
jeevitha rajasekhar reacts on thumb nails
Jeevitha Rajasekhar : జీవితా రాజశేఖర్.. తెలుగు సినీ పరిశ్రమలో ఆమె స్థానం ప్రత్యేకం. ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన జీవితా రాజశేఖర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే అడపాదడపా జీవితా వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. సినీ నటులు జీవిత, రాజశేఖర్ దంపతులు ఓ సినిమా కోసం రూ.26 కోట్ల అప్పు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు జోష్టర్ ఫిలిం సర్వీసెస్ యాజమాన్యం ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై ఈ రోజు జీవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తనకు సమన్లు వచ్చిన విషయం నిజమేనని.. కానీ, తాను అరెస్ట్ కాలేదని చెప్పారు. ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ చర్చకు దారితీసింది. దీనిపై వివరణ ఇవ్వడానికి శనివారం జీవిత రాజశేఖర్ మీడియా ముందుకొచ్చారు.డా.
రాజశేఖర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘శేఖర్’. మలయాళ హిట్ చిత్రం ‘జోసెఫ్’ మూవీ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లో జీవిత పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఏ ఇష్యూ జరిగినా.. నేనుంటే నేను హెడ్ లైన్ అవుతా.. మొన్న మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేశారు. నేను ప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేశా.. నేనే కాదు చాలామంది ఆయనకి సపోర్ట్ చేశారు.. కానీ నేనే హెడ్ లైన్ అయ్యాను.నేను కానీ రాజశేఖర్ గారు కానీ ఎవరికీ అన్యాయం చేయలేదు.నాకూ ఇద్దరూ కూతుళ్లు ఉన్నారు. మేం ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతాం.. నేను కాస్తైనా కంట్రోల్ చేసుకుంటున్నా కానీ..
jeevitha rajasekhar reacts on thumb nails
మా ఆయన అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏదైనా ఓపెన్‌గా మాట్లాడేస్తారు.దేవుడు దయ వల్ల నేను మా ఆయన నా పిల్లలు అంతా బాగున్నాం.. మా గురించి ఏది జరిగినా రకరకాలుగా తంబ్ నెయిల్స్ పెడుతున్నారు. చాలామంది చదువుకోలేని వాళ్లని వీటి గురించి తెలియదు. చాలామంది నాకు ఫోన్లు చేసి మీ అమ్మాయిలు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. మా అమ్మాయిల గురించి తప్పుడు తంబ్ నెయిల్స్ పెట్టి వార్తలు రాశారు. ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది. విషయం తెలియకుండా వార్తలు రాయడం వల్ల వాళ్ల కెరియర్ ఏమౌతుందో గుర్తించండి.. రేపటి రోజున మా పిల్లలు పెళ్లి చేసుకుని వేరే ఇంటికి వెళ్తారు. వాళ్ల పరిస్థితి ఏం కావాలి.. చాలా హర్టింగ్‌గా ఉంది అని జీవిత బాధపడింది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.