
Pawan Kalyan : పిఠాపురంలో మారుతున్న సీన్స్.. పవన్‌పై బెట్టింగులు తగ్గుతున్నాయేంటి?
Pawan Kalyan : పిఠాపురం ఈ సారి అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ ఆ నియెజక వర్గంలో పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి దానిపైనే పడింది. ఈ సారి పవన్ గెలుస్తాడా లేదా అనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ నియోజకవర్గ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. తన పార్టీ నాయకులతో పాటు పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతుతో స్థానిక ప్రజలతో చురుగ్గా మమేకమై వారి ఆదరణ పొందుతున్నారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడనప్పటికీ, జనసేన నాయకులు ఇప్పటికే పనిలో ఉన్నారు.
నియోజకవర్గంలో ప్రజలకు మద్దతుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల వన్నెపూడి జంక్షన్‌లో జరిగిన ప్రమాదంలో స్థానిక జనసేన నాయకుడు చెప్పుల నాని మరణించారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జేఎస్పీ నేతలు సోమవారం నాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్..ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగారు.ఈసారి ఎలాగైనా గెలిచి చట్ట సభల్లో అడుగుపెట్టడానికి పవన్ కల్యాణ్ చేయని ప్రయత్నం లేదు. దాదాపు తొంబై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకర్గంలో ఉండటంతో పవన్ అక్కడ నుంచి పోటీ నుంచి పోటీ చూశారు. పోలింగ్ సరళని చూసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు మెజార్టీ ఎంత అనే దానిపైనే చర్చ సాగుతోంది. అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Pawan Kalyan : పిఠాపురంలో మారుతున్న సీన్స్.. పవన్‌పై బెట్టింగులు తగ్గుతున్నాయేంటి?
పోలింగ్ తర్వాత రెండు రోజులు లక్ష మెజార్టీ అన్న జనసేన , టీడీపీ నేతలు..ఇప్పుడు 10 నుంచి 20 వేలు మెజార్టీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. బూత్‌ల వారిగా ఓట్ల లేక్కలు చూసిన తర్వాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు తెలుస్తుంది.పిఠాపురంలో మొత్తం తొంబై వేల దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లు అన్నీ దాదాపుగా పవన్‌కే పడినట్లు తెలుస్తోంది. ఇక మధ్య వయస్సు , మహిళల ఓట్లు మాత్రం కచ్చితంగా వంగా గీతకే మద్దతు నిలిచినట్టు తెలుస్తోంది.నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 32 వేల ఓట్లలో లక్షా ఎనభై వేలు ఓట్లు ఉండగా,కచ్చితంగా లక్షపైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్ల గుద్ది చెబుతోంది. పైకి జనసేన పేరు చెబుతున్నా గ్రౌండ్ లెవల్ వేరేలా ఉందని అంటున్నారు.
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
This website uses cookies.