Home » Entertainment » Jayavan Comments On Those Three Tollywood Directors
Entertainment

Jayavani : ఆ ముగ్గురు దర్శకులు న‌న్ను అలా అన్నారు.. జయవాణి సంచలన కామెంట్స్..!

Authored By
mallesh
The Telugu News | Updated on: December 3, 2021 7:03 pm
Advertisement

Jayavani : చాలా మంది సినిమాల్లో పలు పాత్రలు పోషిస్తుంటారు. కానీ, వారికి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవచ్చు. అయితే, కొందరికి మాత్రం తక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ బోలెడంత గుర్తింపు లభిస్తుంది. ఆ కోవకు చెందిన నటి జయవాణి. ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ఆమెకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఇటీవల కాలంలో ఆమె టాలీవుడ్ దర్శకులపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి. ఇంతకీ ఆమె దర్శకులను ఉద్దేశించి ఏం అందంటే..జయవాణి నటించిన సినిమాలన్నిటిలోనూ దాదాపుగా బోల్డ్ క్యారెక్టర్లలోనే ఆమె కనిపించింది. అలా ఒకే తరహా పాత్రలు పోషించడం వలన జయవాణికి అదే తరహా గుర్తింపు అయితే వచ్చింది.

Advertisement

అయితే, ఒక సినిమాలో ఫిమేల్ విలన్ రోల్ ప్లే చేయాలని దర్శకులు అడగగా, అందుకు జయవాణి నిరాకరించిందట. తాను వెండితెరపై ఏ పాత్ర పోషించినా వంద శాతం న్యాయం చేస్తానని జయవాణి పేర్కొంది.తనకు బోల్డ్ పాత్రల్లో కనిపించాలని లేదని, కానీ, సినిమా అవకాశాన్ని బట్టి అప్పట్లో అటువంటి పాత్రలు పోషించానని జయవాణి తెలిపింది. తాను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లాలని అనుకున్నపుడు తన తల్లిదండ్రులు ఓకే చెప్పారని, తాను తన మామయ్యనే మ్యారేజ్ చేసుకున్నానని అంది జయవాణి.

jayavan comments on those three tollywood directors

Advertisement

Jayavani : అటువంటి పాత్రలకు కేరాఫ్‌గా జయవాణి..!

సినిమాల్లో నటించే ముందర తనకు తన భర్త ఎటువంటి కండీషన్స్ పెట్టలేదని, ఫుల్ సపోర్ట్ చేశారని గుర్తు చేసుకుంది. అయితే, తాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓ ముగ్గురు దర్శకులు తనను నల్లగా ఉన్నావని అన్నారని అంది. అయితే, తాను మేకప్ ద్వారా ఆ సమస్య నుంచి బయటపడ్డానని చెప్పింది. బోల్డ్ అండ్ హాట్ క్యారెక్టర్స్ ప్లే చేయడంలో జయవాణి ఎప్పుడూ ముందే ఉంటుందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో జయవాణి పోషించిన పాత్రకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్‌గా నటించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి