Jr NTR Devara Record : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందే రికార్డుల రచ్చ మొదలు పెట్టింది. ఇప్పటికే యూఎస్ లో ప్రీ బుకింగ్స్ తోనే 2 మిలియన్స్ రికార్డ్ బ్రేక్ చేసిన దేవర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా నెక్స్ట్ లెవెల్ రేంజ్ లో బుకింగ్స్ సాధించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని ఏడు థియేటర్ లో మొత్తం 46 షోలు మొదటి రోజు వేయనున్నారు. వాటికి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దేవర మొదటిరోజు కేవలం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచే 1.25 కోట్లు రాబడుతుంది. ఇది నెవర్ బిఫోర్ రికార్డ్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు కల్కి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 87 లక్షలు రాబట్టగా.. మహేష్ గుంటూరు కారం 82 లక్షలు, ఆర్.ఆర్.ఆర్ 76 లక్షలు రాబట్టింది. దేవర సినిమా వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ ఏకంగా 1 కోటి పాతి లక్షల అడ్వాన్స్ సేల్స్ రాబట్టింది.
దేవర అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం అక్కడ మాత్రమే కాఉ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా జరుగుతుంది. ఎక్కడికి అక్కడ ఇలా టికెట్స్ పెట్టడమే ఆలస్యం అలా ఫిల్ అయిపోతున్నాయి. బీ,సీ సెంటర్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక రేంజ్ చూపిస్తున్నాయి. కచ్చితంగా మొదటి రోజు దేవర ఊహలకు కూడా అందని విధంగా రికార్డ్ వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దేవర రికార్డులకు ఫ్యాన్స్ అంతా సాక్ష్యం అయ్యేలా ఉంది.
దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశాడు. అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. సెప్టెంబర్ 27న ఎన్ టీ ఆర్ దేవర ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.