Jordar Sujatha Father On Rocking Rakesh
Jordar Sujatha : జబర్దస్త్ స్టేజ్ సుజాత రాకేష్ ప్రేమాయణం మొదలైదనట్టే కనిపిస్తుంది. స్కిట్లు చేసి చేసి నిజంగానే ప్రేమలో పడ్డారా? అనిపిస్తుంది. అయితే ఇలాంటి ట్రిక్కులన్నీ టీఆర్పీల కోసం చేస్తుంటాడు. తెరపై ప్రేమికుల్లా నటిస్తుంటారు. కానీ తెర వెనుక అందరూ సైలెంట్‌గా ఉంటారు. కానీ రాకేష్ సుజాత మాత్రం తెర వెనకాల కూడా దుమ్ములేపుతున్నారు. కలిసి ట్రిప్పులకు వెళ్తున్నారు. పార్టీలు చేసుకుంటున్నారు. ఆ మధ్యో గోవా బీచుల్లో ఈ ఇద్దరూ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అలా ఈ ఇద్దరి వ్యవహారం మాత్రం కాస్త అనుమానంగానే ఉంది. సుజాత రాకేష్ జోడి ప్రేమలో ఉందని అందరూ అనుకుంటున్నారు.
దానికి తగ్గట్టే ఈ ఇద్దరూ వేసే స్కిట్లు, అందులో మాట్లాడే డైలాగ్స్ అలానే ఉంటాయి. ప్రేమ, పెళ్లి చుట్టే ఈఇద్దరి స్కిట్లు సాగుతుంటాయి. అయితే ఎంగేజ్మెంట్ జరిగిన స్కిట్ కూడా వేశారు. మొత్తానికి ఈ ఇద్దరూ మాత్రం త్వరలోనే ఒక్కటి కాబోతోన్నట్టు కనిపిస్తోంది. తాజాగా సుజాత తన తండ్రితో కలిసి స్కిట్ వేసింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఫాదర్స్ డే స్పెషల్‌గా కొంత మంది కమెడియన్ల ఫాదర్స్ వచ్చి స్టేజ్ మీద పర్ఫామెన్స్ చేశారు. అందులో భాగంగా సుజాత తండ్రి వచ్చాడు. సుజాత పరువు తీసి పారేశాడు. నాన్న నీకు రాకేష్ ఎందుకు నచ్చలేదు నాన్న అని అడుగుతుంది సుజాత. నీకు నచ్చాడు కదా? అందుకే నాకు నచ్చలేదు అని అంటాడు.
Jordar Sujatha Father On Rocking Rakesh
దీంతో అందరూ అవాక్కవుతుంటారు. రేపు నాకు రాకేష్‌కు పెళ్లి అయితే.. నువ్ అతడి కాళ్లు కడగాలి అంటుంది సుజాత. నువ్ ఇంట్లోంచి వెళ్లిపోతోన్నావ్ కదా? వాడి కాళ్లేంది.. ఊర్లో వాళ్లందరి కాళ్లు కడుగుతా అని సుజాతను ఘోరంగా అవమానించేస్తాడు సుజాత ఫాదర్. పెళ్లయ్యాక నన్నొచ్చి చూస్తావా? నాన్న అని సుజాత అడుగుతుంది. చెత్తను బయట పడేశాక.. మళ్లీ వెళ్లి చూస్తామా? చెప్పు అని అడుగుతాడు. అంటే నేను చెత్తనా? నాన్న అని సుజాత వాపోతోంది. నువ్ ఇంకా ఇక్కడే ఉంటే నా పరువు మొత్తం తీసేలా ఉన్నావ్ పదా అంటూ అక్కడి నుంచి తీసుకెళ్తుంది సుజాత. చూస్తుంటే సుజాత తండ్రికి తన ప్రేమ, పెళ్లి ఇష్టం లేనట్టుంది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.