
Junior NTR – Balakrishna : అదేంటి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య మాటలు లేవు కదా. ఇద్దరూ ఎలా కలిశారు అంటారా? అవును.. ఇద్దరికీ మాటలు లేవు చాలా రోజుల నుంచి అయినా కూడా ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్లు ఏం మాట్లాడుకున్నారు అనేది మనకు అప్రస్తుతం కానీ.. బాలయ్య బాబును జూనియర్ ఎన్టీఆర్ కలిసి వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు వారెవ్వా.. బాబాయి.. అబ్బాయి మళ్లీ కలిసిపోయారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అసలు వీళ్లిద్దరూ ఎక్కడ కలిశారంటే హరికృష్ణ కూతురు సుహాసిని తెలుసు కదా. ఆమె కొడుకు పెళ్లిలో కలిశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లికి బాలయ్య బాబు కూడా వచ్చారు. దీంతో బాలయ్య బాబును చూసిన జూనియర్ ఎన్టీఆర్ వెంటనే వెళ్లి నమస్తే బాబాయ్ అని చెప్పి ఆయన దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడారు.
నందమూరి హరికృష్ణకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు చనిపోయారు. కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు, కూతురు సుహాసిని ఉన్నారు. ఆమె గత ఎన్నికల్లో టీడీపీ నుంచి కూకట్ పల్లి తరుపున పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆమె టీడీపీలో గతంలో ఉండేవారు. కానీ.. ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. సుహాసిని కూకట్ పల్లి నుంచి పోటీ చేసినప్పుడు ఆమె తరుపున జూనియర్ ఎన్టీఆర్ కానీ.. కళ్యాణ్ రామ్ కానీ ప్రచారం చేయలేదు. తనకు కనీసం మద్దతు కూడా ఇవ్వలేదు. దీంతో నందమూరి కుటుంబంతో జూనియర్ ఎన్టీఆర్ కు పొసగడం లేదనే వార్తలు అప్పట్లో వినిపించారు. బాలకృష్ణతో కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి మాట్లాడటం లేదు. కానీ.. తాజాగా సుహాసిని కొడుకు పెళ్లిలో మాత్రం బాలకృష్ణతో మాట కలిపారు జూనియర్ ఎన్టీఆర్.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.