
jnanamba gives serious warning to janaki in janaki kalaganaledu
Janaki Kalaganaledu : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 16 మే 2022, సోమవారం ఎపిసోడ్ 301 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కన్నబాబుతో గొడవ ఎందుకు జరిగిందో జ్ఞానాంబ రామాను ప్రశ్నించడంతో అబద్ధం చెబుతాడు. ఏదో పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని కన్నబాబు నాతో గొడవ పెట్టుకున్నాడు అని అంటాడు రామా. కానీ.. రామా ఎందుకో టెన్షన్ గా ఉండటంతో జ్ఞానాంబకు ఏం అర్థం కాదు. రామా ఎందుకో టెన్షన్ పడుతున్నాడు.. ఏమై ఉంటుంది అని అనుకుంటుంది జ్ఞానాంబ. ఆ తర్వాత అక్కడి నుంచి నీలావతి కూడా వెళ్లిపోతుంది. అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు.
jnanamba gives serious warning to janaki in janaki kalaganaledu
ఆ తర్వాత నీలావతి.. మల్లికను కలిసి తనకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వాలని అడుగుతుంది. కానీ.. నువ్వు ఏం చేశావు.. అసలు గొడవ ఎందుకు జరిగిందో తెలుసుకో అంటే తెలుసుకోలేకపోయావు అంటూ నీలావతిపై చిరాకు పడుతుంది. చివరకు 10 రూపాయలు ఇచ్చి అది షాపునకు సంబంధించిన గొడవ అని నీలావతి చెప్పగానే.. డైరెక్ట్ గా కన్నబాబు దగ్గరికే వెళ్దాం పదా అని నీలావతిని కన్నబాబు దగ్గరికి తీసుకెళ్తుంది. చివరకు కన్నబాబు దగ్గరికి వెళ్లి అతడితో మాట్లాడే ధైర్యం చేయలేకపోతుంది మల్లిక. అతడిని చూసి భయపడి మాట్లాడకుండా.. టీ కొట్టు దగ్గర చాయి తాగినట్టు నటించి అక్కడి నుంచి వెళ్లిపోతారు మల్లిక, నీలావతి.
కట్ చేస్తే రాత్రి అవుతుంది. రామా అన్నం తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అందరూ అన్నం తింటున్నా.. రామా తినకపోవడం గమనిస్తుంది జ్ఞానాంబ. జానకి కూడా రామా ఎందుకో టెన్షన్ పడుతున్నాడని గమనిస్తుంది. చివరకు రామా అన్నం తినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దీంతో జ్ఞానాంబ కూడా అన్నం తినకుండానే వెళ్లిపోతుంది. చివరకు రామా ఎక్కడికి వెళ్లాడు అని చూస్తే.. ఆరు బయట.. కట్టెలు కొడుతూ కనిపిస్తాడు రామా. నేను కూడా కోపంలో ఉన్నప్పుడు ఏదో పని చేస్తాను. రామా కూడా అదే చేస్తున్నాడు.. ఏమైంది అని అనుకుంటుంది.
వెంటనే జానకి దగ్గరికి వెళ్లిన జ్ఞానాంబ.. అసలు నీ భర్త ఏం చేస్తున్నాడు.. ఎంత బాధపడుతున్నాడో నువ్వు ఆలోచించావా అని వార్నింగ్ ఇస్తుంది. మీ అన్నయ్య ఎంతో నా కొడుకును బాధపెట్టాడు. కానీ.. ఇప్పుడు నా కొడుకు ఇంతలా బాధపడటం నేనెప్పుడూ చూడలేదు అంటుంది జ్ఞానాంబ.
నేను నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయడం వల్లే నా బిడ్డకు ఇంత అనుమానం జరిగింది. నా కొడుకు కన్నా నువ్వు ఎక్కువ చదువుకొని ఉండటం వల్లే.. వాడికి ఈ గతి పడింది.. అంటుంది జ్ఞానాంబ. నువ్వు, మీ అన్నయ్య.. అబద్ధాలు చెప్పి మోసం చేసినా సరే.. క్షమించి నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు ఇదా మీరు ఇచ్చే బహుమతి.
తర్వాత రామా రూమ్ లోకి రావడంతో.. ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది జానకి. కానీ.. రామా మాత్రం ఏం లేదు అంటాడు. ఏం సమాధానం చెప్పడు. అంతే కాదు.. చిరాకుతో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు. దీంతో జానకికి ఏం చేయాలో అర్థం కాదు.
తర్వాత జానకి త్వరలో జైలుకు వెళ్తోంది అని మల్లిక.. జ్ఞానాంబతో అంటుంది. దీంతో జానకి మల్లిక చెప్పేది నిజమా అని అడుగుతుంది జ్ఞానాంబ. దీంతో జానకి ఏం సమాధానం చెప్పదు. మాట్లాడు జానకి అంటుంది జ్ఞానాంబ. నువ్వు కన్నబాబు ఇంటికి వెళ్లి వాళ్లతో గొడవ పడ్డావా అని అడుగుతుంది జ్ఞానాంబ. కానీ.. జానకి ఏం సమాధానం చెప్పదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.