Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈనెల చివరలో అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్చి నెల నుండి సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ జరగబోతుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతుందని క్లారిటీ వచ్చింది. అధికారికంగా ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 హీరోయిన్ విషయాన్ని ప్రకటించలేదు
కానీ ఇటీవలే శంషాబాద్ సమీపంలోని ఒక హోటల్ లో కొరటాల శివ ఆధ్వర్యంలో జాన్వీ కపూర్ యొక్క ఫోటో షూట్ నిర్వహించడం జరిగిందట.. ఆ ఫోటో షూట్ లో ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు అనేది సమాచారం అందుతోంది. జాన్వీ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్ కి మంచి టాక్ రావడంతో కొరటాల శివ ఆమెను ఓకే చేశాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం కొందరు పట్టుబట్టి కొరటాల శివకు ఇష్టం లేకుండా కూడా ఎన్టీఆర్ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
ఎన్టీఆర్ గతంలో కూడా కొంత మంది హీరోయిన్స్ విషయంలో ఇలాగే పట్టుబట్టాడని, ఇప్పుడు జాన్వీ కపూర్ తన సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ పంతం నెగ్గించుకున్నాడని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం మాత్రం అది కాదు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు కొరటాల శివ సన్నిహితులు వాదిస్తున్నారు. కొరటాల శివ ఆ మధ్య జాన్వీ ఎంపిక స్వయంగా తన నిర్ణయం అన్నట్లు సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.