
Kaikala Satyanarayana tollywood entered as NTR dupe
Kaikala Satyanarayana : సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తెలుగు ఇండస్ట్రీకి దొరికిన గొప్ప నటుడు. ఎలాంటి పాత్రనైనా జీవించే నటుడు కైకాల. విలన్ గా కమెడియన్ గా సెంటిమెంట్ పండించే నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి గొప్ప పేరుతెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో సీనియర్ ఎన్టీఆర్ కి డూప్ గా చేసిన కైకాల ఆ తర్వాత విలన్ గా కమెడియన్ గా ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభియనం, త్రిపాత్రాభియనం చేసిన చాలా మూవీస్ లో సత్యనారాయణ ఆయనకు డూప్‌గా యాక్ట్ చేసారు. అలా కైకాలలోని నటుడిని గుర్తించిన ఎన్టీఆర్ అపూర్వ సహస్ర సచ్ఛరిత్ర మూవీలో సత్యనారాయణకు ఓ పాత్రని ఇప్పించారు. ఆ తర్వాత విలన్ గా, ఫాదర్, అంకుల్ క్యారెక్టర్స్ తో టాలీవుడ్ లో తనకి తిరుగులేదనిపించుకున్నారు…
దాదాపు 750 కి పైగా సినిమాల్లో నటించిన కైకాల ప్రస్తుతం ఆరోగ్య రిత్యా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఏపీలోని కృష్ణ జిల్లా జన్మించిన కైకాల యమధర్మరాజు పాత్రలో ఓదిగిపోయేవారు. నిజంగా యముడు ఇలాగే ఉంటాడేమో అనిపిస్తుంది కైకాల కటౌట్ చూస్తే. కాగా శ్రీకృష్ణార్జున యుద్ధం లో కర్ణుడిగా, లవకుశలో భరతుడిగా, నర్తనశాలలో దుశ్శాసనుడిగా, శ్రీకృష్ణ పాండవీడయం మూవీలో ఘటోత్కచుడిగా, యమలీల చిత్రంలో యముడిగా విభిన్నమైన పౌరాణికి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కైకాల సత్యనారాయణ 1977లో ఎన్టీఆర్‌తో అడవి రాముడు వంటి ఆల్‌టైం బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించారు.
Kaikala Satyanarayana tollywood entered as NTR dupe
ఇక యుముడి పాత్రలో యముడికి మొగుడు, యమలీల వంటి సినిమాల్లో అద్బుత నటన కనబర్చిన కైకాల రవితేజ హీరోగా వచ్చిన దరువు, శ్రీకాంత్ యమగోల మళ్లీ మొదలైంది మూవీస్ లోను సీనియర్ యముడిగా దర్శనమిచ్చారు. ఇక యమగోల సినిమాలో కైకాల యముండా.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. ఇప్పటికీ ఈ డైలాగ్ ని ఫన్నీగా వాడుతుంటారు. కాగా బాలకృష్ణ కోరిక మేరకు ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటించారు. కాగా కైకాల కేజీఎఫ్ చాప్టర్1 మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు.ఇక చివరగా మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమాలో ఓ చిన్న అతిథి పాత్రలో నటించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.