Home » Entertainment » Junior Ntr Follow Prabhas
Entertainment

JR NTR : ప్రభాస్ వేసిన దారిలోనే వెళుతోన్న జూనియర్ ఎన్టీఆర్ !

Authored By
aruna
The Telugu News | Published on: June 3, 2023, 2:00 pm
Advertisement

JR NTR : పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మరో సినిమా సలార్ ను కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తూనే మరో వైపు ప్రాజెక్ట్ కే షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఒకే సమయంలో రెండు మూడు సినిమాల షూటింగ్స్ ను సమాంతరంగా తీసుకు వెళ్లడం ఈ మధ్య కాలంలో కేవలం ప్రభాస్ కు మాత్రమే చెల్లింది.

Advertisement

Junior ntr follow prabhas

అయితే వచ్చే సంవత్సరం ప్రభాస్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకేసారి రెండు సినిమాలను చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల వరకు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ఎన్టీఆర్ హిందీ వార్ 2 సినిమాకు ఓకే చెప్పాడు. అంతే కాకుండా వచ్చే ఏడాది లో కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు.

Advertisement

వచ్చే ఏడాది వార్ 2 మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాలను ఒకేసారి చేయాలని నిర్ణయించుకున్నాడట. 2024 లో ఆ రెండు సినిమాలతో ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉండబోతున్నాడు. ఆ రెండు సినిమాలను కూడా మూడు నాలుగు నెలల గ్యాప్ లోనే 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లాడు. వచ్చాక దేవర సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఎది ఏమైనా మన టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడం గొప్ప విశేషం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి