Mokshagna Teja : సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తెగ సందడి చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. కాని బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుండో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అదుగో ఇదుగో అంటున్నారే తప్ప మోక్షజ్ఞ డెబ్యూపై క్లారిటీ రావడం లేదు. ఎప్పుడెప్పుడు జూనియర్ బాలయ్య వస్తాడా.. రికార్డుల మోత మోగిస్తాడా అని వేచి చూస్తున్నారు ఫ్యాన్స్ . కానీ మోక్షు మాత్రం రావట్లేదు. బాలయ్య కూడా జూనియర్ బాలయ్య ఎంట్రీ గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వట్లేదు. దాంతో నందమూరి అభిమానులు కూడా విసుగు వచ్చి వారసుడి ఎంట్రీ గురించి ఆరా తీయడం మానేసారు. మోక్షజ్ఞని పరిచయం చేసేందుకు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి వంటి దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
కానీ ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇదే తంతు జరుగుతూ వస్తోంది. అయితే ఇన్నాళ్లకు నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించనున్నాయని, మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. జూన్ 4న ఎన్నికల ఫలితాల రానున్నాయి. ఈ హడావుడి అంతా ముగిశాక.. మంచి రోజు చూసి.. మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్మ్ ని అనౌన్స్ చేయాలని చూస్తున్నారట. అదేరోజు దర్శకుడు పేరుని రివీల్ చేసే అవకాశముంది అంటున్నారు. సెప్టెంబర్ లో మోక్షజ్ఞ పుట్టినరోజు ఉంది. అప్పుడు సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ఈ సినిమాని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్న మోక్షజ్ఞ హీరో కాకపోవడానికి ఎన్టీఆర్ నే కారణమట. అన్న ఎన్టీఆర్ ఎదిగిన తీరు మోక్షజ్ఞను భయపెడుతుంది అట. హీరో అయితే ఎన్టీఆర్ రేంజ్ కి వెళ్ళాలి. కనీసం ఆయన దరిదాపుల్లోకి రావాలి. అది అసాధ్యం అని మోక్షజ్ఞ భావన అట. ఎన్టీఆర్ మాదిరి సక్సెస్ కాకపోతే అది బాలయ్యకు చెడ్డ పేరు తెస్తుంది. తనకు కూడా అవమానకర పరిణామం. అందుకే మోక్షజ్ఞ హీరో కావాలంటే భయపడుతున్నారట. అయితే ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఎన్టీఆర్ వలెనే మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవుతుందనే వాదనలో నిజం లేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.