
star hero in JR NTR movie bollywood crazy heroine
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. వివిధ ప్రాంతాలకు తన టీంతో వెళుతున్న ఎన్టీఆర్ అక్కడి భాషలో మాట్లాడి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన మాటలతో ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా రాజమౌళి కి సంబంధించిన అనేక రకాల విషయాలను కూడా ఇంటర్వ్యూలో సరదాగా షేర్ చేసుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తో ఉన్న అనుబంధం గురించి కూడా తారక్ చాలా విషయాలు చెబుతున్నడు. ఒక విధంగా మెగా అభిమానులతో పాటు అన్ని వర్గాల అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా దగ్గరవుతున్నాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన పాట ఏది అని యాంకర్ ప్రశ్నించగా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రంలోని ఆశ పాశం.. పాట’ అని చెప్పారు. ఫోన్‌లో ఈ పాట ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటానని అన్నారు తారక్. అంతే కాదు ఆ పాట పాడి వినిపించాడు తారక్. ఎన్టీఆర్ తన సినిమాలోని పాట పాడటంతో ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేష్ మహ సంతోషం వ్యక్తం చేశారు. ‘మీ ఫోన్ ప్లేలిస్ట్‌లో ఆశ పాశం.. సాంగ్ ఉండటం సంతోషంగా ఉంది. ధన్యవాదాలు తారక్ గారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలి’ అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jr NTR likes the small movie song
దేశవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది ఆర్ఆర్ఆర్ . రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాదాపు మూడేళ్ళ పాటు ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇక పాన్ ఇండియా మూవీ కావడంతో జక్కన కూడా ప్రమోషన్స్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. వీలైనన్ని ఇంటర్వ్యూలతో హంగామా చేస్తున్నారు చిత్రయూనిట్. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరిసీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.