Home » Entertainment » Jr Ntr Fans Have Banned Re Release Of Balakrishna Narasimha Naidu Movie
Entertainment

Jr Ntr Vs Balakrishna : బాలయ్య నరసింహనాయుడు రీ రిలీజ్ ని బ్యాన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. నందమూరి అంతర్యుద్ధం !

Authored By
aruna
The Telugu News | Published on: June 8, 2023, 10:00 am
Advertisement

Jr Ntr Vs Balakrishna : ప్రస్తుతం టాలీవుడ్లో నటసింహం బాలయ్యకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇటీవల వచ్చిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు బాలయ్యకు మంచి పేరును తీసుకొచ్చాయి. అయితే టాలీవుడ్ లో ఇటీవల పాత సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ముందుగా మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాలు విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఈ క్రమంలోనే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన బెస్ట్ మాస్ సినిమా ‘ నరసింహనాయుడు ‘ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. 2001 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీలో ఆల్ టైం నెంబర్ వన్ హిట్ సినిమాగా నిలిచింది. అప్పట్లో మొట్టమొదటి 20 కోట్ల రూపాయల సినిమాగా ఇది నిలిచింది.

Advertisement

అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈనెల 10వ తారీఖున గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. రీరిలీజ్ తో బాలయ్య బాబు ఇప్పటివరకు ఉన్న రిలీజ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తాడని ఫాన్స్ ఆశించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అన్ని ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్ ల ట్రెండ్ గత ఏడాది విడుదలైన చెన్నకేశవరెడ్డి సినిమాతో పోలిస్తే చాలా తక్కువ బుకింగ్స్ వచ్చాయట. చాలా చోట్ల కనీసం 10 టికెట్స్ కూడా అమ్ముడుపోని పరిస్థితి ఏర్పడింది.

Jr ntr fans have banned re release of Balakrishna narasimha naidu Movie

Advertisement

ఇదంతా సోషల్ మీడియాలో ఎన్టీఆర్, బాలయ్య అభిమానుల వార్స్ వల్లే అంటున్నారు విశ్లేషకులు. పెద్ద ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడం దగ్గర నుండి ఈ గొడవ మొదలైంది. దాని వలన ఈ వీక్ అడ్వాన్స్ బుకింగ్ కారణమని అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడడం వల్లే బాలయ్యకి ఇలాంటి ఓపెనింగ్స్ వస్తున్నాయని వాళ్ల సపోర్ట్ లేకపోతే బాలయ్య పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బికె 108 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అన్ని కోణాలలో అందరికీ నచ్చుతుందని , మరీ ముఖ్యంగా బాలయ్య సరికొత్త లుక్కులో కనిపిస్తారని టాక్.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి