఈమె చదువుకుంటున్న టైములో ‘నచ్చావులే’ వంటి సినిమాల్లో కూడా ఈమెకి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని సున్నితంగా తిరస్కరించింది యామిని. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను కూడా మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసింది.ఇప్పుడు యామిని అందాన్ని చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి